Nokia T20 Tablet: భారత్‌కు నోకియా T20 ట్యాబ్లెట్.. ఫ్లిప్‌కార్ట్‌లో దీపావళి సేల్.. ధర ఎంతంటే?

నోకియా కొత్త ట్యాబ్లెట్ భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. అదే.. Nokia T20 Tablet. ఈ ట్యాబ్లెట్ లాంచింగ్ ముందుగానే ఫ్లిప్ కార్ట్‌లో లిస్టు అయింది.

Nokia T20 Tablet Sale : ప్రముఖ HMD గ్లోబల్ కంపెనీ బ్రాండ్ నోకియా కొత్త ట్యాబ్లెట్ భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. అదే.. Nokia T20 Tablet.. ఈ ట్యాబ్లెట్ లాంచింగ్ ముందుగానే ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్‌లో లిస్టు అయింది. దీపావళి సేల్ సందర్భంగా ఈ కొత్త T20 ట్యాబ్లెట్ అమ్మకానికి రెడీ కానుంది. నవంబర్ 3 నుంచి ఫ్లిప్ కార్ట్‌లో దీపావళి సేల్ ప్రారంభం కానుంది. ఇంతలోనే ఫ్లిప్‌కార్ట్‌ తన టీజర్ పోస్టర్​లో Nokia T20 Tablet లిస్ట్​లో చేర్చింది. గ్లోబల్​ మార్కెట్​లో ఈ ట్యాబ్లెట్ లాంచ్ కాగా.. అందులోని ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి. ఈ T20 ట్యాబ్లెట్ 10.4 అంగుళాల 2K డిస్‌ప్లేతో వస్తోంది.

వర్చువల్ ఇంటరాక్షన్ కోసం స్టీరియో స్పీకర్లను యాడ్ చేసింది. 8,200mAh లాంగ్ లాస్టింగ్ బ్యాటరీతో పాటు ప్రత్యేక గూగుల్​ కిడ్స్​ స్పేస్ (Kids Space) అప్​డేటెడ్​ ఫీచర్లను జోడించింది. భారత మార్కెట్​లో నోకియా T20 ధరకు సంబంధించి ఎలాంటి వివరాలు రివీల్ చేయలేదు. గ్లోబల్​ మార్కెట్​తో భారత మార్కెట్లో ఈ నోకియా టీ20 ట్యాబ్లెట్ ధర సమానంగా ఉంటుందని అంచనా. యూరప్‌లో ఈ నోకియా T20 Wi-Fi వేరియంట్​ ధర EUR 199 (దాదాపు రూ. 17,200)గా అందుబాటులో ఉంది. అలాగే Wi-Fi+ 4G మోడల్ ప్రారంభ ధర EUR 239 (సుమారు రూ. 20,600)నుంచి అందుబాటులో ఉంది. భారత మార్కెట్లో ఈ ట్యాబ్లెట్ ధర ఎంత ఉంటుందో వివరాలు తెలియదు. ఆసక్తిగల వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్‌లో భాగంగా ఈ ట్యాబ్లెట్ సొంతం చేసుకోవచ్చు.
Pushpa: రంగస్థలాన్ని మర్చిపోని సుక్కూ.. పుష్పలో అదే ఫార్ములా!

Nokia T20 Specifications :
నోకియా T20 ఆండ్రాయిడ్​ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. రెండేళ్ల వారంటీ OS Upgrade‌, మూడేళ్ల వారంటీతో సెక్యూరిటీ ఫీచర్లను యాడ్ చేసింది. ఈ టాబ్లెట్‌లో 10.4 అంగుళాల 2K (2,000×1,200 పిక్సెల్‌) ఇన్-సెల్ డిస్‌ప్లేని అందించింది. 3GB RAM​, 4GB RAM ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ట్యాబ్లెట్​ ఆక్టా-కోర్ యూనిసోక్​ T610 SoC ప్రాసెసర్​ ద్వారా పనిచేస్తుంది. నోకియా T20 టాబ్లెట్‌లో 32GB, 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్​ ఆప్షన్లతో వస్తోంది. మైక్రో SD కార్డ్ సాయంతో ఈ స్టోరేజ్​ను 512GB వరకు ఎక్స్ ఫ్యాండ్ చేసుకోవచ్చు.

అలాగే.. ఫోటోలు, వీడియోలు తీసుకునేందుకు ఫ్రంట్ సైడ్ 5MP సెల్ఫీ సెన్సార్ కెమెరా, వెనుకవైపు 8MP కెమెరా సెన్సార్‌ అమర్చారు. వెనుక LED ఫ్లాష్‌ కెమెరా సెటప్ కూడా ఉంది. నోకియా 8,200mAh బ్యాటరీతో వస్తోంది. 15W ఫాస్ట్ ఛార్జింగ్​కు సపోర్టు చేస్తుంది. ఒకసారి ఛార్జ్‌ చేస్తే రోజంతా పనిచేస్తుంది. Nokia T20 టాబ్లెట్‌లోని కనెక్టివిటీలో 4G LTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, USB Type- C, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, స్టీరియో స్పీకర్లు, యాంప్లిఫైయర్​ వంటి ఫీచర్లను అందిస్తోంది.
Stock Market : ఈరోజూ భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు.. 8రోజుల్లో రూ.17ల‌క్ష‌ల కోట్లు ఆవిరి

ట్రెండింగ్ వార్తలు