CMF Phone 2 Pro : రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో CMF ఫోన్ 2ప్రో వచ్చేసిందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతో తెలుసా?

CMF Phone 2 Pro : సీఎంఎఫ్ కొత్త ఫోన్ వచ్చేసింది. ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో నథింగ్ సబ్ బ్రాండ్ సీఎంఎఫ్ లాంచ్ అయింది. రివర్స్ ఛార్జింగ్ సపోర్టుతో భారత మార్కెట్లో లాంచ్ అయింది.

CMF Phone 2 Pro

CMF Phone 2 Pro : కొత్త ఫోన్ కొంటున్నారా? నథింగ్ సబ్-బ్రాండ్ CMF భారత మార్కెట్లో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. అదే.. CMF ఫోన్ 2 ప్రో. ఈ కొత్త మోడల్ గత జూలైలో దేశంలో విడుదలైన CMF ఫోన్ 1 మాదిరిగానే ఉంటుంది.

సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. మృదువైన 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో అద్భుతమైన 6.77-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. వైర్డు, రివర్స్ ఛార్జింగ్ సపోర్టు ఇచ్చే బలమైన 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Read Also : Apple Smart Glasses : ఆపిల్ లవర్స్‌కు అదిరే న్యూస్.. స్మార్ట్ గ్లాసెస్, ఎయిర్‌ప్యాడ్ కెమెరాలతో వచ్చేస్తున్నాయి.. టచ్ చేయకుండానే కంట్రోలింగ్..!

CMF ఫోన్ 2 ప్రో భారత్ ధర ఎంతంటే? :
ధర విషయానికొస్తే.. CMF ఫోన్ 2 ప్రో 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ బేస్ మోడల్ ధర రూ.18,999. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ కూడా రూ.20,999కి అందుబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు బ్లాక్, లైట్ గ్రీన్, ఆరెంజ్ లేదా వైట్ కలర్ ఆప్షన్ల నుంచి ఎంచుకోవచ్చు. ఈ ఫోన్ మే 5 నుంచి ఫ్లిప్‌కార్ట్, CMF ఇండియా వెబ్‌సైట్, వివిధ రిటైల్ పార్టనర్ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

అదనంగా, యాక్సిస్, HDFC, ICICI బ్యాంక్, SBI కార్డుల లావాదేవీలపై రూ. 1,000 తగ్గింపును పొందవచ్చు. కొనుగోలుదారులు ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో అదనంగా రూ. వెయ్యి తగ్గింపును పొందవచ్చు. CMF ఫోన్ 2 ప్రో ప్రారంభ ధరను రూ. 16,999కు తగ్గించవచ్చు. గత వెర్షన్ మాదిరిగానే సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో యూనివర్సల్ కవర్, మార్చుకోగలిగిన లెన్స్‌లు, వ్యాలెట్, స్టాండ్, లాన్యార్డ్, కార్డ్ హోల్డర్ వంటి అనేక రకాల అప్లియ్సెన్స్ వస్తుంది.

CMF ఫోన్ 2 ప్రో స్పెసిఫికేషన్లు :
డ్యూయల్-సిమ్ (నానో+నానో) CMF ఫోన్ 2 ప్రో ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది. నథింగ్ OS 3.2తో కస్టమైజడ్ చేస్తుంది. 6 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లతో పాటు 3 ఏళ్ల ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌‌డేట్స్ అందుకుంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ ఫుల్-HD+ (1,080×2,392 పిక్సెల్‌లు) అమోల్డ్ డిస్‌ప్లేను అందిస్తుంది.

120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 2160Hz PWM ఫ్రీక్వెన్సీ, 387ppi పిక్సెల్ డెన్సిటీ, 480Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో పవర్‌ఫుల్ విజువల్స్‌ను అందిస్తుంది. 3,000 నిట్స్, HDR10+ సపోర్టు, పాండా గ్లాస్ ప్రొటెక్షన్ డిస్‌ప్లే మరింత అప్‌గ్రేడ్ అవుతుంది.

సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది. 8GB ర్యామ్‌తో వస్తుంది. ఈ అత్యాధునిక చిప్ గత ఏడాది CMF ఫోన్ 1తో పోలిస్తే.. 10 శాతం వేగవంతమైన CPU, గ్రాఫిక్స్ పర్ఫార్మెన్స్ 5 శాతం అప్‌గ్రేడ్ కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ద్వారా పవర్ పొందింది. వినియోగదారులు ఆన్‌బోర్డ్ ర్యామ్ 16GB వరకు విస్తరించవచ్చు. ఫొటోగ్రఫీ ప్రియుల కోసం CMF ఫోన్ 2 ప్రో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది.

f/1.88 అపర్చర్, EISతో 50MP మెయిన్ సెన్సార్, f/1.88 అపర్చర్‌తో 50MP టెలిఫోటో లెన్స్, f/2.2 అపర్చర్, 119.5-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో వస్తుంది. టెలిఫోటో లెన్స్ 2x ఆప్టికల్ జూమ్, 20x డిజిటల్ జూమ్‌ను అందిస్తుంది. ఫ్రంట్ సైడ్ f/2.45 అపర్చర్‌తో 16MP సెల్ఫీ కెమెరా ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. కొత్త మోడల్ మొత్తం కెమెరా పర్ఫార్మెన్స్ నథింగ్స్ ట్రూలెన్స్ ఇంజిన్ 3.0 టెక్నాలజీని ఉపయోగిస్తుంది.

Read Also : iPhone 15 Plus : భలే డిస్కౌంట్ భయ్యా.. ఆపిల్ ఐఫోన్ 15 ప్లస్ ధర ఇంత తక్కువా? అసలు వదులుకోవద్దు..!

వినియోగదారులు 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంటారు. 2TB వరకు విస్తరించవచ్చు. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.3, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో అథెంటికేషన్ కోసం ఆప్టికల్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది.

IP54 రేటింగ్‌తో CMF ఫోన్ 2 ప్రో రెండు మైక్రోఫోన్‌లతో కూడా వస్తుంది. కొత్త ఎసెన్షియల్ స్పేస్ ద్వారా స్క్రీన్‌షాట్‌లు, ఫొటోలు, వాయిస్ నోట్స్ వంటి డేటాను త్వరగా యాక్సెస్ చేసేందుకు ఒక ఎసెన్షియల్ కీని కలిగి ఉంటుంది.