Nokia G42 5G Android 14 Update Reportedly Rolling Out to Users in India
Nokia G42 5G Update : ప్రముఖ హెచ్ఎండీ గ్లోబల్ ఫోన్ నోకియా జీ42 5జీ ఫోన్‌కు సంబంధించిన కొత్త ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్ భారత్‌లో రిలీజ్ అయింది. తద్వారా కొత్త అప్‌డేట్ అందుకున్న ఫస్ట్ హెచ్ఎండీ గ్లోబల్ ఫోన్‌గా నిలిచింది. మే 2023లో జరిగిన (Google I/O) ఈవెంట్‌లో సరికొత్త ఆండ్రాయిడ్ OS రిలీజ్ అయింది. తదనంతరం, గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ గత ఏడాది అక్టోబర్‌లో లాంచ్ సందర్భంగా ఈ కొత్త అప్‌డేట్ అందుకున్న మొదటిది.
Read Also : Google Pixel 8 Series : గూగుల్ పిక్సెల్ 8 ఫోన్లలో మరో కొత్త కలర్ ఆప్షన్ వచ్చేసింది.. మింట్ లుక్ అదిరింది..!
అప్పటినుంచి Samsung, OnePlus, Xiaomi వంటి ఇతర అనేక స్మార్ట్‌ఫోన్ తయారీదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లకు ఈ కొత్త ఆండ్రాయిడ్ అప్‌డేట్ రిలీజ్ చేయడం ప్రారంభించారు. ఇప్పుడు ఈ జాబితాలో హెచ్ఎండీ గ్లోబల్ కూడా చేరింది. ఓటీఏ అప్‌డేట్‌లో డిసెంబర్ 2023 ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ కూడా ఉన్నట్లు నివేదించింది.
అతి త్వరలో అందరికి కొత్త అప్‌డేట్ :
నోకియా పవర్ యూజర్ నివేదిక ప్రకారం.. నోకియా జీ42 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్ భారత్ సహా మరికొన్ని మార్కెట్‌లలో లాంచ్ కానుంది. ఈ అప్‌డేట్ నిజంగా అందుబాటులోకి వస్తుందో లేదో క్లారిటీ లేదు. కానీ మీరు ఇంకా అప్‌డేట్‌ని అందుకోకపోతే చింతించకండి. ఈ అప్‌డేట్‌లు బ్యాచ్‌ల వారీగా అందుబాటులోకి వస్తాయి.
భారత్ యూజర్లకు ప్రతి ఒక్కరూ అప్‌డేట్ పొందడానికి కొన్ని రోజులు పట్టవచ్చు. రాబోయే వారాల్లో ఈ కొత్త అప్‌డేట్ ఇతర మార్కెట్లలో రిలీజ్ అవుతుందని భావిస్తున్నారు. ఓటీఏ (OTA) అప్‌డేట్ వెర్షన్ నం. వి2.160, డిసెంబర్ 2023కి సంబంధించిన సెక్యూరిటీ ప్యాచ్ కూడా ఉంది. అప్‌డేట్ మొత్తం సైజు 2.68జీబీగా ఉంది.
Nokia G42 5G Android 14 Update in India
కొత్త అప్‌డేట్‌తో మరిన్ని ఫీచర్లు :
నోకియా పవర్ యూజర్ షేర్ అధికారిక చేంజ్‌లాగ్ ప్రకారం.. నోకియా జీ42 5జీ హెల్త్ ఫీచర్లను విస్తరించడానికి ఆండ్రాయిడ్ 14తో పాటు విజన్, ఇయరింగ్-ఇంకేబుల్ ఫీచర్లు రానున్నాయి. లాక్ స్క్రీన్ కస్టమైజేషన్ ఏఐ రూపొందించిన వాల్‌పేపర్‌లు, అల్ట్రా హెచ్‌డీఆర్ ఫొటోలకు సపోర్టు వంటి సాధారణ ఆండ్రాయిడ్ 14 ఫీచర్లు ఈ అప్‌డేట్‌తో నోకియా జీ42 5జీకి వస్తాయి. నోకియా జీ605 5జీ, నోకియా ఎక్స్30 5జీ ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్‌ను పొందడానికి తదుపరి వరుసలో ఉంటాయి. అప్‌డేట్స్ పొందే నోకియా డివైజ్‌ల పూర్తి జాబితాను హెచ్‌ఎండీ గ్లోబల్ ఇంకా వెల్లడించలేదు.
నోకియా జీ42 5జీ స్పెసిఫికేషన్లు :
నోకియా జీ42 5జీ ఫోన్ 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 480+ చిప్‌సెట్ ద్వారా 16జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ మాక్రో సెన్సార్, 2ఎంపీ డెప్త్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
ముందు భాగంలో సెల్ఫీల కోసం 8ఎంపీ సెన్సార్‌ను కలిగి ఉంది. దీనికి 20డబ్ల్యూ వైర్డు ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీ ఉంది. 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో నోకియా జీ42 5జీ బేస్ మోడల్ ధర రూ. 12,999, 256జీబీ ఇంబిల్ట్ స్టోరేజ్ మోడల్‌తో 8జీబీ ర్యామ్ ధర రూ. 16,999కు కొనుగోలు చేయొచ్చు.