×
Ad

October 2025 Smartphones : అక్టోబర్‌లో రాబోయే కొత్త 5G స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఫీచర్లు మాత్రం ఓ రేంజ్‌లో ఉన్నాయిగా.. కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి!

October 2025 Smartphones : అక్టోబర్ నెలలో సరికొత్త 5G ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఐక్యూ 15 నుంచి రెడ్‌మి నోట్ 15 ప్రో 5G వరకు టాప్ 5 స్మార్ట్‌ఫోన్ల వివరాలివే..

1/6
October 2025 Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? వచ్చే అక్టోబర్ నెలలో అద్భుతమైన ఫీచర్లతో ఖతర్నాక్ స్మార్ట్‌ఫోన్లు రాబోతున్నాయి. స్మార్ట్‌ఫోన్ అభిమానులు తమకు నచ్చిన ఫోన్ ఇంటికి తెచ్చుకోవచ్చు. క్వాల్‌కామ్ నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ చిప్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 రిలీజ్ అయిన వెంటనే వివో, ఐక్యూ, రియల్‌మి వంటి బ్రాండ్లు కొత్త స్మార్ట్‌ఫోన్లను అదే ఫీచర్లతో రిలీజ్ చేయనున్నాయి. అంతేకాదు.. ప్రీమియం ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లు, పవర్‌ఫుల్ మిడ్-రేంజర్‌లతో కొత్త డిజైన్‌లు, ఏఐ ఆధారిత ఫొటోగ్రఫీ, భారీ బ్యాటరీలతో రానున్నాయి. ఈ అక్టోబర్‌లో రాబోయే టాప్ 5 స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. అవేంటో ఓసారి లుక్కేయండి.
2/6
అక్టోబర్ 2025లో స్మార్ట్‌ఫోన్ లాంచ్ : ఐక్యూ 15 : కొత్త ఐక్యూ 15 వచ్చే అక్టోబర్ నెలలో రాబోతుంది. ఐక్యూ 14కు అప్‌గ్రేడ్ వెర్షన్. ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయ్యే ముందు అక్టోబర్ 15న చైనాలో ఐక్యూ 15ను లాంచ్ చేయనుంది. క్వాల్‌కామ్ కొత్తగా లాంచ్ చేసిన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో వచ్చే మొదటి ఫోన్‌లలో ఐక్యూ 15 ఒకటి. బోల్డ్ స్క్విర్కిల్-షేప్ ట్రిపుల్-కెమెరా సెటప్, 100-వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. భారీ 7,000mAh బ్యాటరీ, అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో ఈ ఫోన్ ప్రత్యేకంగా ఉంటుంది. గేమర్‌ల కోసం 8K వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్‌ కూడా కలిగి ఉంటుంది.
3/6
రియల్‌మి GT 8 ప్రో : రియల్‌మి ఫ్లాగ్‌షిప్ GT 8 ప్రో పోటీ ధరకు ప్రీమియం స్పెసిఫికేషన్‌లతో రావొచ్చు. ఈ రియల్‌మి 6.78-అంగుళాల 2K అమోల్డ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, 7,000mAh బ్యాటరీని కలిగి ఉండవచ్చు. డ్యూయల్ 50MP సెన్సార్‌లతో పాటు 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌తో సహా కెమెరా సెటప్ కలిగి ఉంది.
4/6
ఒప్పో ఫైండ్ X9 సిరీస్ : ఈ స్మార్ట్‌ఫోన్ లైనప్ అక్టోబర్ 16న చైనాలో లాంచ్ కానుంది. ఆ తరువాత డిసెంబర్ నాటికి భారత మార్కెట్లోకి విస్తరిస్తుంది. ఈ ఒప్పో ఫోన్‌లు మీడియాటెక్ డైమన్షిటీ 9500 చిప్‌సెట్‌తో పనిచేస్తాయి. భారీ 7,500mAh బ్యాటరీతో వస్తుంది. ఒప్పో ప్రో మోడల్‌లో హాసెల్‌బ్లాడ్-ట్యూన్ ఆప్టిక్స్, 200MP పెరిస్కోప్ లెన్స్, బ్రైట్ రెడ్, ఫ్రాస్ట్ వైట్ వంటి బోల్డ్ కొత్త ఫినిషింగ్‌లతో వచ్చే అవకాశం ఉంది.
5/6
వివో X300 సిరీస్ : ఈ లైనప్‌లో అక్టోబర్ మధ్యలో చైనాలో లాంచ్ కానుంది. వివో X300 సిరీస్ BOE క్యూ10ప్లస్ ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందిస్తుంది. 6,000mAh, 7,000mAh బ్యాటరీల మధ్య వస్తుంది. వివో X300, వివో X300 ప్రో మోడల్స్ రెండూ డైమెన్సిటీ 9500 చిప్ ద్వారా పవర్ పొందుతాయి. 200MP రిజల్యూషన్‌తో అడ్వాన్స్ జీసెస్-బ్రాండెడ్ కెమెరాలను కలిగి ఉంటాయని భావిస్తున్నారు. IP68, IP69 రేటింగ్‌తో ప్రీమియం ప్యాకేజీతో రానుంది.
6/6
రెడ్‌మి నోట్ 15 ప్రో 5G : రెడ్‌మి నోట్ 15 ప్రొ 5G ఫోన్ మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ కెమెరా పర్ఫార్మెన్స్‌తో రానుంది. 200MP శాంసంగ్ ISOCELL ప్రైమరీ సెన్సార్, 20MP సెల్ఫీ షూటర్‌ కలిగి ఉండొచ్చు. మీరు ఫ్లాగ్‌షిప్ ఫోన్ లేదా మిడ్-రేంజ్ ఫోన్ కోసం చూస్తుంటే అప్పటివరకూ ఆగాల్సిందే.