PM Kisan Yojana : బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్ రైతులకు ఇదే లాస్ట్ ఛాన్స్.. ఈ పని చేయకపోతే రూ. 2వేలు పడవు.. స్టేటస్ చెక్ చేయండిలా..!
PM Kisan Yojana : పీఎం కిసాన్ 20వ విడత అతి త్వరలో విడుదల కానుంది. ఈలోగా రైతులు తప్పనిసరిగా e-KYC ప్రక్రియను పూర్తి చేయాలి.

PM Kisan Yojana
PM Kisan Yojana : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. మరికొద్ది రోజుల్లో పీఎం కిసాన్ 20వ విడత (PM Kisan Yojana) విడుదల కానుంది. ఈలోగా కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేసిన రైతులకు మాత్రమే వారి బ్యాంకు అకౌంట్లలో రూ. 2వేలు పడతాయి.
దేశంలోని కోట్లాది మంది రైతులకు ఆర్థిక సహాయం కోసం పీఎం నరేంద్ర మోదీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ఏడాదికి మొత్తం రూ. 6వేలు ఆర్థిక సాయంగా నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ అవుతుంది.
కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని ప్రతి 4 నెలలకు ఒకసారి రూ. 2వేలు చొప్పున 3 వాయిదాలలో అందిస్తుంది. పీఎం కిసాన్ యోజన ప్రయోజనాల కోసం నమోదిత రైతులు ఇప్పుడు OTP-ఆధారిత e-KYC చేయించుకోవడం తప్పనిసరి. రైతు e-KYC పెండింగ్‌లో ఉంటే.. పీఎం కిసాన్ వాయిదాను పొందలేరు.
e-KYC లేకుండా రూ. 2వేలు పడవు :
పీఎం కిసాన్ యోజన కోసం e-KYC (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) పెండింగ్‌లో ఉంటే.. మీ ఐడెంటిటీ వెరిఫికేషన్ పూర్తి కాలేదని గమనించాలి.
తద్వారా మీకు రాబోయే ఆర్థిక ((PM Kisan Yojana) సహాయం నిలిచిపోతుంది. ఈ పథకాన్ని పొందాలంటే రైతులందరూ తప్పనిసరిగా e-KYC చేయించుకోవడం చాలా ముఖ్యం.
మీ e-KYC పెండింగ్‌లో ఉంటే.. వెంటనే పూర్తి చేయండి. లేదంటే రాబోయే 20వ విడత డబ్బులు నిలిచిపోయే అవకాశం ఉంది. ఈ-కేవైసీ ప్రక్రియ చాలా ఈజీగా ఉంటుంది. మీఇంట్లో కూర్చొని మీ మొబైల్ ఫోన్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చు.
పీఎం కిసాన్ e-KYC ఎలా చేయాలి? :
పీఎం కిసాన్ కోసం e-KYC చేయడం చాలా సులభం. ఇలా వెంటనే పూర్తి చేయవచ్చు.
- ముందుగా, పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ విజిట్ చేయండి.
- అధికారిక వెబ్‌సైట్ (https://pmkisan.gov.in/) విజిట్ చేయండి.
- వెబ్‌సైట్ రైట్ సైడ్ ‘Farmer Corner’ కింద, ‘e-KYC’ బాక్సుపై క్లిక్ చేయండి.
- మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ‘Search’ బటన్‌పై క్లిక్ చేయండి.
- ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
- OTP ఎంటర్ చేసి ‘Submit’ బటన్ పై క్లిక్ చేయండి.
- ఆ వెంటనే, మీ e-KYC ప్రక్రియ పూర్తవుతుంది.
- స్క్రీన్ పై కన్ఫర్మేషన్ మెసేజ్ చూడవచ్చు.
ఫిబ్రవరి 24న 19వ విడత విడుదల అయింది. పీఎం మోదీ చివరిసారిగా బీహార్ పర్యటన సందర్భంగా పీఎం కిసాన్ 19వ విడతను విడుదల చేశారు.
Read Also : iPhone 14 Price : ఐఫోన్ 14 ధర భారీగా తగ్గిందోచ్.. ఇలా చేస్తే కేవలం రూ. 20వేలకే కొనేసుకోవచ్చు.. డోంట్ మిస్!
19వ విడత తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా రైతులు 20వ విడత కోసం చూస్తున్నారు. లబ్ధిదారు రైతులకు 20వ విడత డబ్బు ఈ జూన్ నెలాఖరులో అందే అవకాశం ఉంది.