Nothing Phone 4a (Image Credit To Original Source)
Nothing Phone 4a Series : నథింగ్ ఫోన్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. 2026 ఏడాదిలో కొత్త నథింగ్ ఫోన్ కొనాలని చూస్తుంటే ఇది మీకోసమే.. రాబోయే నథింగ్ ఫోన్ మోడల్స్ అత్యంత ఖరీదైనవిగా మారనున్నాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ నథింగ్ త్వరలో మార్కెట్లోకి నథింగ్ ఫోన్ 4aను లాంచ్ చేయబోతోంది.
గత కొన్ని నెలలుగా నథింగ్ అభిమానులు ఈ స్మార్ట్‌ఫోన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీరు కూడా ఈ నథింగ్ ఫోన్ కోసం చూస్తుంటే నిజంగా షాకింగ్ న్యూసే.. రాబోయే నథింగ్ స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా పెరగనున్నాయి. దీనికి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. నథింగ్ ఫోన్ 4a లాంచ్‌కు సంబంధించి కంపెనీ సీఈఓ కార్ల్ పీ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
ర్యామ్ ధరలు మరింత పెరిగే అవకాశం :
నథింగ్స్ సీఈఓ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా కీలక విషయాన్ని రివీల్ చేశారు. ఈ ఏడాదిలో మెమరీ ఖర్చులు, స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా పెరుగుతాయని ఆయన హెచ్చరించారు. మార్కెట్లో ఈ ట్రెండ్ కనీసం రాబోయే 12 నుంచి 24 నెలల వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ మార్పులతో ర్యామ్ ధరలు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు.
Nothing Phone 4a (Image Credit To Original Source)
మార్చి నెలాఖరులోపు లాంచ్ అయ్యే నథింగ్స్ స్మార్ట్‌ఫోన్‌లలో కొన్ని UFS 3.1 స్టోరేజీ సపోర్టుతో రావొచ్చునని సీఈఓ తెలిపారు. మెమరీ ఖర్చులు ఇప్పటికే 3 రెట్లు పెరిగాయని ఆయన చెప్పారు. మెమరీ మాడ్యూళ్ల ధర 2026 చివరి నాటికి 100 డాలర్లు దాటవచ్చని కూడా పీ అంచనా వేశారు. ఒక ఏడాది క్రితం దాదాపు 20 డాలర్లుగా ఉండేది.
సీఈఓ కార్ల్ పీ ఇంకా రాబోయే స్మార్ట్‌ఫోన్లపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ, లీక్‌లను పరిశీలిస్తే.. నథింగ్ ఫోన్ (4a) సిరీస్‌తో రానున్నట్టు సూచిస్తున్నాయి. కంపెనీ గత ఏడాది మార్చి ప్రారంభంలో నథింగ్ ఫోన్ (3a), నథింగ్ ఫోన్ (3a) ప్రోలను లాంచ్ చేసింది. వచ్చే మార్చి ప్రారంభంలో కంపెనీ అప్‌గ్రేడ్ వెర్షన్లుగా నథింగ్ ఫోన్ (4a), నథింగ్ ఫోన్ (4a) ప్రోలను లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు.
UFS 3.1 సపోర్టు :
గత ఏడాదిలో లాంచ్ అయిన నథింగ్ ఫోన్ (3a), నథింగ్ ఫోన్ (3a) ప్రోలలో కంపెనీ UFS 2.2 స్టోరేజ్‌కు సపోర్టు ఇస్తుంది. కార్ల్ పీ ప్రకటన తర్వాత రాబోయే నథింగ్ ఫోన్ UFS 3.1 సపోర్ట్‌తో వస్తుందని భావిస్తున్నారు. అయితే, దాదాపు ఒక ఏడాది క్రితం నథింగ్ యూఎఫ్ఎస్ 3.1 వినియోగంపై పెద్దగా ప్రయోజనం లేదని పేర్కొంది. కానీ, ఇప్పుడు, కంపెనీ నెక్ట్స్ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ స్టోరేజ్ వేరియంట్‌తో లాంచ్ చేసే అవకాశం ఉంది.