Amazon Q ChatGPT : ఏఐ చాట్‌జీపీటీకి పోటీగా అమెజాన్ బిజినెస్ ‘క్యూ’ చాట్‌బాట్ వచ్చేసింది..!
Amazon Q ChatGPT : అమెజాన్ ఏడబ్ల్ల్యూఎస్ ప్రత్యేకంగా వ్యాపారాల కోసం రూపొందించిన అమెజాన్ క్యూ అనే కొత్త జనరేటివ్ ఏఐ చాట్‌బాట్‌ను ప్రారంభించింది. యూజర్లు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే కాకుండా కంటెంట్‌ను కూడా రూపొందించగలదు.

Amazon launches ChatGPT-like chatbot for business
Amazon Q ChatGPT : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీలో అగ్రగామి అయిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS)లో జనరేటివ్ ఏఐ చాట్‌బాట్ (Amazon Q)ని ప్రకటించింది. అమెజాన్ ప్రవేశపెట్టిన కొత్త చాట్‌బాట్ ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ మాదిరిగా ఉంటుంది. అయితే, ప్రత్యేకంగా వ్యాపారాలను లక్ష్యంగా అమెజాన్ ఈ ఏఐ టూల్ తీసుకొచ్చింది.
ఇటీవల జరిగిన రీ-ఇన్వెంట్ కాన్ఫరెన్స్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఈ విషయాన్ని ప్రకటించింది. ఇప్పటికే, టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి పోటీదారులు తమ ప్రొడక్టుల్లో సొంత జనరేటివ్ ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. అమెజాన్ క్యూ అనే కొత్త టైప్ జనరేటివ్ ఏఐ పవర్డ్ అసిస్టెంట్’గా పనిచేయనుంది. ఈ ఏఐ టూల్ ఉద్యోగుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలదు. అలాగే కంటెంట్‌ను రూపొందించగలదు. కంపెనీ డేటాను ఉపయోగించి చర్యలు తీసుకోగలదు.
అమెజాన్ క్యూ అన్ని పనులను పూర్తి చేయగలదు :
అమెజాన్ ఈ కొత్త జనరేటివ్ ఏఐ చాట్‌బాట్‌ను వ్యాపారాలకు అనుగుణంగా పనిచేసేలా రూపొందించింది. కంపెనీ సమాచార రిపోజిటరీలు, కోడ్, డేటా, ఎంటర్‌ప్రైజ్ సిస్టమ్‌లకు కనెక్ట్ చేయడం ద్వారా సంభాషణలు, సమస్యలను పరిష్కరిస్తుంది. అలాగే కంటెంట్‌ను రూపొందించడానికి వ్యాపారులు అమెజాన్ క్యూని ఉపయోగించవచ్చు.
అమెజాన్ క్యూ ఉద్యోగులకు పనులను క్రమబద్ధీకరించడం, నిర్ణయం తీసుకోవడం, సమస్య పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి సాయపడుతుంది. పనిలో సృజనాత్మకత, ఆవిష్కరణలను ప్రేరేపించడానికి ఉద్యోగులకు తక్షణ, సంబంధిత సమాచారం, సలహాలను అందిస్తుంది. ఏడబ్ల్యూఎస్ సీఈఓ ఆడమ్ సెలిప్‌స్కీ ప్రకారం.. స్టార్టప్‌ల నుంచి ఎంటర్‌ప్రైజెస్ వరకు, అన్ని సంస్థలు జనరేటివ్ ఏఐతో కొనసాగుతున్నాయి.

Amazon ChatGPT-like chatbot
ఏఐ టెక్నాలజీలోకి అమెజాన్ ఎంట్రీ :
మైక్రోసాఫ్ట్ వంటి పోటీదారులకు వ్యతిరేకంగా కృత్రిమ మేధస్సులో కోల్పోయిన స్థానాన్ని తిరిగి పొందేందుకు అమెజాన్ ప్రయత్నిస్తోంది. రెడ్‌మాండ్-ఆధారిత కంపెనీ జనరేటివ్ ఏఐలో ఓపెన్ఏఐ ఎక్కువగా ఆధారపడింది. కంపెనీలో 10 బిలియన్ల డాలర్ల కన్నా ఎక్కువ పెట్టుబడి పెట్టింది.
సెర్చ్ దిగ్గజం గూగుల్ కూడా ఏఐ చాట్‌జీపీటీ తర్వాత దాని జనరేటివ్ ఏఐ చాట్‌బాట్ బార్డ్‌ను మార్కెట్లో తీసుకొచ్చింది. అదే సమయంలో గూగుల్ సెర్చ్, జీమెయిల్, యూట్యూబ్ వంటి దాని ఇతర ఆఫర్‌లకు జనరేటివ్ ఏఐని చేర్చింది. ప్రపంచంలో వేగంగా మారుతున్న ఏఐ ల్యాండ్‌స్కేప్‌లో చోటును సంపాదించుకునే ప్రయత్నాలలో భాగంగా అమెజాన్ కూడా ఏఐ స్టార్టప్ ఆంథోపిక్‌లో 4 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్టు గత సెప్టెంబర్‌లో హమీ ఇచ్చింది.