OnePlus 10R 5G : వన్‌ప్లస్ 10R 5G సిరీస్‌పై అమెజాన్ డిస్కౌంట్ ఆఫర్.. ధర ఎంతంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి 10R 5G సీరిస్ ధర తగ్గింది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలో డిస్కౌంట్ ధరకే OnePlus 10R 5G సిరీస్ అందుబాటులో ఉంది.

OnePlus 10R 5G : వన్‌ప్లస్ 10R 5G సిరీస్‌పై అమెజాన్ డిస్కౌంట్ ఆఫర్.. ధర ఎంతంటే?

Oneplus 10r 5g Gets Discount Offers On Amazon India, Price Drops To Rs 34,999 (1)

OnePlus 10R 5G : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి 10R 5G సీరిస్ ధర తగ్గింది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలో డిస్కౌంట్ ధరకే OnePlus 10R 5G సిరీస్ అందుబాటులో ఉంది. ఈ కొత్త ప్రీమియం OnePlus స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లు రూ. 4వేల వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్ 80W, 150W ఛార్జింగ్ ఆప్షన్లపై వ్యాలిడిటీ అందిస్తుంది. అమెజాన్ ఇండియాలో OnePlus 10R 5G లిస్టింగ్ కస్టమర్‌ల కోసం రూ. 3వేల కూపన్‌ అందిస్తోంది. ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే ICICI క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై రూ. 1 వెయ్యి కార్డ్ ఆఫర్ ఉంది.

OnePlus 10R భారత మార్కెట్లో ప్రారంభ ధర రూ. 38,999గా ఉంది. రెండు ఆఫర్లతో కలిపిన తర్వాత, డివైజ్ ధర రూ. 34,999కి తగ్గింది. 80W ఛార్జింగ్ ఆప్షన్ 12GB RAM వేరియంట్ కూడా ఆఫర్ కింద కొనుగోలు చేయొచ్చు. రూ.42,999కి లాంచ్ ఈ డివైస్‌ను కస్టమర్లు రూ.38,999కి పొందవచ్చు. రూ. 43,999లకు ప్రారంభమైన OnePlus 10R, 150W SuperVOOC ఎండ్యూరెన్స్ ఎడిషన్‌ను భారత మార్కెట్లో రూ.39,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ బ్లాక్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. OnePlus 10R స్పెసిఫికేషన్స్, OnePlus 10R 5Gలో MediaTek డైమెన్సిటీ 8100-MAX SoC ఉంది.

Oneplus 10r 5g Gets Discount Offers On Amazon India, Price Drops To Rs 34,999 (2)

Oneplus 10r 5g Gets Discount Offers On Amazon India, Price Drops To Rs 34,999

గరిష్టంగా 12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజీతో వచ్చింది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్టుతో 6.7-అంగుళాల Full HD+ AMOLED డిస్‌ప్లే అందించారు. ఈ ఫోన్‌లో అలర్ట్ స్లైడర్ లేదా 3.5mm హెడ్‌ఫోన్ జాక్ లేదు. బరువు 186 గ్రాములు. ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 10R 16MP ఫ్రంట్ కెమెరాను అందించారు. 80W ఛార్జింగ్ వేరియంట్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 150W వేరియంట్ 4500 mAh బ్యాటరీతో వస్తుంది. OnePlus 10R 5G రెండు వేరియంట్‌లు ఆండ్రాయిడ్ 12-ఆధారిత ఆక్సిజన్ OS 12.1 బాక్స్ తో రన్ అవుతున్నాయి.

Read Also : First OnePlus Phone : 512GB స్టోరేజీ మోడల్‌తో ఫస్ట్ వన్‌ప్లస్ ఫోన్ వస్తోంది.. ఎప్పుడంటే?