Nothing Phone 3 Review : నథింగ్ ఫోన్ 3 రివ్యూ.. డిజైన్, పర్ఫార్మెన్స్ హైలెట్ అంతే.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు..!

Nothing Phone 3 Review : ఇతర ఫోన్లతో పోలిస్తే.. నథింగ్ ఫోన్ (3) అద్భుతమైన ఫీచర్లతో మరింత ఆకట్టుకునేలా ఉంది. నథింగ్ ఫోన్ ఎందుకు కొనాలంటే?

Nothing Phone 3 Review

Nothing Phone 3 Review : ప్రస్తుతం మార్కెట్లోకి అనేక బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. టెక్ ప్రపంచంలో కొన్ని బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు మాత్రమే బాగా పాపులర్ అయ్యాయి. ఫోన్ డిజైన్, ఇతర ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి. అలాంటి బ్రాండ్ల ఫోన్లలో సీఎంఫ్ నథింగ్ ఫోన్ కంపెనీ ఒకటి. నథింగ్ అనేక మోడల్ ఫోన్లను లాంచ్ చేయగా ఇప్పుడు నథింగ్ ఫోన్ (3)తో ఫ్లాగ్ షిప్ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టింది.

ఈ నథింగ్ ఫోన్ 3 దాదాపు రూ. 80వేల ధరతో మార్కెట్లో (Nothing Phone 3 Review) ఇతర బ్రాండ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్లతో గట్టిపోటీనిస్తోంది. నథింగ్ సహా వ్యవస్థాపకుడు కార్ల్ పీ కూడా ఈ ఫోన్ టెక్నాలజీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వినియోగదారుల అంచనాలకు తగినట్టుగా వారి బడ్జెట్ ధరలో సరికొత్త ఫీచర్లతో ఫోన్లను రిలీజ్ చేస్తోంది. నథింగ్ ఫోన్ స్పెషిఫికేషన్లు, పర్ఫార్మెన్స్ పరంగా ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు పూర్తి రివ్యూ ద్వారా తెలుసుకుందాం..

Nothing Phone 3

డిజైన్, డిస్‌ప్లే వివరాలివే :

డిజైన్ అనేది బ్రాండ్ అత్యంత ఆకర్షణీయమైనది. నథింగ్ ఫోన్ (3)తో పారదర్శక స్లీవ్‌పై నథింగ్ సిగ్నేచర్ డిజైన్ DNA కలిగి ఉంది. కానీ ఇప్పుడు రెగ్యులర్ స్మార్ట్‌ఫోన్‌ల కన్నా చాలా భిన్నంగా కనిపిస్తుంది. నథింగ్ ఫోన్ 3 ఎక్కువకాలం మన్నికను అందిస్తుంది.

బ్యాక్ సైడ్ ట్రై-కాలమ్ లేఅవుట్ విజువల్ కలిగి ఉంది. అయితే రీ డిజైన్ కర్వ్ ఫోన్‌ గత వెర్షన్ల కన్నా మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది. నథింగ్ ఫోన్ (2)తో పోలిస్తే బెజెల్స్ ఆకర్షణీయంగా చాలా సన్నగా ఉంటాయి. ఫోన్ చుట్టూ కేవలం 1.87mm మాత్రమే మందం ఉంటుంది.

Read Also : Amazon Great Indian Festival Sale : వావ్.. ఇది కదా ఆఫర్.. అతి చౌకైన ధరకే రెడ్‌మి నోట్ 14 ప్రో ప్లస్.. అమెజాన్‌లో ఇలా కొన్నారంటే?

అయితే, హ్యాండ్-హ్యాండ్ ఫీల్ మరింత అప్‌గ్రేడ్ అయింది. నథింగ్ ఫోన్ లాంగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. చేతిలో కొంచెం బరువుగా అనిపించవచ్చు. ఈ నథింగ్ ఫోన్ 3 స్మార్ట్‌ఫోన్ లుక్ పరంగా స్పెషల్ టచ్‌ కలిగి ఉంది. ఇందులో కొత్త గ్లిఫ్ మ్యాట్రిక్స్ అత్యంత ఆకర్షణీయమైనవి. నథింగ్ ఫోన్ (1) ఫీచర్లతో మొదలై నథింగ్ ఫోన్ (2)లో మరిన్ని ఫీచర్లను చేర్చింది.

Nothing Phone 3

ఇప్పుడు నథింగ్ (3) ఫోన్‌లో కేవలం నోటిఫికేషన్ లైట్లుగా కాకుండా మ్యాట్రిక్స్ ఇప్పుడు స్టాప్‌వాచ్, బ్యాటరీ మీటర్, గ్లిఫ్ మిర్రర్ వంటి టూల్స్ అందిస్తుంది. సోలార్ క్లాక్ బ్యాక్ సైడ్ డైనమిక్ సన్‌డియల్‌గా ఉంటుంది.

ఈ నథింగ్ ఫోన్‌ తలకిందులుగా ఉంచినప్పుడు చాట్స్ ఆటోమాటిక్‌‌గా ట్రాన్స్‌క్రైబ్ అయ్యేలా కొత్త ఫ్లిప్ టు రికార్డ్ ఫీచర్ కూడా ఉంది. 6.67-అంగుళాల అమోల్డ డిస్‌ప్లే నథింగ్‌లో బెస్ట్ ఫీచర్ కాదనే చెప్పాలి. HDRలో 4500 నిట్స్ వరకు, షార్ప్‌గా (1.5K రిజల్యూషన్) గతంలో దాని కన్నా 30–120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.

నథింగ్ ఫోన్ (3) పర్ఫార్మెన్స్, సాఫ్ట్‌వేర్ (అంచనా) :

స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్‌ మోస్ట్ పవర్ ఫుల్. ధర పరంగా స్నాప్‌డ్రాగన్ లేటెస్ట్ 8 ఎలైట్ సిరీస్ చిప్‌సెట్ మార్కెట్ లీడర్‌లతో గట్టి పోటీనిస్తుంది. అయినప్పటికీ, 16GB వరకు ర్యామ్, 512GB స్టోరేజీతో స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4తో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

Nothing Phone 3

మల్టీ టాస్కింగ్ అయినా, భారీ గేమింగ్ అయినా లేదా క్యాప్‌కట్‌లో 4K ఫుటేజ్‌ ఎడిట్ చేసినా నథింగ్ ఫోన్ (3) మోడల్ అత్యంత వేగంగా పనిచేసింది. టెస్టింగ్ సమయంలో BGMI, మోడరన్ వార్‌షిప్‌ గేమ్స్ ఆడినప్పటికీ నథింగ్ ఫోన్ (3) బాగానే ఉంది. అయితే, ఏదైనా గేమ్ ప్రారంభించిన ప్రతిసారీ నథింగ్ ఫోన్ (3) ఫోన్ త్వరగా వేడెక్కుతుంది. ఆండ్రాయిడ్ 15-ఆధారిత నథింగ్ OS 3.5 స్కిన్ కలిగి ఉంది.

ఎసెన్షియల్ సెర్చ్ కొత్త యూనివర్సల్ బార్. ఫైల్‌లు, కాంటాక్ట్‌లు, వాతావరణ అప్‌డేట్స్ కూడా సింగిల్ స్వైప్‌తో చూడొచ్చు. మోనోక్రోమ్ ఐకాన్ థీమ్ కలిగి ఉంది. ఎసెన్షియల్ స్పేస్, నథింగ్స్ ఏఐ-ఆర్గనైజ్డ్ పర్సనల్ హబ్ కలిగి ఉంది. నోట్స్, లింక్‌లు, రిమైండర్‌లకు బెస్ట్ స్పేస్. అంతేకానీ, గూగుల్ కీప్ లేదా ఎవర్ నోట్ మాదిరిగా ఉండదు.

Nothing Phone 3

కెమెరా :

నథింగ్ ఫోన్ (3) కెమెరా సిస్టమ్ గత మోడల్‌తో పోలిస్తే అత్యంత ముఖ్యమైన అప్‌గ్రేడ్. మీరు ఇప్పటికీ డ్యూయల్-లెన్స్ సెటప్‌ పొందవచ్చు. కానీ, ఈసారి లాస్‌లెస్ ఆప్టికల్ జూమ్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో పాటు సాలిడ్ అల్ట్రా-వైడ్ లెన్స్‌తో 50MP ప్రైమరీ సెన్సార్ (1/1.3-అంగుళాలు) కలిగి ఉంది.

Nothing Phone 3

భారీ సెన్సార్ కారణంగా తక్కువ కాంతిలో కూడా అద్భుతమైన ఫొటోలు తీయొచ్చు. నైట్ మోడ్ ఫీచర్ కూడా ఎలాంటి మసకబారకుండా మంచి క్వాలిటీని అందిస్తుంది. అయితే, పోర్ట్రెయిట్స్ ఫొటోలు బాగున్నాయి. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌ల మాదిరిగా కొత్త సినిమాటిక్ ప్రీసెట్‌లు, ముఖ్యంగా సిటీ విజువల్స్ లేదా సాయంత్రం వేళల్లో తీసే ఫోటోలకు మూడీ, సినిమాటిక్ వైబ్‌ను అందిస్తుంది.

Read Also : Amazon Great Indian Festival Sale : సూపర్ ఆఫర్ బ్రో.. ఈ వన్‌ప్లస్ 13s అతి చౌకైన ధరకే.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

వీడియో పరంగా ఫుల్ OIS, EIS కలిగిన అన్ని లెన్స్‌లలో 60fps వద్ద 4K సపోర్టు ఉంది. ఫ్రంట్ కెమెరా 16MP కలిగి ఉంది. తక్కువ కాంతిలో కూడా సెల్ఫీలు అద్భుతంగా వస్తాయి. ఎక్కువ ఎడిటింగ్ అవసరం ఉండదు. వీడియో కాల్స్, మీటింగ్స్ సమయంలో కూడా ఫ్రంట్ కెమెరా వేగంగా పనిచేసింది.

Nothing Phone 3

బ్యాటరీ, ఛార్జింగ్ :

5500mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీతో వస్తుంది. ఇప్పటివరకూ నథింగ్ అతిపెద్ద బ్యాటరీ ఇదే. బాగా వాడినా కూడా 25శాతం నుంచి 30శాతం ఛార్జింగ్ అలానే ఉంది. ఇందులో 2 గంటల నుంచి 3 గంటల స్క్రీన్ సమయం, ఫోటో షూటింగ్, స్పాటిఫై ప్లేబ్యాక్, జీపీఎస్ నావిగేషన్ ఉన్నాయి.

Nothing Phone 3

ఛార్జింగ్ 65W వద్ద స్పీడ్ ఉంటుంది. ఫుల్ రీఛార్జ్ కోసం దాదాపు 55 నిమిషాలు పడుతుంది. 15W వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. వైర్డు, వైర్‌లెస్ ఛార్జింగ్ రెండింటిలోనూ కొద్దిగా హీట్ వస్తుంటుంది. నథింగ్ ఫోన్ (3) ధర రూ.62,999 నుంచి ప్రారంభమై టాప్-ఎండ్ వేరియంట్ రూ.72,999 వరకు ఉంటుంది.

మార్కెట్‌లో ఇతర ఫ్లాగ్‌షిప్ ఫోన్లతో నేరుగా పోటీ పడుతుంది. నథింగ్ ఫోన్ (3) ఫ్లాగ్‌షిప్ ఫోన్ కేవలం పర్ఫార్మెన్స్, కెమెరా మాత్రమే కాదు.. డిజైన్‌ కూడా అత్యంత ఆకర్షణగా ఉంటుంది. కొంతమంది యూజర్లకు గ్లిఫ్ మ్యాట్రిక్స్, డిజైన్ టచ్‌ అద్భుతంగా అనిపిస్తాయి. మరికొందరికి ఈ ఫీచర్ల కోసమూ కొనేస్తుంటారు. ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లో నథింగ్ ఫోన్ (3) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.