Nothing Phone 4a : బిగ్ షాక్.. ఆగస్టు 1 నుంచి నథింగ్ ఫోన్ (4a) కొనడం కష్టమే.. భారత్‌లో ధర ఎంత పెరగనుందంటే?

Nothing Phone 4a : కొత్త నథింగ్ ఫోన్ కొనేవారికి నిజంగా షాకే.. ఆగస్టు ఒకటో తేదీ నుంచి నథింగ్ ఫోన్ 4ఎ ఫోన్ ధర పెరగనుంది. అయితే, ఇప్పటివరకూ నథింగ్ కంపెనీ నుంచి ధర పెంపుపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

Nothing Phone 4a

  • 6.78-అంగుళాల LTPS ఫ్లెక్సిబుల్ అమోల్డ్ డిస్‌ప్లే
  • నథింగ్ ఫోన్ (4a)లో 50MP ప్రైమరీ కెమెరా సెటప్
  • 5400mAh బ్యాటరీ, 50W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టు

Nothing Phone 4a : నథింగ్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారత మార్కెట్లో నథింగ్ ఫోన్ (4a) ధర భారీగా పెరగబోతోంది. వచ్చే నెల ఆగస్టు 1 నుంచి కొత్త ధర అమల్లోకి రానుంది. కంపెనీ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ అన్ని ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లలో ఎక్కువ ధరకు లభించనుందని ఆన్‌లైన్ టిప్‌స్టర్ పేర్కొన్నారు.

ఈ ఏడాది మార్చిలో నథింగ్ ఫోన్ (4a) ప్రోతో పాటు భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 సిరీస్ చిప్‌సెట్, 5,400mAh బ్యాటరీ ఉన్నాయి. ఈ నథింగ్ ఫోన్ ఎంత పెరగనుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఆగస్టు 1 నుంచి ధర పెంపు? : 
టిప్‌స్టర్ ప్రకారం.. ఆగస్టు 1 నుంచి భారత మార్కెట్లో నథింగ్ ఫోన్ (4a) ధర భారీగా పెరగబోతోంది. ఆ పోస్ట్ ప్రకారం.. 8GB+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 42,999, 8GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 46,999, 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 49,999 ఉండవచ్చు.

నథింగ్ ఫోన్ (4a) మొత్తం ఈ 3 వేరియంట్ల ధరలలో రూ. 3వేల వరకు పెరుగుదల ఉండవచ్చని అంచనా. మీరు ఈ నథింగ్ ఫోన్‌ను కొనాలని చూస్తుంటే ఆగస్టు 1 లోపు ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకోవడమే బెటర్.

Read Also : OnePlus N6x Launch : ఛార్జింగ్ టెన్షన్ లేదు.. 7000mAh బ్యాటరీతో కొత్త వన్‌ప్లస్ N6x ఫోన్.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు..!

లాంచ్ సమయంలో నథింగ్ ఫోన్ (4a) మోడల్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 31,999, 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,999, 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 37,999గా ఉంటుంది.

ప్రస్తుతం, 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 39,999, 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 43,999, 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 46,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, వైట్, బ్లూ, పింక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ధరల పెంపుపై నథింగ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
నథింగ్ ఫోన్ (4a) ఫోన్ 1224×2720 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ అందించే 6.78-అంగుళాల ఎల్టీపీఎస్ ఫ్లెక్సిబుల్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. నథింగ్ ఫోన్ 4a ఆండ్రాయిడ్ 16 ఆధారిత OS4.1పై రన్ అవుతుంది.

ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7S జెన్ 4 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. నథింగ్ ఫోన్ 4a బ్యాక్ కెమెరాలో ఎఫ్/1.88 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, 50MP పెరిస్కోప్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 50W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5400mAh బ్యాటరీతో రన్ అవుతుంది. కనెక్టివిటీ ఆప్షన్ల పరంగా నథింగ్ ఫోన్ 4a 4G, 5G, Wi-Fi, బ్లూటూత్, NFC, GPS, USB టైప్-సీ పోర్ట్‌తో వస్తుంది.