Best Mobiles Deal : అమెజాన్‌లో అద్భుతమైన డీల్స్.. రూ. 40వేల నుంచి రూ.50వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. ఏది కొంటారంటే?

Best Mobiles Deal : అమెజాన్‌లో రూ. 50వేల లోపు ధరకే బెస్ట్ స్మార్ట్ ఫోన్లు లభ్యమవుతున్నాయి. ఆపిల్, శాంసంగ్, వన్ ప్లస్ ఫోన్లపై డీల్స్..

Best Mobiles Deal : అమెజాన్‌లో అద్భుతమైన డీల్స్.. రూ. 40వేల నుంచి రూ.50వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. ఏది కొంటారంటే?

Best Mobiles Deal

Updated On : September 13, 2025 / 5:17 PM IST

Best Mobiles Deal : మీరు బెస్ట్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, అద్భుతమైన డీల్స్ మీకోసం.. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో (Best Mobiles Deal) అత్యాధునిక ఫీచర్లతో క్రేజీ ఫోన్లు లభ్యమవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 5G కనెక్టివిటీతో మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి.

ప్రస్తుతం మార్కెట్‌లో ఇలాంటి ఫోన్లకు ఫుల్ డిమాండ్ ఉంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ల జాబితాలో ఆపిల్, శాంసంగ్, వన్‌ప్లస్ వంటి అనేక బ్రాండ్‌లు ఉన్నాయి. మీరు అమెజాన్ డీల్స్ ద్వారా రూ. 40వేల నుంచి రూ. 50 వేల ధరల రేంజ్‌‌లో కొనుగోలు చేయవచ్చు. అనేక ఆఫర్లు, డిస్కౌంట్లను పొందవచ్చు. అదనపు సేవింగ్స్ కూడా పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ A56 5G ఫోన్ :
శాంసంగ్ గెలాక్సీ టాప్ 5G మోడల్. ఇలాంటి ఫోన్ కొనేందుకు ఇదే బెస్ట్ ఆప్షన్. ఈ శాంసంగ్ ఫోన్ 7.4 mm మందంతో గ్రాఫైట్ కలర్ ఆప్షన్లతో వస్తుంది. ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఏఐ ఫీచర్లు, 5G సపోర్టుతో వస్తుంది. 6.7-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో రూ. 44,999కు కొనుగోలుకు అందుబాటులో ఉంది.

Read Also : Samsung Galaxy S24 Ultra Price : ఫ్లిప్‌కార్ట్ BBD సేల్‌ ఆఫర్లు.. శాంసంగ్ గెలాక్సీ S24పై భారీ డిస్కౌంట్.. ఈ అద్భుతమైన డీల్ మీకోసమే..!

ఆపిల్ ఐఫోన్ 13 :
ఐఫోన్ కొనేందుకు చూస్తుంటే.. ఆపిల్ ఐఫోన్ 13 తీసుకోవచ్చు. తక్కువ ధరలో మీకు బెస్ట్ ఆప్షన్. ఇందులో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే పొందవచ్చు. అడ్వాన్స్ డ్యూయల్ కెమెరాతో వస్తుంది. హై క్వాలిటీ ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. A15 బయోనిక్ చిప్‌తో స్పీడ్ పర్ఫార్మెన్స్‌తో వస్తుంది. తద్వారా రూ. 43,900 రేంజ్‌లో కొనుగోలు చేయవచ్చు.

మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో 5G ఫోన్ :
ఫీచర్ల పరంగా పరిశీలిస్తే.. మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో బెస్ట్ ఫోన్. అడ్వాన్స్ 50MP ఏఐ కెమెరాతో వస్తుంది. ఆకర్షణీయమైన ఫొటోలు, వీడియోలను రికార్డ్ చేయొచ్చు. 6.7-అంగుళాల కర్వ్డ్ pOLED డిస్‌ప్లేతో స్టైలిష్ లుక్‌లో వస్తుంది. తేలికైన, సన్నని డిజైన్‌తో వస్తుంది. ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో 5G ఫోన్ రూ. 40,999కి కొనుగోలు చేయవచ్చు.