హెచ్ఎండీ గ్లోబల్ ఆధారిత సంస్థ నోకియా మరో కొత్త మోడల్ ను భారత మార్కెట్లలోకి ప్రవేశపెట్టింది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్లలో కూడా రంగం ప్రవేశం చేసిన నోకియా బేసిడ్ మొబైల్ వెర్షన్ నోకియా 106 ఫీచర్ ఫోన్ ను బుధవారం విడుదల చేసింది.
హెచ్ఎండీ గ్లోబల్ ఆధారిత సంస్థ నోకియా మరో కొత్త మోడల్ ను భారత మార్కెట్లలోకి ప్రవేశపెట్టింది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్లలో కూడా రంగం ప్రవేశం చేసిన నోకియా బేసిడ్ మొబైల్ వెర్షన్ నోకియా 106 ఫీచర్ ఫోన్ ను బుధవారం విడుదల చేసింది. ఈ నోకియా 106 ఫోన్ ధర ఎంతో తెలుసా? అక్షరాలా రూ. 1,299/-. నోకియా విడుదల చేసిన ఈ కొత్త ఫోన్ హ్యాండ్ సెట్ డార్క్ కలర్ లో మార్కెట్ లో లభ్యం కానుంది. దేశంలోని అన్ని రిటైలర్ మొబైల్ షాపుల్లో, నోకియా అధికారిక వెబ్ సైట్ నుంచి ఈ ఫోన్ కొనుగోలు చేసుకోవచ్చు. ఇక నోకియా బ్యాటరీ విషయానికి వస్తే.. 21 రోజుల ఛార్జింగ్ స్టోరేజ్ క్యాపసిటీ, 15.7 గంటల వరకు టాక్ టైమ్ దీని సొంతం. ‘‘ ఫీచర్ ఫోన్ మార్కెట్ కు భారత్ ప్రధానమైన మార్కెట్. ఎక్కువ లైఫ్ కలిగిన బ్యాటరీ ఫోన్లు కోరుకొనే వినియోగదారులే ఇక్కడ ఎక్కువ. సులభంగా ఫోన్ అపరేట్ చేయడానికి ఎంతో వీలుగా ఉంటుంది. నోకియా ధృఢత్వం కలది కూడా. నోకియా ఫోన్లకు ఉన్న క్రేజ్ దృష్ట్యా మిలియన్ల మంది వినియోగదారులకు సేవలు అందించాలనే ఉద్దేశంతోనే నోకియా 106 ఫీచర్ తో మళ్లీ మార్కెట్లోకి తెచ్చాం’’ అని హెచ్ఎండీ గ్లోబర్ హెడ్ ఇండియా, కౌంటీ ప్రెసిడెంట్ అజేయ్ మెహతా చెప్పారు.
నోకియాలో మరో విశేషం ఏంటంటే.. నోకియా-106 ఫోన్ ఛార్జింగ్ చేసేందుకు మైక్రో యూఎస్బీ ఛార్జర్ ఆప్షన్ కూడా వినియోగదారులకు ఇచ్చినట్టు ఆయన అన్నారు. ఈ డివైజ్ లో ఆకట్టుకొనే మరో ఫీచర్ జెంజియా గేమ్ మాత్రమే కాకుండా 2వేల కాంటాక్టులు, 500 వరకు టెక్ట్స్ మెసేజ్ లు స్టోర్ చేసుకునే సామర్థ్యం ఉంది. అంతేకాదండోయ్.. ఈ ఫోన్ లో ఎల్ ఈడీ టార్చ్ కూడా ఉంది. ఎఫ్ఎం రేడియో ఆప్షన్ కూడా ఇచ్చారు. నోకియా 106 స్పోర్ట్స్ పాలీకార్బొనేట్ బాడీతో రూపొందించిన కారణంగా ఏమైనా గీతలు పడినా కూడా కనిపించవని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.