OnePlus 12 Discount Offers : ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో వన్‌ప్లస్ 12పై భారీ డిస్కౌంట్లు ఆఫర్లు.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!

OnePlus 12 Discount Offers : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? వన్‌ప్లస్ 12 ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

OnePlus 12 Discount Offers : కొత్త ఫోన్ కొంటున్నారా? వన్‌ప్లస్ 12 ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ రెండింటిలోనూ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ ఫ్లాగ్‌షిప్ డివైజ్‌ను కొన్ని బ్యాంక్ ఆఫర్‌లతో తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. బ్యాంక్ కార్డ్‌లపై మరిన్ని డిస్కౌంట్లను పొందవచ్చు. వన్‌ప్లస్ 12 ఇప్పటికే ఆఫర్ చేస్తున్న ఫీచర్లతో తక్కువ ధరకు అమ్ముడవుతోంది. అయితే, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో లేటెస్ట్ డిస్కౌంట్ ఆఫర్‌, డీల్‌ను అందిస్తోంది. పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.

Read Also : iPhone 16 Pro Leak : ఆపిల్ లవర్స్‌కు ఇంట్రెస్టింగ్ న్యూస్.. ఐఫోన్ 16ప్రో కలర్ ఆప్షన్లు లీక్, క్యాప్చర్ బటన్ లొకేషన్ తెలిసిందోచ్!

ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో వన్‌ప్లస్ 12 డిస్కౌంట్ ఆఫర్‌లతో అందుబాటులో ఉంది. ఇదే ఫోన్ రూ. 63,065 ప్రారంభ ధరతో కొనుగోలు చేయొచ్చు. 256జీబీ స్టోరేజీ, 12జీబీ ర్యామ్, ఐసీఐసీఐ బ్యాంక్ రూపే క్రెడిట్ కార్డ్‌పై అదనంగా 10 శాతం తగ్గింపు కూడా పొందవచ్చు. ఈఎంఐ ఆప్షన్లపై ఇతర బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. భారత మార్కెట్లో ఈ ఫ్లాగ్‌షిప్ డివైజ్ రూ. 64,999కి లాంచ్ అయింది. వినియోగదారులు రూ. 1,934 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు.

ఏదైనా బ్యాంక్ ఆఫర్‌లను పొందే యూజర్లు ఫ్లిప్‌కార్ట్ ద్వారా తక్కువ ధరకు డివైజ్ కొనుగోలు చేయొచ్చు. అమెజాన్, వన్‌ప్లస్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. పాత ఫోన్‌ని మార్చుకోకూడదనుకునే వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ ద్వారా వన్‌ప్లస్ 12ని కొనుగోలు చేయొచ్చు. ఎందుకంటే.. ఎలాంటి నిబంధనలు లేదా షరతులు లేకుండా ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. మరింత తగ్గింపు పొందడానికి అర్హత ఉన్న బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించవచ్చు. మరోవైపు, అమెజాన్, వన్‌ప్లస్ 12 ధర రూ. 64,999 వద్ద జాబితా చేసింది.

మరెన్నో బ్యాంకు ఆఫర్లు, డిస్కౌంట్లు :
ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు, వన్‌కార్డ్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 2వేల తగ్గింపును అందిస్తోంది. అమెజాన్‌లో నేరుగా ఇతర బ్యాంక్ కార్డ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ కింద వన్‌ప్లస్ ధరను రూ. 62,999కి తగ్గిస్తుంది. 256జీబీ స్టోరేజీ+ 12జీబీ ర్యామ్ కాన్ఫిగరేషన్‌ను కొనుగోలు చేయొచ్చు. వన్‌ప్లస్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ కూడా అదే తగ్గింపు ఆఫర్‌లను అందిస్తోంది. మీ పాత ఫోన్‌ను కొత్త వన్‌ప్లస్ 12తో ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా భారీ తగ్గింపును పొందవచ్చు. అమెజాన్, వన్‌ప్లస్ సైట్‌లలో కూడా ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ చెక్ చేయవచ్చు.

అమెజాన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా రూ. 27,550 వరకు తగ్గింపును అందిస్తోంది. మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్ ఆధారంగా ఎక్స్ఛేంజ్ వాల్యూ ఉంటుంది. మీ పాత ఫోన్‌కు ఎంత మొత్తం పొందవచ్చననే దానిపై క్లారిటీ లేదు. ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్‌పై వివరాలను పొందడానికి మీ డివైజ్ పేరును సైట్‌ (OnePlus.in)లో మాన్యువల్‌గా ఎంటర్ చేయాలి. వన్‌ప్లస్ వెబ్‌సైట్‌లో రెగ్యులర్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందే యూజర్లు కూడా రూ. 7వేల వరకు అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ (డిస్కౌంట్) పొందవచ్చునని వెబ్‌సైట్‌లో పేర్కొంది.

Read Also : Toyota Cars : ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న టయోటా కార్లు ధరలు

ట్రెండింగ్ వార్తలు