OnePlus 12 Series Launch : వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ 12ఆర్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు వచ్చేశాయి.. వన్‌ప్లస్ బడ్స్ 3 కూడా.. ధర, ఫీచర్లు పూర్తి వివరాలివే..!

OnePlus 12 Series Launch : వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ 12ఆర్ భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. వన్‌ప్లస్ 12 ఫోన్ ధర రూ. 64,999 నుంచి కాగా, వన్‌ప్లస్ 11ఆర్ రూ. 39,999 ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉన్నాయి.

OnePlus 12 And 12R, Buds 3 launched in India today

OnePlus 12 Series Launch : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ ఇండియా అధికారికంగా వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ 12ఆర్ ఫోన్లను లాంచ్ చేసింది. జనవరి 23న న్యూఢిల్లీలో రాత్రి 7.30 గంటలకు స్మూత్ బియాండ్ బిలీఫ్ (OnePlus smooth beyond belief Launch event) పేరుతో లాంచ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా వన్‌ప్లస్ కంపెనీ ఈ రెండు ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ ఫోన్‌లు, ఒక వన్‌ప్లస్ బడ్స్ 3 డివైజ్ రిలీజ్ చేసింది. చూసేందుకు ఈ రెండు ఆండ్రాయిడ్ ఫోన్లు ఆపిల్ ఐఫోన్ 15, శాంసంగ్ గెలాక్సీ ఎస్24, ఇతర ఫోన్లకు భిన్నంగా ఉంటాయి. రెండూ కూడా టాప్-ఎండ్ హార్డ్‌వేర్‌తో వస్తాయి. వన్‌ప్లస్ 12 గరిష్టంగా 16జీబీ ర్యామ్‌తో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3ని కలిగి ఉంది.

మరోవైపు, వన్‌ప్లస్ 12ఆర్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2పై నడుస్తుంది. రెండు డివైజ్‌లు ఆకట్టుకునే కెమెరా సెటప్‌లు, ప్రకాశవంతమైన డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. 4500 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని చేరుకోగలవు. ఈ ఫోన్‌లతో పాటు, వన్‌ప్లస్ బడ్స్ 3 కూడా లాంచ్ అయింది. బడ్స్ ప్రో, బడ్స్ 2 మాదిరిగానే ఉంటుంది. కొత్త బడ్స్ మోడల్ ధర, స్పెసిఫికేషన్లను వివరంగా పరిశీలిద్దాం.

వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ 12ఆర్, వన్‌ప్లస్ బడ్స్ 3 ధర, లభ్యత :

  • వన్‌ప్లస్ 12 రెండు వేరియంట్‌లలో వస్తుంది. ఈ డివైజ్ ధర ఈ క్రింది విధంగా ఉంది..
  • 12జీబీ +256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.64,999.
  • 16జీబీ+512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.69,999.

ఈ ఫోన్‌లు ఫ్లోవీ ఎమరాల్డ్, సిల్కీ బ్లాక్ వంటి రెండు రంగులలో లాంచ్ అయ్యాయి. వన్‌ప్లస్ 12 ఫస్ట్ సేల్ జనవరి 30, 2024న ప్రారంభమవుతుంది.

  • వన్‌ప్లస్ 12ఆర్ కూడా రెండు వేరియంట్లలో లాంచ్ అయింది.
  • వన్‌ప్లస్ 12ఆర్ 8జీబీ+1258జీబీ వేరియంట్ ధర రూ. 39,999.
  • 16జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.45,999.
  • వన్‌ప్లస్ 12ఆర్ కూడా అందుబాటులో ఉంది.
  • ఫిబ్రవరి 6, 2024న భారత మార్కెట్లో ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది.
  • వన్‌ప్లస్ బడ్స్ 3 ధర రూ. 5,499గా ఉంటుంది.

వన్‌ప్లస్ 12 స్పెసిఫికేషన్‌లు :
వన్‌ప్లస్ 12 సిరీస్ ఫోన్ 3168 x 1440 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.82-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. (LTPO) సపోర్టుతో 120హెచ్‌జెడ్ (ProXDR) డిస్‌ప్లే 1-120హెచ్‌జెడ్ డైనమిక్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. 4500 నిట్‌ల గరిష్ట ప్రకాశంతో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ద్వారా ప్రొటెక్ట్ అందిస్తుంది.

OnePlus 12 And 12R India

వన్‌ప్లస్ 12 మోడల్ 164.3ఎమ్ఎమ్ x 75.8 ఎమ్ఎమ్ x 9.15ఎమ్ఎమ్ కొలతలు, 220 గ్రాముల బరువుతో అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఈ డివైజ్ వెనుక భాగం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్ట్ చేస్తుంది. ఫ్లోవీ ఎమరాల్డ్, సిల్కీ బ్లాక్‌తో సహా రెండు ఆసక్తికరమైన కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఆక్సిజన్‌ఓఎస్‌తో నడుస్తుంది. హుడ్ కింద, వన్‌ప్లస్ 12 స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ద్వారా పవర్ పొందుతుంది.

Read Also : Apple iPhone 15 Series : విజయ్ సేల్స్ మెగా రిపబ్లిక్ డే సేల్.. ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లపై భారీ తగ్గింపు.. ఇప్పుడే కొనేసుకోండి!

ఈ డివైజ్ 12జీబీ/16జీబీ ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జీబీ/54.2జీబీ యూఎఫ్ఎస్ ఆప్షన్లతో ఆకట్టుకునే మెమరీ, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లను అందిస్తుంది. ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యాక్సిలెరోమీటర్, కంపాస్, గైరోస్కోప్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్‌తో సహా అనేక రకాల సెన్సార్‌ల ద్వారా వన్‌ప్లస్ పర్పార్మెన్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,400ఎంఎహెచ్ బ్యాటరీ ఉంది. దీనికి 100డబ్ల్యూ సూపర్‌వూక్, 50డబ్ల్యూ (AIRVOOC) ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలు ఉన్నాయి. ఈ ఫోన్ వైబ్రేషన్ ఫీడ్‌బ్యాక్ కోసం (Haptic) మోటార్, సైన్స్, ఆన్-స్క్రీన్ నావిగేషన్ సపోర్ట్, అలర్ట్ స్లైడర్, పవర్ బటన్, వాల్యూమ్ బటన్‌ల వంటి వివిధ బటన్‌లతో కూడా వస్తుంది.

కెమెరాల విషయానికి వస్తే.. వన్‌ప్లస్ 12లో 50ఎంపీ ప్రధాన కెమెరా, 48ఎంపీ వైడ్ కెమెరా, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 64ఎంపీ టెలిఫోటో కెమెరా, 48ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, 32ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ డివైజ్ డాల్బీ విజన్ హెచ్‌డీఆర్‌తో 24ఎఫ్‌పీఎస్ వద్ద 8కె, 30/60ఎఫ్‌పీఎస్ వద్ద 4కె, 30/60 ఎఫ్‌పీఎస్ వద్ద 1080పీ రిజల్యుషన్‌తో సహా ఆకట్టుకునే వీడియో రికార్డింగ్ సామర్థ్యాలకు సపోర్టు ఇస్తుంది. హాసెల్‌బ్లాడ్ కెమెరా, నైట్‌స్కేప్, స్మార్ట్ సీన్ రికగ్నిషన్, పోర్ట్రెయిట్ మోడ్, ఎక్స్‌ప్యాన్ మోడ్ వంటి విభిన్న కెమెరా ఫీచర్‌లు మల్టీఫేస్, హై-క్వాలిటీ ఫొటోగ్రఫీ ఎక్స్‌పీరియన్స్ అందిస్తాయి.

OnePlus 12 And 12R launched India today

వన్‌ప్లస్ 12 ప్యాకేజీలో (SUPERVOOC) పవర్ అడాప్టర్, టైప్-ఎ నుంచి సి- కేబుల్, సిమ్ ట్రే ఎజెక్టర్, యూఎస్‌బీ డాంగిల్ (టైప్-ఎ నుంచి సి) వంటి ముఖ్యమైన అప్లియన్సెస్ ఉన్నాయి. క్విక్ స్టార్ట్ గైడ్, వెల్‌కమ్ లెటర్, సేఫ్టీ ఇన్ఫర్మేషన్, వారెంటీ కార్డ్, లోగో స్టిక్కర్, మెంబర్‌షిప్ కార్డ్ వంటి అదనపు ఐటెమ్‌లు, యూజర్‌లకు ప్రీమియం మొబైల్ ఎక్స్‌పీరియన్స్ కోసం కావాల్సినవన్నీ ఉన్నాయి.

వన్‌ప్లస్ 12ఆర్ స్పెసిఫికేషన్‌లు ఇవే :
వన్‌ప్లస్ 12ఆర్ కూడా ఉపయోగకరమైన ఫీచర్‌లతో కూడిన శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్. ఈ స్మార్ట్‌ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14తో నడుస్తుంది. సున్నితమైన పనితీరుకు ఆక్సిజన్ ఓఎస్ కలిగి ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెనరేషన్ 2 చిప్, 8జీబీ ర్యామ్‌తో వస్తుంది. వన్‌ప్లస్ 12 హై- రిజల్యూషన్, సూపర్-ఫాస్ట్ రిఫ్రెష్ రేట్‌తో పెద్ద 6.78-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ప్రొటెక్షన్ కోసం.. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఉంది. ఈ డివైజ్ బ్లాక్, ఐరన్ గ్రే లేదా కూల్ బ్లూలో అందుబాటులో ఉండనుంది.

కెమెరాల విషయానికి వస్తే.. ఈ వన్‌ప్లస్ 12ఆర్ ఫోన్ వెనుకవైపు 3 కెమెరా సెన్సార్‌లను కలిగి ఉంది. అందులో 50ఎంపీ మెయిన్, 8ఎంపీ అల్ట్రా-వైడ్, 2ఎంపీ మాక్రో కెమెరా ఉన్నాయి. ముందు కెమెరా సెల్ఫీల కోసం 16ఎంపీ కెమెరా కలిగి ఉంది. బ్యాటరీ పరంగా చూస్తే.. వన్‌ప్లస్ 12ఆర్ ఫోన్ వన్‌ప్లస్ 12 కన్నా కొంచెం పెద్ద 5500ఎంఎహెచ్ బ్యాటరీ కలిగి ఉంది. సూపర్ వూక్ 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో చాలా త్వరగా ఛార్జ్ అవుతుంది. లోపల 128జీబీ స్టోరేజీని కలిగి ఉంది. కనెక్టివిటీ విషయంలో 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ మరిన్నింటికి సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ సాధారణ కనెక్టివిటీ, సెన్సార్‌లతో వస్తుంది. యూఎస్‌బీ టైప్-సి, స్క్రీన్‌పై ఫింగర్ ఫ్రింట్ సెన్సార్, కాంతి, యాక్సిలరోమీటర్, గైరోస్కోప్ సెన్సార్లు ఉన్నాయి.

వన్‌ప్లస్ బడ్స్ 3 స్పెసిఫికేషన్‌లు :
వన్‌ప్లస్ బడ్స్ 3 బడ్స్ ప్రో మాదిరిగానే కనిపిస్తుంది. కానీ, మెటాలిక్ గ్రే, స్ప్లెండిడ్ బ్లూ అన్ని కొత్త కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఇయర్‌బడ్‌లు, 31.68 x 20.22 x 24.4ఎమ్ఎమ్ కొలతలు, ఒక్కొక్కటి 4.8 గ్రాముల బరువు కలిగి ఉంటాయి. డైనమిక్ సౌండ్ క్వాలిటీ కోసం 10.4ఎమ్ఎమ్ వూఫర్‌ను 6ఎమ్ఎమ్ ట్వీటర్ డ్యూయల్ డ్రైవర్ సెటప్‌తో కలపాలి. 110+/-1.3డీబీ స్పీకర్ సెన్సిటివిటీ, 15హెచ్‌జెడ్ నుంచి 40కెహెచ్‌జెడ్ వరకు విస్తృత ఫ్రీక్వెన్సీ పరిధితో పనిచేస్తాయి. ఈ ఇయర్‌బడ్‌లు హై-రిజల్యూషన్ ఆడియో ఎక్స్‌పీరియన్స్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రతి ఇయర్‌బడ్‌కు మూడు మైక్రోఫోన్‌లు, బలమైన నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ ఉన్నాయి. 49(dB) వరకు నాయిస్ క్యాన్సిలేషన్ అందిస్తుంది.

OnePlus Buds 3 launched

వన్‌ప్లస్ బడ్స్ 3 టచ్ కంట్రోల్‌లతో వస్తుంది. యూజర్‌లు మ్యూజిక్ ప్లేబ్యాక్‌ని మేనేజ్ చేయడానికి కాల్‌లకు సమాధానం ఇవ్వడానికి, నాయిస్ క్యాన్సిలేషన్, పారదర్శకత మోడ్‌ల మధ్య సులభంగా టోగుల్ చేసేందుకు అనుమతిస్తుంది. అదనపు సౌలభ్యం కోసం ఇయర్‌బడ్‌లు స్లైడింగ్ వాల్యూమ్ నియంత్రణతో కూడా అమర్చి ఉంటాయి. ఐపీ55 సర్టిఫికేషన్‌తో ఈ ఇయర్‌బడ్‌లు నీరు, చెమటకు నిరోధకతను కలిగి ఉంటాయి. అంతేకాదు.. వివిధ వాతావరణాలకు కూడా అనుకూలంగా ఉంటాయి.

ఇయర్‌బడ్‌లు రీఛార్జ్ చేయగల (Li-ion) బ్యాటరీని కలిగి ఉన్నాయి. బడ్స్ (ANC)తో మాత్రమే ఇయర్‌బడ్‌లకు 6.5 గంటల ప్లేబ్యాక్ టైమ్, ఏఎన్‌సీతో ఛార్జింగ్ కేస్‌తో కలిపి ఉపయోగించినప్పుడు 28 గంటల వరకు ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తాయని కంపెనీ పేర్కొంది. ఇయర్‌బడ్‌లు గూగుల్ ఫాస్ట్ పెయిర్‌కి సపోర్టు ఇస్తాయి. ఛార్జింగ్ కోసం యూఎస్‌బీ టైప్-సిని ఉపయోగించవచ్చు.

Read Also : Hero Xtreme 125R Launch : కొత్త బైక్ కొంటున్నారా? హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్‌ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలుసా?