Nothing Phone 2a Plus : సూపర్ డిస్కౌంట్.. అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 2a ప్లస్ కేవలం రూ. 9,259 మాత్రమే.. డోంట్ మిస్!
Nothing Phone 2a Plus : నథింగ్ ఫోన్ 2a ఫోన్ కావాలా? అమెజాన్‌లో ఈ ఫోన్ ధర భారీగా తగ్గింది. ఎంత తగ్గిందంటే?

Nothing Phone 2a Plus
Nothing Phone 2a Plus : నథింగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? అద్భుతమైన కెమెరా ఫీచర్లు కలిగిన నథింగ్ ఫోన్ 2a ప్లస్ (Nothing Phone 2a Plus) సరసమైన ధరకే సొంతం చేసుకోవచ్చు.
క్లీన్ యూజర్ ఇంటర్‌ఫేస్, పర్ఫార్మెన్స్, కెమెరా ఫోన్ కోరుకుంటే రూ. 20వేల కన్నా తక్కువ ధరకే పొందవచ్చు. అన్ని డిస్కౌంట్లు, తగ్గింపు తర్వాత నథింగ్ ఫోన్ 2a ప్లస్ ఇప్పుడు అమెజాన్‌లో రూ. 18,700 కన్నా తక్కువ ధరకు లభ్యమవుతుంది.
Read Also : iPhone 14 Price : ఐఫోన్ 14 ధర భారీగా తగ్గిందోచ్.. ఇలా చేస్తే కేవలం రూ. 20వేలకే కొనేసుకోవచ్చు.. డోంట్ మిస్!
నథింగ్స్ ఈ-స్టోర్‌లో రూ.27,999 ధర ఉండగా.. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై అమెజాన్‌లో రూ.9,200 కన్నా ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు. అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 2a ప్లస్ ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 2a ప్లస్ ధర :
ప్రస్తుతం అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 2a ప్లస్ ఫోన్ రూ.19,990కి లభ్యమవుతుంది. రూ.8వేలు తగ్గింపు పొందవచ్చు. IDFC, HSBC ఇతర క్రెడిట్ కార్డులు ఉంటే.. ఈ ఫోన్ కొనుగోలుపై రూ.1,250 వరకు సేవ్ చేసుకోవచ్చు.
రూ.18,700 కన్నా తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. నెలకు రూ.969 నుంచి ఈఎంఐ లేదా నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు.
మీ ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకోవాలంటే ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. రూ. 18,950 వరకు వాల్యూను పొందవచ్చు. మీ ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్, బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది. కొనుగోలుదారులు అదనంగా చెల్లిస్తే ఎక్స్‌టెండెడ్ వారంటీ, స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ వంటి మరెన్నో ప్రయోజనాలు పొందవచ్చు.
నథింగ్ ఫోన్ 2a ప్లస్ స్పెసిఫికేషన్లు (Nothing Phone 2a Plus) :
నథింగ్ ఫోన్ 2a ప్లస్ 6.7-అంగుళాల FHD+ ఫ్లెక్సిబుల్ అమోల్డ్ ప్యానెల్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. 1,300 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని కూడా అందిస్తుంది.
HDR10+కు సపోర్టు ఇస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అందిస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 7350 ప్రో ద్వారా పవర్ పొందుతుంది.
12GB వరకు LPDD4X ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీతో వస్తుంది. ఈ నథింగ్ ఫోన్ 5,000mAh బ్యాటరీ, 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది.
కెమెరా విషయానికొస్తే.. ఈ నథింగ్ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో వస్తుంది. 50MP ఫ్రంట్ కెమెరాను కూడా అందిస్తుంది.