NRI UPI Payments : ఇకపై ఈ దేశాల్లోని NRIలు కూడా ఇంటర్నేషనల్ మొబైల్ నెంబర్లతో UPI పేమెంట్స్ చేసుకోవచ్చు.. ఇదిగో ఫుల్ లిస్టు మీకోసం..!

NRI UPI Payments : భారత్‌లో బ్యాంకు అకౌంట్లను కలిగిన నాన్-రెసిడెంట్ ఇండియన్లు (NRIలు) అంతర్జాతీయ మొబైల్ నంబర్‌లను ఉపయోగించి ఇప్పుడు UPI పేమెంట్లు చేయవచ్చని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది.

NRIs with international number from select countries allowed to make UPI payments, check full list here

NRI UPI Payments : భారత్‌లో బ్యాంకు అకౌంట్లను కలిగిన నాన్-రెసిడెంట్ ఇండియన్లు (NRIలు) అంతర్జాతీయ మొబైల్ నంబర్‌లను ఉపయోగించి ఇప్పుడు UPI పేమెంట్లు చేయవచ్చని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది. UPI పేమెంట్లను మానిటరింగ్ చేసే NPCI అధికారిక సర్క్యులర్‌లో పేర్కొంది. మొత్తం10 దేశాల నుంచి అంతర్జాతీయ మొబైల్ నంబర్‌లతో NRI అకౌంట్‌‌దారులు UPI పేమెంట్లను చేయగలరని పేర్కొంది. ఇందులో సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్, ఒమన్, ఖతార్, యునైటెడ్ స్టేట్స్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్ ఉన్నాయి.

డిజిటల్ పేమెంట్ యాప్ కంపెనీలైన Paytm, Google Pay వంటి UPI పేమెంట్లు చేసేవారి కోసం ఏప్రిల్ 30లోపు మెకానిజం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ యంత్రాంగం కోరింది. ఈ మేరకు అధికారిక సర్క్యులర్‌లో NPCI తెలిపింది. అంతర్జాతీయ మొబైల్ నంబర్‌లను కలిగిన NRE/NRO అకౌంట్లు వంటి నాన్-రెసిడెంట్ బ్యాంకు అకౌంట్లతో యూపీఐలో ఆన్-బోర్డ్/లావాదేవీని చేసుకోవడానికి అనుమతించనున్నట్టు తెలిపింది. ఇతర సభ్య బ్యాంకులు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయని పేర్కొంది. NRI వినియోగదారుల కోసం UPI పేమెంట్లు సమీప భవిష్యత్తులో మరిన్ని దేశాలకు విస్తరించే అవకాశం ఉందని NPCI తెలిపింది.

NRIs with international number from select countries allowed to make UPI payments

Read Also : Refund Wrong UPI Transaction : మీరు పొరపాటున మరో UPI IDకి డబ్బులను పంపారా? ఆందోళన అక్కర్లేదు.. ఇలా ఈజీగా రీఫండ్ చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

ఈ కొత్త విధానం ద్వారా భారత్ సందర్శించే అనేక మంది NRIలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. స్వదేశంలో తమ అంతర్జాతీయ నంబర్‌ను కూడా వినియోగించుకోవచ్చునని వెల్లడించింది. గతంలో సెక్యూరిటీ ఫీచర్ SIM బైండింగ్ భారతీయ SIM కార్డ్ ఫోన్‌లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దాంతో NRIలు UPI నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేయలేకపోయారని నివేదిక తెలిపింది. UPI లేదా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ నెట్‌వర్క్ దాదాపు 6 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. అప్పటినుంచి వేగంగా డిజిటల్ పేమెంట్లను నిర్వహించేందుకు చాలా మంది భారతీయులకు ప్రయోజనకరంగా మారింది.

అందులో Paytm, Google Pay, PhonePe మరిన్నింటి పార్టనర్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి యూజర్లు UPI అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. యూజర్ కేవలం కొన్ని క్లిక్‌లతో మరో యూజర్ బ్యాంక్ అకౌంట్ సులభంగా డబ్బును బదిలీ చేయవచ్చు. మరోవైపు, RTGS లేదా NEFT వంటి సాంప్రదాయ పద్ధతుల ద్వారా డిజిటల్‌గా నగదు పంపుకోవచ్చు. మరోవైపు బ్యాంకు అకౌంట్లను యాడ్ చేసే ప్రక్రియ కూడా కఠినంగా ఉంటుంది. పార్టనర్ బ్యాంకులు ప్రత్యేకమైన UPI IDని క్రియేట్ చేస్తాయి. IDని కలిగిన యూజర్లు నగదును సజావుగా పొందవచ్చు లేదా ఇతరులకు పంపవచ్చు.

NRIs with international number from select countries allowed to make UPI payments

UPI IDని క్రియేట్ చేయడానికి Google Payలో వినియోగదారులు బ్యాంక్ అకౌంట్ వివరాలను 10 అంకెల మొబైల్ నంబర్‌ను అందించాలి. Paytm వంటి పేమెంట్ అప్లికేషన్‌లలోని UPI IDలు సాధారణంగా యూజర్ ఫోన్ నంబర్@UPIతో ప్రారంభమవుతాయి. XXXXXXXXXX@paytmగా ఉంది. డిసెంబర్ 2022 నాటికి తమకు 382 పార్టనర్ బ్యాంకులు ఉన్నాయని NCPI తెలిపింది. గత నెలలో UPI సిస్టమ్ ద్వారా పేమెంట్లు రికార్డు స్థాయిలో రూ.12.82 లక్షల కోట్లకు చేరుకున్నాయి. డిసెంబర్ 2022లో వాల్యూమ్ పరంగా 782 కోట్ల లావాదేవీలు జరిగాయని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (DFS) ట్వీట్‌లో పేర్కొంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Whatsapp UPI Payments : మీ ఫోన్‌లో GPay, PhonePe పనిచేయడం లేదా? వాట్సాప్ ద్వారా నగదు ఇలా ఈజీగా పంపుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!