7th Pay Commission : ఉద్యోగులు, పెన్షనర్లకు పండగే.. భారీగా పెరగనున్న డీఏ.. గతంలో కన్నా ఎక్కువే.. ఎప్పటినుంచంటే?

7th Pay Commission : ద్రవ్యోల్బణ రేటు డేటా కారణంగా ఈసారి డీఏ పెంపు గతంలో కన్నా ఎక్కువగా ఉండవచ్చని భావిస్తున్నారు.

7th Pay Commission : ఉద్యోగులు, పెన్షనర్లకు పండగే.. భారీగా పెరగనున్న డీఏ.. గతంలో కన్నా ఎక్కువే.. ఎప్పటినుంచంటే?

7th Pay Commission

Updated On : June 4, 2025 / 1:43 PM IST

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఎప్పుటినుంచో డీఏ పెంపు కోసం (7th Pay Commission) ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి డీఏ ఎంత పెరుగుతుంది అనేదానిపైనే పెద్దచర్చ నడుస్తోంది.

ప్రత్యేకించి ఉద్యోగులు కూడా ఈసారి డీఏ ఎంత పెరుగుతుందో లెక్కలేసుకుంటున్నారు. నివేదికల ప్రకారం.. మోదీ ప్రభుత్వం కేంద్ర ఉద్యోగుల డీఏను 3 శాతం వరకు పెంచుతుందని భావిస్తున్నారు. అదే జరిగితే.. గతంలో కన్నా భారీగా జీతాలు పెరగనున్నాయి.

Read Also : Moto Razr 60 Phone : భలే ఉంది భయ్యా.. మోటోరోలా మడతబెట్టే ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొనేసుకోండి..!

కేంద్ర ప్రభుత్వం చివరిసారిగా డీఏని కేవలం ఒక శాతం మాత్రమే పెంచింది. డీఏ రేట్లు జూలై 1, 2025 నుంచి అమల్లోకి వస్తాయి. ఆగస్టు మొదటి వారంలో డీఏ పెరిగే అవకాశం ఉంది. అయితే, మోదీ ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

డీఏ ఎంతంటే? :
కేంద్ర ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ (DA)ను 3 శాతం వరకు పెంచవచ్చు. ఆ తరువాత, డీఏ 58 శాతానికి పెరుగుతుంది.

ప్రస్తుతం, కేంద్ర ఉద్యోగులు 55 శాతం డీఏను పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం చివరిగా డీఏను 2శాతానికి పెంచింది. ఇప్పుడు, డీఏ 3శాతం పెంచితే.. జీతాలు భారీగా పెరగొచ్చు.

జీతం ఎంత పెరుగుతుంది? :
కేంద్ర ఉద్యోగుల డీఏ 3శాతం (7th Pay Commission)  పెరిగితే.. జీతంలో భారీగా పెరుగుదల ఉంటుంది. డీఏ 58శాతానికి పెరుగుతుంది. ఒక ఉద్యోగి కనీస వేతనం నెలకు రూ. 30వేలు అయితే, అందులో రూ. 900 పెరుగుతుంది. వార్షిక జీతం కూడా రూ. 10,800 వరకు పెరుగుతుంది.

8వ వేతన సంఘం అమలు ఎప్పుడంటే? :
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు 8వ వేతన సంఘం (7th Pay Commission) కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 8వ వేతన సంఘం ఎప్పుడు అమలు కానుందో క్లారిటీ లేదు.

Read Also : Vidya Lakshmi Scheme : విద్యార్థులకు పండగే.. ఎడ్యుకేషన్ లోన్లపై PNB వడ్డీ రేట్లు తగ్గింపు.. ఫుల్ డిటెయిల్స్..!

అందిన సమచారం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఈ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఇద జరిగితే.. 2026 సంవత్సరంలో ఏ నెలలోనైనా అమల్లోకి రావచ్చు. ఆ వెంటనే కేంద్ర ఉద్యోగుల జీతాలలో భారీగా పెరిగే అవకాశం ఉంటుంది.