Noise Earbuds X Price : కేవలం రూ. 2వేల లోపు ధరకే నాయిస్ బడ్స్ X ఇయర్‌బడ్స్.. 35గంటల బ్యాటరీ లైఫ్ కూడా.. ఇప్పుడే కొనేసుకోండి!
Noise Earbuds X Price : ప్రముఖ ట్రూ వైర్‌లెస్ తయారీ హెడ్‌ఫోన్ కంపెనీ నాయిస్ (Noise) మరో కొత్త ఇయర్‌బడ్‌ని ప్రవేశపెట్టింది. అదే.. నాయిస్ బడ్స్ X (Noise Buds X). ఈ సరికొత్త నాయిస్ బడ్స్ X మోడల్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ 35 గంటల బ్యాటరీ లైఫ్‌తో భారత మార్కెట్లో లాంచ్ అయింది.

Noise Buds X with ANC and 35 hours battery launched in India, Price Details
Noise Earbuds X Price : ప్రముఖ ట్రూ వైర్‌లెస్ తయారీ హెడ్‌ఫోన్ కంపెనీ నాయిస్ (Noise) మరో కొత్త ఇయర్‌బడ్‌ని ప్రవేశపెట్టింది. అదే.. నాయిస్ బడ్స్ X (Noise Buds X). ఈ సరికొత్త నాయిస్ బడ్స్ X మోడల్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ 35 గంటల బ్యాటరీ లైఫ్‌తో భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఇయర్‌బడ్స్ కేవలం రూ. 2వేల కన్నా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఇయర్‌బడ్‌లలో నాయిస్ క్యాన్సిలేషన్‌ను అందించే నాయిస్ మొదటి బ్రాండ్‌గా అవతరించింది. ఇయర్‌బడ్‌లు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీని కలిగి ఉంటాయి.
ఈ ఇయర్ బడ్స్ బయట సౌండ్‌ను 25db వరకు తగ్గిస్తాయి. నాయిస్ బడ్స్ X గురించి నాయిస్ సహ-వ్యవస్థాపకుడు అమిత్ ఖత్రి మాట్లాడుతూ.. ‘బెస్ట్ ఆడియో క్వాలిటీని అందించడంతో పాటు యూజర్ అనుభవాన్ని అందించే సరసమైన ధరకే అందుబాటులోకి వచ్చింది. నాయిస్ బడ్స్ X ట్రూ వైర్‌లెస్ ప్రపంచంలో నిజంగా విప్లవాత్మకమైనది. అత్యుత్తమ నాణ్యత గల ఆడియో ప్రొడక్టులను అందించడంలో మా నిబద్ధతకు నిదర్శనం. అత్యుత్తమ సౌండ్ క్వాలిటీతో పాటు కొత్త యుగం కస్టమర్‌లకు కొత్త ఫీచర్లతో ఇయర్ బడ్స్ అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.
నాయిస్ బడ్స్ X ధర ఎంతంటే? :
నాయిస్ బడ్స్ X భారత మార్కెట్లో ధర రూ. 1,999కి లాంచ్ అయింది. ఇయర్‌బడ్‌లు కార్బన్ బ్లాక్, స్నో వైట్‌లో అందుబాటులో ఉన్నాయి. iOS, Android డివైజ్‌లకు ఫంక్షనల్ యాక్సెసరీగా చేసే ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉన్నాయి.

Noise Earbuds X Price : Noise Buds X with ANC and 35 hours battery launched in India
నాయిస్ బడ్స్ X స్పెసిఫికేషన్స్ ఇవే :
నాయిస్ బడ్స్ X ఇయర్ బడ్స్ 35 గంటల వరకు బ్యాటరీ లైఫ్ కలిగి ఉంటుంది. InstachargeTM టెక్నాలజీని కలిగి ఉంటుంది. కేవలం 10 నిమిషాల ఛార్జ్‌తో 120 నిమిషాల ప్లేటైమ్‌ను అందిస్తుంది. Quad Mic ENC (ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్)తో కాల్‌లు ఎలాంటి అంతరాయం లేకుండా వినియోగించుకోవచ్చు. అదనంగా, ఇయర్‌బడ్‌లు ట్రాన్స్‌పరెన్సీ మోడ్‌తో వస్తాయి. మోడ్‌ను ఆన్ లేదా ఆఫ్ చేసేందుకు వాయిస్ ఉపయోగించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అవసరమైనప్పుడు బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను తగ్గిస్తుంది. 12mm డ్రైవర్లు, బ్లూటూత్ 5.3తో నాయిస్ బడ్స్ X క్లియర్ సౌండ్, లోతైన బాస్‌తో ఆడియో ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
ఇయర్‌బడ్‌లు HyperSyncTM టెక్నాలజీతో వస్తాయి. మీరు ఛార్జింగ్ కేస్‌ను ఓపెన్ చేసిన వెంటనే ఆటోమాటిక్‌గా మోడ్‌లోకి వెళుతుంది. ఇయర్‌బడ్స్‌లో పవర్-సేవింగ్ ఫీచర్ కూడా ఉంది. ఇయర్ బడ్స్ ఛార్జింగ్ కేస్‌లో ఉంచి.. మూత పెట్టినప్పుడు వాటిని ఆటోమేటిక్‌గా ఆఫ్ చేస్తుంది. కేవలం రూ. 1,999 ధరకే, నోయిస్ బడ్స్ X సరసమైన ధరలో ప్రీమియం ఫీచర్‌లను అందిస్తుంది. దాంతో హై-క్వాలిటీ ఆడియోను ఆస్వాదించాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇయర్‌బడ్‌లు Amazon, GoNoise.comలో కార్బన్ బ్లాక్, స్నో వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి.