OnePlus 13 Price Drop
OnePlus 13 Price Drop : వన్‌ప్లస్ యూజర్లకు అద్భుతమైన సేల్ ఆఫర్.. అతి త్వరలో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ రాబోతోంది. ఈ సేల్ సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లు, ఇయర్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు మరిన్నింటిపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు ఉండనున్నాయి.
అంతకన్నా ముందుగానే అమెజాన్ ప్లాట్‌ఫామ్ ప్రీ-డీల్‌లను (OnePlus 13 Price Drop) ప్రవేశపెట్టింది. ఈ అడ్వాన్స్ సేల్ ద్వారా అద్భుతమైన డిస్కౌంట్‌తో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లను పొందవచ్చు. మీరు వన్‌ప్లస్ అభిమాని అయితే, ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్13 స్పెసిఫికేషన్లు, ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంది. అమెజాన్ ఈ కొత్త డీల్ కింద భారీ డిస్కౌంట్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అమెజాన్‌లో వన్‌ప్లస్ 13 ఎక్స్ఛేంజ్ ఆఫర్ :
వన్‌ప్లస్ 13 ఫోన్ 12GB ర్యామ్ వేరియంట్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రూ.69,998 ధరకు లభిస్తుంది. అసలు ధర రూ.72,999కు పొందవచ్చు. అంతేకాకుండా, అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ కొనుగోలు ద్వారా రూ. 2,099 వరకు అమెజాన్ పే బ్యాలెన్స్ పొందవచ్చు.
మీ దగ్గర పాత ఫోన్ ఉంటే ఎక్స్ఛేంజ్ కూడా పొందవచ్చు. మీరు చేయాల్సిందిల్లా.. స్క్రీన్ పై రైట్ సైడ్ ఉన్న ఎక్స్ఛేంజ్ ట్యాప్ పై నొక్కాలి. ఆపై మీ డివైజ్ బ్రాండ్, మోడల్‌ను ఎంచుకోవాలి. ఇప్పుడు ఎక్స్ఛేంజ్ ఆర్డర్ సులభంగా పొందవచ్చు. మరో విషయం ఏమిటంటే.. ఎక్స్ఛేంజ్ ధర ఒకేలా ఉండదు. మీ ఫోన్ కండిషన్ చెక్ చేసిన తర్వాత ధరలో మార్పు ఉండొచ్చు.
వన్‌ప్లస్ 13 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
వన్‌ప్లస్ 13 ఫోన్ 6.82-అంగుళాల LTPO 4.1 అమోల్డ్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. అడ్రినో 830 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్‌తో క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్
8 ఎలైట్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది.
ఈ వన్‌ప్లస్ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP ప్రైమరీ షూటర్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్, 120-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ స్నాపర్ కలిగి ఉంది. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీతో పాటు 100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రన్ అవుతుంది.