OnePlus 13 And 13R Global Launch Date
OnePlus 13 Series Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? భారత సహా గ్లోబల్ మార్కెట్లో అతి త్వరలో వన్‌ప్లస్ 13 ఫోన్ లాంచ్ కానుంది. కంపెనీ ఇప్పుడు ఫ్లాగ్‌షిప్ హ్యాండ్‌సెట్ చైనా వెలుపల లాంచ్ తేదీని ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్‌ప్లస్ 13 సిరీస్ గ్లోబల్ రాకను కూడా ప్రకటించింది.
ఈ లైనప్‌లో వన్‌ప్లస్ 13ఆర్ ఉండవచ్చని సూచిస్తుంది. వన్‌ప్లస్ 12ఆర్ అప్‌గ్రేడ్ వెర్షన్ అయి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఆర్ వేరియంట్ వన్‌ప్లస్ ఏస్ 5కి కొత్త వేరియంట్‌గా అంచనా. డిసెంబర్ 26న చైనాలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 13 అక్టోబర్‌లో చైనాలో లాంచ్ అయింది.
వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13ఆర్ గ్లోబల్ లాంచ్ తేదీ :
కంపెనీ ప్రకారం.. వన్‌ప్లస్ 13 సిరీస్ జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. భారత మార్కెట్లో లాంచ్ ఈవెంట్ లైవ్ రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది. వన్‌ప్లస్ వింటర్ లాంచ్ ఈవెంట్ వర్చువల్ ఈవెంట్‌గా ఉండనుంది. ఎందుకంటే.. ఈ ప్రకటనలో లొకేషన్ లేదు. “సిరీస్” అనే పదం రోజులో ఒకటి కన్నా ఎక్కువ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనుందని సూచిస్తుంది. వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13ఆర్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
ప్రామాణిక వన్‌ప్లస్ 13 మోడల్ ఇప్పటికే ఆర్కిటిక్ డాన్, బ్లాక్ ఎక్లిప్స్, మిడ్‌నైట్ ఓషన్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉన్నట్లు అంచనా. అమెజాన్ ద్వారా భారత్ మార్కెట్లో ఈ హ్యాండ్‌సెట్ లభ్యం కానుంది. ఈ వన్‌ప్లస్ 13 ఆండ్రాయిడ్ 15-ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్ 15తో వస్తుంది. అనేక ఏఐ- ఆధారిత ఇమేజింగ్, నోట్-టేకింగ్ ఫీచర్‌లకు సపోర్టును అందిస్తుంది.
వన్‌ప్లస్ 13 గ్లోబల్ వేరియంట్ స్పెసిఫికేషన్‌లు (అంచనా) :
వన్‌ప్లస్ 13 గ్లోబల్ వెర్షన్ ఇప్పటికే ఉన్న చైనీస్ వేరియంట్‌కు సమానంగా ఉంటుందని భావిస్తున్నారు. 6.82-అంగుళాల క్వాడ్-హెచ్‌డీ+ ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లేను 120Hz వరకు రిఫ్రెష్ రేట్, గరిష్ట ప్రకాశం స్థాయి 4,500నిట్స్, డాల్బీ విజన్‌ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ గరిష్టంగా 24జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎస్ఓసీతో రానుంది.
కెమెరా సెక్షన్లలో వన్‌ప్లస్ 13 గ్లోబల్ వేరియంట్ 50ఎంపీ మెయిన్ సెన్సార్, 50ఎంపీ అల్ట్రావైడ్ షూటర్, పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో కూడిన మరో 50ఎంపీ సెన్సార్‌ను పొందవచ్చు. ఫ్రంట్ కెమెరాలో 32ఎంపీ సెన్సార్ ఉండవచ్చు. 100డబ్ల్యూ వైర్డు, 50డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
Read Also : UPI QR Code Scams : ఆన్‌లైన్ పేమెంట్లకు యూపీఐని వాడుతున్నారా? క్యూఆర్ కోడ్ స్కామ్‌లను ఎలా నివారించాలంటే?