First OnePlus Phone : 512GB స్టోరేజీ మోడల్‌తో ఫస్ట్ వన్‌ప్లస్ ఫోన్ వస్తోంది.. ఎప్పుడంటే?

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్‌ప్లస్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ రాబోతోంది. ఈ నెలాఖరులో లేదా ఆగస్టు మొదటి వారంలో OnePlus 10T స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

First OnePlus Phone : 512GB స్టోరేజీ మోడల్‌తో ఫస్ట్ వన్‌ప్లస్ ఫోన్ వస్తోంది.. ఎప్పుడంటే?

Oneplus 10t Could Be The First Oneplus Phone With 512gb Storage Model

First OnePlus Phone : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్‌ప్లస్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ రాబోతోంది. ఈ నెలాఖరులో లేదా ఆగస్టు మొదటి వారంలో OnePlus 10T స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. రాబోయే OnePlus ఫోన్ ఫీచర్ల వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అవుతున్నాయి. వన్‌ప్లస్ 10T బ్రాండ్ ఫోన్ భారీ ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్‌లతో రానుంది. వన్‌ప్లస్ నుంచి 512GB స్టోరేజీ మోడల్‌‌గా మొదటి స్మార్ట్‌ఫోన్ కావచ్చునని నివేదిక వెల్లడించింది. చైనీస్ టిప్‌స్టర్, డిజిటల్ చాట్ స్టేషన్, OnePlus 10T 16GB RAM + 512GB UFS 3.1 స్టోరేజ్ ఆప్షన్‌తో లాంచ్ కానుందని పేర్కొంది.  అదే జరిగితే.. ఈ మోడల్ ధర చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. OnePlus 10 Pro, 12GB RAM + 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ భారత మార్కెట్లో రూ.71,999కి విక్రయించనున్నారు.

Oneplus 10t Could Be The First Oneplus Phone With 512gb Storage Model (1)

Oneplus 10t Could Be The First Oneplus Phone With 512gb Storage Model

ఈ కొత్త OnePlus ఫోన్ బ్రాండ్ నుంచి ఫ్లాగ్‌షిప్ ఆఫర్‌గా కూడా అందిస్తోంది. 512GB స్టోరేజీ ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ మోడల్‌ను కొనుగోలు చేయాలనుకుంటే.. OnePlus 10T యూజర్లకు Qualcomm అత్యంత శక్తివంతమైన Snapdragon 8+ Gen1 SoCని కలిగి ఉంటుంది. ఈ డివైజ్ 120Hz రిఫ్రెష్ రేటుతో పనిచేసే భారీ 6.7-అంగుళాల FHD+డిస్‌ప్లేతో AMOLED ప్యానెల్‌తో రానుంది. ఫ్లాట్ లేదా కర్వ్డ్ స్క్రీన్‌ని కలిగి ఉంటుందా అనేది ప్రస్తుతానికి తెలియదు. హుడ్ కింద 4,800mAh బ్యాటరీ ఉంది.

OnePlus 10R స్మార్ట్‌ఫోన్ మాదిరిగానే 150W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుందని భావిస్తున్నారు. వన్‌ప్లస్ 10 ప్రో ఫోన్ వెనుక కెమెరా సెటప్‌‌తో రానుంది. 50-MP ప్రైమరీ సెన్సార్, 2-MP మాక్రో కెమెరా, 8-MP అల్ట్రా-వైడ్-యాంగిల్ షూటర్‌తో సహా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించనున్నారు. OnePlus ఇంకా ఈ డివైజ్ లాంచ్‌పై అధికారికంగా ప్రకటించలేదు. OnePlus 10T జూలై 25 నుంచి ఆగస్టు 1 మధ్య భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఆగస్టు మొదటి వారంలో సేల్ మొదలు కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ అమెజాన్ ద్వారా అందుబాటులో ఉండవచ్చు.

Read Also : OnePlus 10T 5G : వన్ ప్లస్ 10టీ 5G ఫోన్ వస్తోంది.. లాంచ్, సేల్ డేట్ లీక్..!