Post Office Schemes : మహిళల కోసం పోస్టాఫీస్‌లో 5 అద్భుతమైన పథకాలు.. ఇలా పెట్టుబడి పెడితే భారీగా సంపాదించుకోవచ్చు..!
Post Office Schemes : మహిళల కోసం పోస్టాఫీసులో పథకాల ద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చు. ఏయే పథకాల్లో ఎన్ని ప్రయోజనాలున్నాయంటే?

Post Office Scheme
Post Office Schemes : మహిళల కోసం పోస్టాఫీసులో అద్భుతమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. మహిళా పెట్టుబడిదారులకు (Post Office Schemes) అనేక బెస్ట్ ఆప్షన్లు కూడా అందిస్తోంది.
ఈ సేవింగ్స్ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టడం ద్వారా సామాజిక భద్రతతో పాటు మంచి రాబడి కూడా పొందవచ్చు. చాలా పథకాలు బ్యాంకుల కన్నా ఎక్కువ రాబడిని అందిస్తాయి. మహిళలకు అధిక ప్రయోజనాలు అందించే పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
సుకన్య సమృద్ధి సేవింగ్ స్కీమ్ :
సుకన్య సమృద్ధి పొదుపు పథకం (Post Office Schemes) ప్రత్యేకంగా ఆడపిల్లల భవిష్యత్తు కోసం రూపొందించింది. కుమార్తెకు 10 ఏళ్లు నిండకముందే ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలి. ఏడాదికి 8.2శాతం వడ్డీ రేటు లభిస్తుంది.
అకౌంట్ ఓపెన్ చేశాక గరిష్టంగా 15 ఏళ్లు కొనసాగించాలి. సుకన్య సమృద్ధి యోజనపై వడ్డీ రేటును ప్రతి 3 నెలలకు ఒకసారి లెక్కిస్తారు. ఈ పథకం కింద డిపాజిట్లకు సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.
పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ :
మహిళలకు పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ మరో అద్భుతమైన స్కీమ్. కనీస పెట్టుబడి రూ. 1000, 7.4శాతం వడ్డీ రేటును పొందవచ్చు. ఈ స్కీమ్ ద్వారా క్రమం తప్పకుండా ఆదాయాన్ని పొందవచ్చు.
పోస్టాఫీస్ PPF స్కీమ్ :
పోస్టాఫీస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) స్కీమ్ అద్భుతమైన (Post Office Schemes) లాంగ్ టైమ్ ఇన్వెస్ట్ స్కీమ్. కనీస పెట్టుబడి మొత్తం రూ. 500, వడ్డీ రేటు 7.1శాతంగా ఉంది.
ఈ పథకం దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఎంతో లాభదాయకమైన ఆప్షన్. ఈ పోస్టాఫీస్ పథకాలన్నింటిలోనూ పెట్టుబడి ద్వారా మహిళలు భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఆర్థికంగా ప్రయోజనం పొందవచ్చు.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ :
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ అనేది మహిళా పెట్టుబడిదారుల కోసం స్పెషల్ రిస్క్-ఫ్రీ స్కీమ్. అన్ని వయసుల మహిళలు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు.
ఈ పథకం కింద గరిష్టంగా రూ. 2 లక్షల వరకు అకౌంటులో జమ చేయవచ్చు. ప్రతి ఏటా 7.5శాతం వడ్డీ లభిస్తుంది. ఒక ఏడాది తర్వాత డిపాజిట్ మొత్తంలో 40శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ :
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ అనేది చాలా సురక్షితమైన లో రిస్క్ స్కీమ్. అన్ని రకాల పెట్టుబడిదారులకు బెస్ట్ స్కీమ్. కనీస పెట్టుబడి రూ. 100 పెట్టాలి. మెచ్యూరిటీ వ్యవధి 5 ఏళ్లు ఉంటుంది.
అక్టోబర్ 1, 2024 నుంచి కొత్త NSCలో డిపాజిట్లపై ఎలాంటి వడ్డీ ఉండదు. కానీ, సెప్టెంబర్ 30, 2024 వరకు డిపాజిట్లు 7.5శాతం వడ్డీని పొందవచ్చు.