Amazon Early Bird Deals : ఒప్పో ఫ్యాన్స్‌కు పండగే.. అమెజాన్‌లో ఈ ఒప్పో రెనో 13పై భారీ డిస్కౌంట్.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి!
Amazon Early Bird Deals : ఒప్పో రెనో 13 ధర తగ్గింది. ఈ ఒప్పో ఫోన్ భారీ తగ్గింపు ధరకే ఇలా కొనేసుకోవచ్చు. ఇలాంటి డీల్ మళ్లీ రాదు..

Amazon Early Bird Deals
Amazon Early Bird Deals : కొత్త ఒప్పో ఫోన్ కోసం చూస్తున్నారా? 2025 ప్రారంభంలో ఒప్పో ఇండియా రెనో 13 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఈ ఒప్పో ఫోన్ స్టైలిష్ డిజైన్, కెమెరా ఫీచర్లతో మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.
అతి త్వరలో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025 ప్రారంభం కానుంది. అధికారిక షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 23న అమెజాన్ (Amazon Early Bird Deals) సేల్ ప్రారంభం కానుంది. అంతకన్నా ముందుగానే ఒప్పో రెనో 13 భారీ తగ్గింపు పొందింది. మీరు సరైన డీల్ కోసం చూస్తుంటే రూ. 26వేల కన్నా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
అమెజాన్‌లో ఒప్పో రెనో 13 ధర తగ్గింపు :
ఒప్పో రెనో 13 ఫస్ట్ రూ.37,999కు లాంచ్ అయింది. అమెజాన్ ఎర్లీ బర్డ్ సేల్ ద్వారా రూ.26,999కు తగ్గింది. దాదాపు రూ.11వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాదు.. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలుదారులు అదనంగా రూ.1,000 తగ్గింపు పొందవచ్చు. ధర కేవలం రూ.25,999కు తగ్గుతుంది. అమెజాన్‌లో ఈ ఒప్పో రెనో 13పై అత్యంత భారీ డిస్కౌంట్ ఇదే కావడం విశేషం.
ఒప్పో రెనో 13 స్పెసిఫికేషన్లు :
ఒప్పో రెనో 13 స్మార్ట్‌ఫోన్ 1.5K రిజల్యూషన్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.59-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్ (4nm)పై రన్ అవుతుంది. 8GB LPDDR5X ర్యామ్, 256GB UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. ఇవన్నీ ఆండ్రాయిడ్ 15-ఆధారిత ColorOS 15 సపోర్టుతో వస్తాయి.
80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5600mAh యూనిట్ ద్వారా బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. IP66, IP68, IP69 రేటింగ్‌లతో వస్తుంది. కెమెరాల విషయానికొస్తే.. ఒప్పో రెనో 13 ఫోన్ 50MP మెయిన్ షూటర్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మోనోక్రోమ్ సెన్సార్‌తో పాటు 50MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. ఒప్పో రెనో 13 ఫోన్ డీల్ అసలు వదులుకోవద్దు.