Scooter
Okinawa Oki90 : ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్ లో దుమ్ము రేపుతున్నాయి. పలు కంపెనీలు కొత్త కొత్త ఫీచర్లతో మార్కెట్ లోకి వదులుతున్నాయి. పెట్రోల్, డీజీల్ వాహనాల వైపు కాకుండా..ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వాహనాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. తమ వాహనాలను త్వరలో రిలీజ్ చేస్తున్నామని చెప్పగానే కొద్దిరోజులకే అధిక సంఖ్యలో బుకింగ్స్ అయిపోతున్నాయి.
ఇప్పటికే ఓలా, సింపుల్ వన్ ఎలక్ట్రిక్స్ వాహనాలు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా..మరో ఎలక్ట్రిక్ వాహనం రిలీజ్ కానుంది. ‘ఒకినోవా ఆటో మొబైల్ సంస్థ’ ఒకి 90, ఒకి 100 పేరిట ఎలక్ట్రిక్ వెహికల్ ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది మార్కెట్ లోకి విడుదల చేయనున్నామని సంస్థ వెల్లడిస్తోంది. కేవలం 40 నిమిషాల్లో ఛార్జింగ్ అయ్యేలా ఈ వాహనాన్ని తీర్చిదిద్దారు. లిథియం అయాన్ బ్యాటరీని అమర్చనున్నట్లు ఒకినోవా ఆటో మొబైల్ సంస్థ ప్రతినిధులు వెల్లడిస్తున్నారు.
సెంట్రల్ మౌంటెడ్ మోటార్, జియో ఫెన్సింగ్, డయాగ్నోస్టిక్స్, ఇన్ బిల్ట్ 4జీ సిమ్, నావిగేషన్ సౌకర్యాలు కల్పించారు. వచ్చే ఏడాది రిలీజ్ కానున్న ఈ వెహికల్ ధర ఎంతుంటుందనేది తెలియరావడం లేదు. ఒకి 90 ధర రూ. లక్ష కంటే తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒకి 90ని విడుదల చేయడానికంటే ముందు…ఒకి 100 ఎలక్ట్రిక్ వెహికల్ లాంఛ్ చేయాలని కంపెనీ భావిస్తోంది. మరి ఒకి వాహనాలకు ఎలాంటి రెస్పాండ్ వస్తుందో చూడాలి.