Moto Razr 60 Phone : భలే ఉంది భయ్యా.. మోటోరోలా మడతబెట్టే ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొనేసుకోండి..!

Moto Razr 60 Phone : మోటోరోలా మడతబెట్టే ఫోన్ ధర భారీగా తగ్గిందోచ్.. బ్యాంకు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో డిస్కౌంట్ ధరకే కొనేసుకోవచ్చు.

Moto Razr 60 Phone : భలే ఉంది భయ్యా.. మోటోరోలా మడతబెట్టే ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొనేసుకోండి..!

Moto Razr 60 Phone

Updated On : June 4, 2025 / 12:15 PM IST

Moto Razr 60 Phone : కొత్త ఫోన్ కొంటున్నారా? మోటోరోలా ఫ్యాన్స్ ఈ ఫోల్డబుల్ ఫోన్ అతి తక్కువ ధరకే (Moto Razr 60 Phone) సొంతం చేసుకోవచ్చు. మోటోరోలా రెజర్ 60 ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో సరసమైన ధరకే లభిస్తోంది.

ప్రస్తుత సేల్ ధర రూ. 54,999 ఉండగా, ఇన్‌స్టంట్ డిస్కౌంట్ రూ. 5వేలు తగ్గింపు పొందవచ్చు. తద్వారా ఫోన్ రూ. 49,999కి తగ్గుతుంది. దాదాపు 9శాతం తగ్గింపు పొందవచ్చు అనమాట.

Read Also : Realme C71 : అతి చౌకైన ధరకే రియల్‌మి C71 ఆగయా.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ఏఐ కెమెరా కేక..!

అద్భుతమైన ఆఫర్లు :
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ. 2500 తగ్గింపు పొందవచ్చు. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ప్రతి నెలా ఈజీగా ఈఎంఐ చెల్లించవచ్చు. అదనంగా ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన పనిలేదు. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ. 42,900 ధరకే కొనుగోలు చేయొచ్చు.

ఫోల్డబుల్ డిజైన్ అదుర్స్ :
మోటోరోలా రెజర్ 60 ఫోల్డబుల్ ఫోన్. ఫోల్డబుల్ పరంగా కొంచెం భిన్నంగా ఉంటుంది. ఈజీగా మడతపెట్టి జేబులో పెట్టుకోవచ్చు. ఒకసారి ఓపెన్ చేశాక 6.9-అంగుళాల pOLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది.

144Hz రిఫ్రెష్ రేట్‌తో సపోర్టు ఇస్తుంది. 8E ర్యామ్, 256E స్టోరేజీతో మీడియాటెక్ డైమన్షిటీ 7020తో పాటు గేమ్‌లు, మీడియా లేదా మల్టీ టాస్కింగ్‌ కోసం వినియోగించుకోవచ్చు. యాప్‌లు, స్నాప్‌లు వీడియోలకు బెస్ట్ అని చెప్పొచ్చు.

కెమెరా, బ్యాటరీ పర్ఫార్మెన్స్ :
మోటోరోలా రెజర్ 60లో 64MP బ్యాక్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ రెండూ మంచి లైటింగ్ కండిషన్లలో అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. బ్యాటరీ 4200mAhతో ఛార్జింగ్ ఒక రోజు కన్నా ఎక్కువగా ఉంటుంది.

Read Also : Top 5 Smartphones : వైర్‌లెస్ ఛార్జింగ్‌, బిగ్ బ్యాటరీతో టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు..!

స్పీడ్ ఛార్జింగ్‌ కోసం 33W ఛార్జింగ్‌తో వస్తుంది. మోటోరోలా రేజర్ 60 ఫోన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్, ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్లతో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీమియం ఫోన్ కోసం చూస్తుంటే ఈ ఫోన్ కొనడమే బెస్ట్..