iPhone New Feature : ఆపిల్ కొత్త ఫీచర్.. ఐఫోన్ యూజర్లు ఇక నెట్వర్క్ లేకుండానే ఫొటోలు, మ్యాప్‌లను షేర్ చేయొచ్చు..!
iPhone New Feature : అతి త్వరలో ఐఫోన్లలో ఇంటర్నెట్ లేకుండానే మ్యాప్ షేరింగ్ చేయడం, ఫొటోలను పంపేందుకు అద్భుతమైన ఫీచర్‌ను ఆపిల్ ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందో వివరంగా తెలుసుకుందాం.
iPhone New Feature
- ఐఫోన్ యూజర్ల కోసం త్వరలో అద్భుతమైన ఫీచర్
- ఇంటర్నెట్ లేకున్నా మ్యాప్స్, ఫొటోలు షేర్ చేయొచ్చు
- రాబోయే ఐఫోన్లలో ఈ సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టనున్న ఆపిల్
iPhone New Feature : ఆపిల్ ఐఫోన్ యూజర్ల కోసం అద్భుతమైన ఫీచర్ రాబోతుంది. ఐఫోన్ యూజర్లు ఇకపై ఇంటర్నెట్ లేకుండానే అన్ని పనులను పూర్తి చేయొచ్చు. ఇందుకోసం ఆపిల్ సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది. నివేదిక ప్రకారం.. రాబోయే ఐఫోన్లలో ఇంటర్నెట్ లేకుండా కూడా మ్యాప్‌లు, ఫొటోలను షేర్ చేసేందుకు స్పెషల్ ఫీచర్‌ను ఆపిల్ తీసుకురానుంది.
ఐఫోన్ 14 తర్వాతి మోడళ్లు, ఆపిల్ వాచ్ అల్ట్రా 3లో ఆపిల్ ప్రస్తుత శాటిలైట్ ఫీచర్లకు ఈ ఫీచర్ సపోర్టు చేస్తుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది. ఈ డీల్ 2027 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. ఆపిల్ శాటిలైట్ ఫీచర్లు అమెజాన్ లో ఎర్త్ ఆర్బిట్ (LEO) శాటిలైట్ నెట్‌వర్క్‌పై చేస్తాయి.
ఇంటర్నెట్ లేకుండానే ఐఫోన్లో ఫీచర్లు :
ప్రస్తుతం, ఆపిల్ అందించే ఫీచర్లలో ఎమర్జెన్సీ SOS, ఫైండ్ మై, రోడ్‌సైడ్ అసిస్టెన్స్, మెసేజెస్ ఉన్నాయి. ఈ సర్వీసుల్లో Wi-Fi లేదా మొబైల్ నెట్‌వర్క్‌లు లేని ప్రాంతాలలో కూడా పనిచేస్తాయి. ప్రస్తుతం ఈ ఫీచర్లను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
ఈ కొత్త డీల్ ద్వారా ఆపిల్, అమెజాన్ ఈ ప్రస్తుత సర్వీసులను అందించనున్నాయి. చాలావరకూ రాబోయే ఐఫోన్లు iOS27తో రావచ్చు. ఈ అప్డేట్ వచ్చే జూన్‌లో బీటాలోకి రానుంది. వచ్చే సెప్టెంబర్‌లో కొత్త ఐఫోన్లు లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.
కొత్త ఐఫోన్ ఫీచర్లు ఏంటి? :
ప్రస్తుతం ఆపిల్ శాటిలైట్ ఫీచర్లు చాలా పరిమితంగా ఉన్నాయి. మొబైల్ నెట్వర్క్ లేదా వై-ఫై లేనప్పుడు ఐఫోన్ యూజర్లు SOS మెసేజ్ పంపవచ్చు, ‘Find Me’ ద్వారా తమ లొకేషన్‌ను షేర్ చేయొచ్చు. రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కోసం రిక్వెస్ట్ చేయొచ్చు. సాధారణ టెక్స్ట్‌లు పంపవచ్చు. ఈ ఫీచర్లు లో-బ్యాండ్‌విడ్త్ కారణంగా పరిమితంగా ఉన్నాయి.
రాబోయే ఐఫోన్ ప్రో మోడళ్లలో శాటిలైట్ ద్వారా 5G కనెక్టివిటీ, అలాగే ఆపిల్ మ్యాప్స్‌కు సపోర్టు, మెసేజెస్ ద్వారా ఫొటోలను పంపడం, థర్డ్-పార్టీ యాప్‌లు, శాటిలైట్ కనెక్టివిటీని వినియోగించుకోవచ్చు.
