Krutrim ChatGPT : ఏఐ చాట్‌జీపీటీకి పోటీగా ‘కృత్రిమ్ ఏఐ’.. మన భారత చాట్‌జీపీటీ ప్రత్యేకతలేంటో తెలుసా?

Krutrim ChatGPT : ఏఐ టెక్నాలజీ మరింత వేగంగా విస్తరిస్తోంది. చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ జెమినీ రాగా.. ఇప్పుడు ఏఐ చాట్‌జీపీటీకి పోటీగా భారత సొంత చాట్‌జీపీటీ కృత్రిమ్ బీటా వెర్షన్ వచ్చేసింది. ఈ ఏఐ చాట్‌జీపీటీ ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Ola founder Bhavish Aggarwal’s Krutrim AI launches chatbot in beta mode

Krutrim ChatGPT : ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీకి ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. ఐటీ కంపెనీల నుంచి ఆటోమొబైల్ దిగ్గజాల వరకు అన్నింటి ఏఐ టెక్నాలజీపైనే ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ ఏఐ రంగంలో ప్రభంజనం సృష్టించింది. దీనికి పోటీగా గూగుల్ బార్డ్ ఏఐ (ఇప్పుడు జెమినీ) చాట్‌జీపీటీని మార్కెట్లోకి దించేసింది. ఈ రెండింటికి పోటీగా భారత సొంత చాట్‌జీపీటీ వచ్చేసింది. అదే.. ‘కృత్రిమ్’ ఏఐ చాట్‌జీపీటీ.. దీన్ని భారతీయులు రూపొందించగా.. ఓలా సీఈఓ భావిష్ అగర్వాల్ ఆవిష్కరించారు. ముందుగా పబ్లిక్ టెస్టింగ్ కోసం.. బీటా వెర్షన్ కృత్రిమ్ చాట్‌జీపీటీ వెర్షన్ రిలీజ్ చేశారు.

Read Also : Google Gemini Ultra : జెమినిగా మారిన గూగుల్ బార్డ్.. ఇప్పుడు అల్ట్రా కూడా.. భారత్‌‌లో ఈ ఏఐ మోడల్ ధర ఎంత? ఎలా వాడాలో తెలుసా?

రెండు భాషల్లో అందుబాటులోకి :
ప్రస్తుతానికి ఈ ఏఐ చాట్‌జీపీటీ హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. దీనికి సంబంధించి ఆయన ట్విట్టర్ (X) వేదికగా https://chat.olakrutrim.com లింక్ పోస్టు చేశారు. మన దేశం కోసం ఏఐ కంప్యూటింగ్ స్టాక్‌లో కృత్రిమ్ ఒక కొత్త శకానికి నాంది పలికిందని అన్నారాయన. ఏఐకి మన ఆర్థిక, సాంస్కృతిక జీవితాలను మార్చగల సామర్థ్యం ఉందని అగర్వాల్ అభిప్రాయపడ్డారు. అందువల్ల పాశ్చాత్య ఉత్పత్తులపై ఆధారపడకుండా భారత్ సొంత ఏఐ టెక్నాలజీని సృష్టించుకోవాలని ఆయన చెప్పారు.

రాబోయే రోజుల్లో 20 భాషలను అర్థం చేసుకోగలదు :
సంస్కృతంలో క్రుత్రిమ్ అంటే ‘కృత్రిమ’ అని అర్థం. కంపెనీ ప్రకారం, కృత్రిమ్ అనేది సొంత ఏఐ మోడల్. ఇంతకుముందు, ఈ మోడల్ రెండు సైజుల్లో వస్తుందని కంపెనీ తెలిపింది. అందులో ఒకటి బేస్ మోడల్.. రెండోది క్రుట్రిమ్ ప్రో అనే పెద్ద మోడల్. ఇది మరింత అధునాతనమైనది. ఈ సంవత్సరంలో ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. రాబోయే ఈ ప్రో మోడల్ మొత్తం 20 భారతీయ భాషలను అర్థం చేసుకోగలదు. గత ఏడాదిలో ప్రారంభించిన సందర్భంగా కంపెనీ కృత్రమ్ మోడల్ రెండు ట్రిలియన్ టోకెన్‌లపై శిక్షణ పొందిందని, ఇందులో సంభాషణలు, డేటాసెట్‌లలో ఉపయోగించే సబ్‌వర్డ్‌లు ఉంటాయి.

10 ప్రాంతీయ భాషల్లో టెక్స్ట్‌లను రూపొందించగలదు :
10 భారతీయ భాషలలో టెక్స్ట్‌లను రూపొందించగలదు. ఏఐ చాట్ బాక్సులో ప్రశ్నలకు అనేక సమాధానాలను పొందవచ్చు. చాట్ జీపీటీ మాదిరిగానే త్వరలో తెలుగు, మరాఠీ, కన్నడ, గుజరాత్, బెంగాలీ సహా 10కి పైగా భారతీయ భాషల్లో అందుబాటులోకి రానుంది. వాస్తవానికి ఈ భారత సొంత చాట్‌జీపీటీ 2023 ఏప్రిల్‌లోనే ప్రారంభం కాగా.. 2024లో ఇప్పుడు బీటా వెర్షన్ రిలీజ్ చేసింది. మొదటి జనరేషన్ తర్వాత రానున్న రోజుల్లో మరిన్ని అప్‌డేట్ వెర్షన్లను తీసుకురానున్నారు.

కృత్రిమ్ చాట్ ఇలా లాగిన్ చేయొచ్చు :
భారతీయ యూజర్లు https://chat.olakrutrim.com ద్వారా ఈజీగా లాగిన్ చేయొచ్చు. ఆ తర్వాత try krutrim బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీ మొబైల్ నంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే.. ఓటీపీ వస్తుంది. తద్వారా చాట్ ప్రారంభించవచ్చు. స్థానిక భాషలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలను ఇస్తుంది. రానున్న రోజుల్లో మన భారతీయ చాట్ జీపీటీకి మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉంది. మీరు కూడా కృత్రిమ్ ఏఐ చాట్ జీపీటీని వినియోగించాలనుకుంటే.. ఇంకెందుకు ఆలస్యం.. ఇప్పుడే పై లింక్ ద్వారా ఈజీగా లాగిన్ చేయొచ్చు.

Read Also : Amazon Q ChatGPT : ఏఐ చాట్‌జీపీటీకి పోటీగా అమెజాన్‌ బిజినెస్ ‘క్యూ’ చాట్‌బాట్ వచ్చేసింది..!