OnePlus 10T 5G : వన్ ప్లస్ 10టీ 5G ఫోన్ వస్తోంది.. లాంచ్, సేల్ డేట్ లీక్..!

OnePlus 10T 5G : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు వన్ ప్లస్ నుంచి కొత్త 5G ఫోన్ వస్తోంది. కొత్త నివేదిక ప్రకారం.. OnePlus 10T 5G ఇండియా లాంచ్ టైమ్‌లైన్ ఆన్‌లైన్‌లో లీక్ అయింది.

OnePlus 10T 5G : వన్ ప్లస్ 10టీ 5G ఫోన్ వస్తోంది.. లాంచ్, సేల్ డేట్ లీక్..!

Oneplus 10t 5g India Launch Timeline And Sale Details Leaked

OnePlus 10T 5G : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు వన్ ప్లస్ నుంచి కొత్త 5G ఫోన్ వస్తోంది. కొత్త నివేదిక ప్రకారం.. OnePlus 10T 5G ఇండియా లాంచ్ టైమ్‌లైన్ ఆన్‌లైన్‌లో లీక్ అయింది. రాబోయే OnePlus ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఈ నెలాఖరులో భారత మార్కెట్లో లాంచ్ కానుంది. OnePlus 10T 5G ఇండియా లాంచ్ జూలై 25 ఆగస్టు 1 మధ్య ఉండొచ్చునని ఓ నివేదిక పేర్కొంది. అదనంగా, OnePlus 10T 5G భారత్‌లో ఆగస్టు మొదటి వారంలో సేల్ ప్రారంభం కానుందని తెలిపింది. మునుపటి OnePlus స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే.. OnePlus 10T 5G ఫోన్.. Amazon, OnePlus అధికారిక వెబ్‌సైట్, OnePlus ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. OnePlus 10T 5G ఫోన్‌కు సంబంధించి కొన్ని కీలక వివరాలు లీక్ అయ్యాయి.

నివేదికల ప్రకారం.. ఈ ఫోన్ కొన్ని డిజైన్ అంశాలను అందించనుంది. ప్రీమియం OnePlus 10 Pro 5Gతో షేర్ చేసింది. వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. కెమెరా మాడ్యూల్‌లో 50MP ప్రధాన కెమెరా సెన్సార్, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో సెన్సార్ ఉంటాయి. ముందు భాగంలో, స్క్రీన్ ఫ్లాట్‌గా ఉంటుంది. టాప్ సెంటర్‌లో హోల్-పంచ్ కటౌట్‌ను ఉంటుంది. ఈ డివైజ్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్టుతో రానుంది. అలాగే6.7-అంగుళాల Full HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 16MP ఫ్రంట్ కెమెరా సెన్సార్‌తో కూడా వస్తుంది. OnePlus 10T 5G క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+Gen 1 SoCని కలిగి ఉంటుంది. ROG ఫోన్ 6, ROG ఫోన్ 6ప్రోలో కూడా అందుబాటులో ఉంటుంది.

OnePlus 10T 5G ఇండియా వేరియంట్ 8GB/12GB RAM, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుందని భావిస్తున్నారు. హుడ్ కింద.. 150W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4800 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ డివైజ్.. Android 12తో రన్ అవుతుంది. అలాగే ఆక్సిజన్ OS 12 లేయర్ కలిగి ఉంటుంది. OnePlus 10T 5G ఫోన్ భారత మార్కెట్లో Xiaomi 12 Pro, iPhone 12, Vivo X80, Realme GT 2 Pro, Moto Edge 30 Pro వంటి ఇతర ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లకు గట్టి పోటీనివ్వనుంది.

Read Also : OnePlus Nord 2T 5G : వన్ ప్లస్ నార్డ్ 2T 5G ఫోన్.. ఈరోజు నుంచే సేల్.. ధర ఎంతంటే?