OnePlus 12 Launch : కొత్త కలర్ ఆప్షన్‌తో వన్‌ప్లస్ 12 ఫోన్ వచ్చేస్తోంది.. భారత్‌లో లాంచ్‌కు ముందే డిజైన్, ఇతర ఫీచర్లు లీక్..!

OnePlus 12 Launch : వన్‌ప్లస్ ఇండియా నుంచి వన్‌ప్లస్ 12 కొత్త కలర్ ఆప్షన్ వస్తోంది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్‌ప్లస్ 12 కొత్త కలర్‌వే జూమ్-ఇన్ ఫొటోను షేర్ చేసింది.

OnePlus 12 Launch in India Soon ( Image Credit : Google )

OnePlus 12 Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి అతి త్వరలో వన్‌ప్లస్ నుంచి వన్‌ప్లస్ 12 ఫోన్ లాంచ్ కానుంది. రాబోయే ఈ కొత్త వన్‌ప్లస్ 12 ఫోన్ కొత్త కలర్ ఆప్షన్‌తో రానుంది. కంపెనీ సోషల్ మీడియా అకౌంట్లలో ఈ విషయాన్ని వెల్లడించింది. రాబోయే ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ మూడో రంగుతో రానుంది.

గత జనవరిలో లాంచ్ అయిన సమయంలో ఇప్పటికే ఫ్లోవీ ఎమరాల్డ్, సిల్కీ బ్లాక్‌లను కంపెనీ ప్రవేశపెట్టింది. అయితే, కంపెనీ కొత్త ఫోన్ లాంచ్ తేదీని రివీల్ చేయలేదు. కానీ అది త్వరలో లాంచ్ చేయనుందని భావిస్తున్నారు. ముఖ్యంగా, హ్యాండ్‌సెట్ ఇతర హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్ మార్పులతో వచ్చే అవకాశం లేదని చెప్పవచ్చు.

Read Also : Bounce Infinity E1X Scooter : కొంటే ఈ స్కూటర్ కొనాలి.. రూ.55వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్‌.. బ్యాటరీ స్వాపింగ్ చేసుకోవచ్చు!

వన్‌‌ప్లస్ 12 కొత్త కలర్ ఆప్షన్ :
వన్‌ప్లస్ ఇండియా నుంచి వన్‌ప్లస్ 12 కొత్త కలర్ ఆప్షన్ వస్తోంది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్‌ప్లస్ 12 కొత్త కలర్‌వే జూమ్-ఇన్ ఫొటోను షేర్ చేసింది. ఈ కొత్త ఫోన్ కలర్ ఏంటో చెప్పాలని యూజర్లను కోరింది. కెమెరా మాడ్యూల్ మెరిసే ఎండ్ మెటాలిక్ సిల్వర్ కలర్‌ను కలిగి ఉంది. చూసేందుకు “గ్లేసియల్ వైట్” అని అంటున్నారు. ఈ ఫోన్ అధికారిక మోనికర్ కూడా కావచ్చు.

ఈ నెల ప్రారంభంలో ఆండ్రాయిడ్ అథారిటీ నివేదిక ఆక్సిజన్ ఓఎస్ v14.0.0.608 అప్‌డేట్ కోడ్‌లలో గ్లేసియల్ వైట్ గురించి ప్రస్తావించింది. ముఖ్యంగా, వన్‌ప్లస్ 12 చైనాలో ప్రత్యేకంగా గ్లేసియల్ వైట్ కలర్ ఆప్షన్‌లో లాంచ్ అయింది. కానీ, ఇతర మార్కెట్‌లలో కూడా అందుబాటులోకి రాలేదు. కంపెనీ ఇప్పుడు ఇదే వన్‌ప్లస్ మోడల్ భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఈ ఫోన్ వచ్చే అవకాశం ఉంది.

వన్‌ప్లస్ 12 స్పెసిఫికేషన్లు :
వన్‌ప్లస్ 12 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.82-అంగుళాల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌టీపీఓ 4.0 అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. హుడ్ కింద 16జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జీబీ వరకు యూఎఫ్‌ఎస్ 4.0 ఇంటర్నల్ స్టోరేజీతో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్‌సెట్‌తో వస్తుంది. కెమెరాల విషయానికి వస్తే.. స్మార్ట్‌ఫోన్ సర్కిల్ మాడ్యూల్‌లో ట్రిపుల్ రియర్ సెటప్‌ను కలిగి ఉంది. ప్రాథమిక షూటర్ 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ-808 సెన్సార్ కలిగి ఉంది.

48ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో కూడిన 64ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను కూడా కలిగి ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 32ఎంపీ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో వన్‌ప్లస్ 12 5జీ, 4జీ ఎల్‌టీఈ, వై-ఫై7, బ్లూటూత్ 5.4, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ సపోర్టు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 100డబ్ల్యూ సూపర్‌వూక్ వైర్డ్ ఛార్జర్‌తో పాటు 5,400ఎంఎహెచ్ బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. 50డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్, 10డబ్ల్యూ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.

Read Also : Xiaomi 14 Civi Launch : కర్వ్ డిస్‌ప్లేతో కొత్త షావోమీ 14 సివి ఫోన్ వచ్చేస్తోంది.. జూన్ 12నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు