Realme C71 : అతి చౌకైన ధరకే రియల్‌మి C71 ఆగయా.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ఏఐ కెమెరా కేక..!
Realme C71 : రియల్‌మి నుంచి సరసమైన ధరకు కొత్త స్మార్ట్‌ఫోన్ రియల్‌మి C71 లాంచ్ అయింది. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Realme C71
Realme C71 : రియల్‌మి అభిమానుల కోసం సరికొత్త రియల్‌మి C71 ఫోన్ వచ్చేసింది. అత్యంత సరసమైన (Realme C71) ధరకే అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. భారీ 6,300mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది.
50MP ఏఐ ఎనేబుల్డ్ బ్యాక్ కెమెరాను కలిగి ఉంది. చిప్‌సెట్ యూనిసోక్ T7250 ఉండగా, డిస్‌ప్లే 6.67 అంగుళాలు ఉంటుంది. గరిష్టంగా 128GB ఇంటర్నల్ స్టోరేజీ, 6GB వరకు ర్యామ్ అందిస్తుంది. రియల్‌మి C71 ఫీచర్లు, స్పెషిఫికేషన్లు, ధర గురించి వివరంగా తెలుసుకుందాం.
రియల్‌మి C71 ధర :
ఈ రియల్‌మి ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వెర్షన్ ధర దాదాపు రూ. 10వేలు ఉంటే.. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వెర్షన్ ధర దాదాపు రూ. 12వేలు ఉంటుంది. ప్రస్తుతం వియత్నాం, బంగ్లాదేశ్ వంటి మరికొన్ని ప్రాంతాలలో అమ్మకానికి ఉంది. స్వాన్ వైట్, బ్లాక్ నైట్ ఔల్ అనే కలర్ ఆప్షన్లతో కొనుగోలు చేయొచ్చు.
రియల్‌మి C71 ఫీచర్లు :
రియల్‌మి C71 ఫోన్ 6.67-అంగుళాల HD+ డిస్‌ప్లే, 720×1,604-పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్, 725 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది.
8 కోర్లతో యూనిసోక్ T7250 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 128GB స్టోరేజీ, 6GB వరకు ర్యామ్ కలిగి ఉంది. రియల్‌మి డైనమిక్ ర్యామ్ ఫంక్షన్ 18GB వరకు పొడిగించుకోవచ్చు.
ఆండ్రాయిడ్ 15-ఆధారిత రియల్‌మి యూఐ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగి ఉంది. ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 6,300mAh బ్యాటరీని కలిగి ఉంది.
9 గంటల వరకు ఛార్జింగ్ :
సింగిల్ ఛార్జ్‌తో బ్యాటరీ 9 గంటల వరకు స్ట్రెయిట్ గేమ్ టైమ్‌ను అందిస్తుంది. 196 గ్రాముల బరువు, 165.80mm పొడవు, 75.90mm వెడల్పు, 7.79mm మందం కలిగి ఉంటుంది.
రియల్‌మి C71 కెమెరా సెటప్‌లో 50MP బ్యాక్ సైడ్ ఏఐ ఎనేబుల్డ్ కెమెరా ఉంటుంది. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 5MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. స్మార్ట్ టచ్ ఫీచర్ ఉంది. కంపెనీ విషయానికొస్తే.. 1.5 మీటర్ల నుంచి పడిపోయినా ఇప్పటికీ సేఫ్‌గా ఉంటుంది.
Read Also : Credit Score : ఆన్‌లైన్‌లో ఇన్‌స్టంట్ లోన్లతో క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుందా? ఏం చేస్తే బెటర్?
బీడౌ, బ్లూటూత్ 5.2, GPS, గ్లోనాస్, గెలీలియో, Wi-Fi, USB టైప్-C కనెక్షన్ కనెక్టివిటీ ఆప్షన్లు కూడా ఉన్నాయి. యాక్సిలరేషన్, ఫ్లికర్, మాగ్నెటిక్, లైట్, సైడ్ కెపాసిటివ్, ప్రాక్సిమిటీ సెన్సార్లు ఉన్నాయి. రియల్‌మి C71 ఆర్మర్‌షెల్ డిజైన్ మిలిటరీ బేస్ షాక్‌ప్రూఫ్ టెస్టింగ్ పాస్ అయింది.