Nubia NaviX Ultra Launch : పవర్‌కు కొత్త బెంచ్‌మార్క్.. 7,100mAh బ్యాటరీతో నుబియా నావిక్స్ అల్ట్రా.. వచ్చే వారమే గ్రాండ్ ఎంట్రీ!

Nubia NaviX Ultra Launch : రాబోయే నుబియా నావిక్స్ అల్ట్రా వస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,100mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉండొచ్చు. ఈ బ్యాటరీ వైర్డ్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. సెప్టెంబర్ 16న చైనాలో లాంచ్ కానుంది.

  • Published on- September 12, 2026 / 08:36 PM IST

Nubia NaviX Ultra Launch

  • అద్భుతమైన ఫీచర్లతో నుబియా నావిక్స్ అల్ట్రా
  • 7,100mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ సెటప్
  • ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరా
  • నుబియా నావిక్స్ అల్ట్రాలో BOE డిస్‌ప్లే

Nubia NaviX Ultra Launch : నుబియా కొత్త ఫోన్ వస్తోందోచ్.. చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ నూబియా వచ్చే వారం కొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ చేయనుంది. ఈ సంస్థ నూబియా నావిక్స్ అల్ట్రా కీలక స్పెసిఫికేషన్లను వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో వస్తుందని భావిస్తున్నారు.

నూబియా నావిక్స్ అల్ట్రాలో 7,100mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 50MP ప్రైమరీ కెమెరా కూడా ఉంటుంది. బైట్‌డాన్స్ డౌబావో ఏఐ మొబైల్ అసిస్టెంట్‌ను ఈ ఫోన్‌లో ఇంటిగ్రేట్ చేస్తారు. అంతేకాదు.. 3 కలర్ ఆప్షన్లలో కూడా అందుబాటులో ఉంటుందని అంచనా.

రాబోయే స్మార్ట్‌ఫోన్‌లో 7,100mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీతో వస్తుందని మీడియా రిపోర్టు తెలిపింది. ఈ బ్యాటరీ వైర్డ్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. నుబియా నావిక్స్ అల్ట్రా సెప్టెంబర్ 16న చైనాలో లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో చాంగ్‌క్సిన్ మెమరీ టెక్నాలజీస్ నుంచి మెమరీ కాంపోనెంట్లను ఉపయోగిస్తారు. ఈ మెమరీ కాంపోనెంట్‌ను వాడే ఫస్ట్ భారీ-ప్రొడక్టు స్మార్ట్‌ఫోన్ ఇదే అవుతుంది.

ట్రిపుల్ రియర్ కెమెరాలు ( అంచనా) :
నుబియా నావిక్స్ అల్ట్రా ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌లో 50MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. సింగిల్ అల్ట్రా-వైడ్ కెమెరా పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 50MP కెమెరా ఉంటుంది. నుబియా నావిక్స్ అల్ట్రాలో BOE డిస్‌ప్లే అందిస్తుంది.

Read Also : iQOO 16 Phone : గేమింగ్ కింగ్‌కు కొత్త అవతారం.. ట్రిపుల్ కెమెరాలతో దుమ్మురేపనున్న ఐక్యూ ఫోన్

ఈ స్మార్ట్‌ఫోన్ సాఫ్ట్‌వేర్ కోసం బైట్‌డాన్స్‌తో డీల్ కుదుర్చుకోనుంది. ఇందులో బైట్‌డాన్స్ డౌబావో మొబైల్ అసిస్టెంట్ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 1.5K రిజల్యూషన్ 144 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లే ఉండొచ్చు. ఇందులో ప్రాసెసర్‌గా క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 అందించవచ్చు.

కలర్ ఆప్షన్లు ( అంచనా) :
ఈ స్మార్ట్‌ఫోన్ వైట్, రోజ్, పర్పల్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభ్యం కావచ్చు. నుబియా నావిక్స్ అల్ట్రాలో డూబావో ఏఐ అసిస్టెంట్ అమర్చి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్యాప్సల్ షేప్ ఉన్న రియర్ కెమెరా ఐలాండ్ కనిపిస్తుంది. దాని కింద ఒక ఫ్లాష్ కూడా ఉంది.

నుబియా నావిక్స్ అల్ట్రా పక్కన ఆరెంజ్ కలర్ బటన్ ఉంది. ఈ బటన్ తో ఏఐ ఫీచర్లను యాక్సెస్ చేయొచ్చు. ఈ బటన్ పర్ఫార్మెన్స్, ఎలా పనిచేస్తుందో కంపెనీ ఇంకా రివీల్ చేయలేదు. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్రంట్ సైడ్ కెమెరా కోసం హోల్-పంచ్ కటౌట్ కూడా అందిస్తుంది.