Nothing Phone 2a Plus
Nothing Phone 2a Plus : అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్ ఈరోజే లాస్ట్.. మరికొద్దిగంటల్లో ఈ సేల్ ముగియనుంది. స్మార్ట్‌ఫోన్ డీల్స్ కొనేందుకు కొద్ది సమయం (Nothing Phone 2a Plus) మాత్రమే ఉంది. మీరు కొత్త ఫోన్ కొనుగోలు చేయాలంటే ఇప్పుడే త్వరపడండి. ఈ సేల్‌లో భాగంగా నథింగ్ ఫోన్ 2a ప్లస్ ధర రూ.7వేలకు పైగా తగ్గింపు పొందింది. నథింగ్ ఫోన్ 2a ప్లస్ అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
నథింగ్ ఫోన్ 2a ప్లస్ డీల్ :
భారత మార్కెట్లో నథింగ్ ఫోన్ 2a ప్లస్ ఫోన్ రూ.27,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ప్రస్తుతం, అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ రూ.21,730కి లభ్యమవుతుంది. అసలు ధర కన్నా రూ.6,269 తక్కువ. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్, SBI క్రెడిట్ కార్డ్, HDFC క్రెడిట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై అదనంగా రూ.1,000 తగ్గింపు పొందవచ్చు. ఇంకా ఎక్కువ ఆదా కోసం పాత స్మార్ట్‌ఫోన్‌ను ట్రేడ్ చేయవచ్చు.
నథింగ్ ఫోన్ 2a ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
నథింగ్ ఫోన్ 2a ప్లస్ 6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, FHD+ రిజల్యూషన్, 10-బిట్ కలర్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. హుడ్ కింద, నథింగ్ ఫోన్ 2a ప్లస్ మీడియాటెక్ డైమెన్సిటీ 7350 ప్రో ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది.
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ నథింగ్ హ్యాండ్‌సెట్‌లో డ్యూయల్ 50MP బ్యాక్ కెమెరా సెటప్, 50MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇంకా, ఈ ఫోన్ 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ కలిగి ఉంది.