OnePlus 15 Launch
OnePlus 15 Launch : వన్‌ప్లస్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. మరో రెండు రోజుల్లో వన్‌ప్లస్ 15 భారత మార్కెట్లో లాంచ్ కానుంది. వన్‌ప్లస్ 13 జనవరి 2025లో లాంచ్ అయింది. ఇప్పుడు ఈ ఫోన్ అప్‌గ్రేడ్ వెర్షన్ వన్‌ప్లస్ 15 ఇదే ఏడాది నవంబర్‌లో లాంచ్ అవుతుంది. ఈ బ్రాండ్ లాంచ్ ఎప్పుడు అనేది ఆసక్తిగా మారింది. ఐక్యూ, రియల్‌మి, ఒప్పో వంటి కంపెనీలు ఈ నెలలో ఫ్లాగ్‌షిప్ ప్రొడక్టులను లాంచ్ చేస్తున్నాయి.
వివో కూడా డిసెంబర్ 2025లో (OnePlus 15 Launch) వివో X300 సిరీస్ ఫ్లాగ్‌షిప్‌ను లాంచ్ చేయనుంది. వన్‌ప్లస్ ప్రీమియం ఫోన్‌ను ఇతర కంపెనీల కన్నా ముందే మార్కెట్‌లోకి ప్రవేశపెట్టాలని భావిస్తోంది. మరో 2 రోజుల్లో వన్‌ప్లస్ 15 లాంచ్ కానుంది. అయితే, ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే.. భారత మార్కెట్లో ఈ ఫోన్ ధర ఎంత? అనేది ఇప్పుడు చూద్దాం..
మరో 2 రోజుల్లో వన్‌ప్లస్ 15 లాంచ్.. భారత్ ధర ఎంత ఉండొచ్చు? :
భారత మార్కెట్లో వన్‌ప్లస్ 15 ధర రూ. 70వేల కన్నా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ముందుగా చైనాలో ధరను పరిశీలిస్తే.. వన్‌ప్లస్ 12 ఫోన్ చైనాలో CNY 4,299 (సుమారు రూ. 50,600) వద్ద లాంచ్ అయింది. దేశ మార్కెట్లో రూ.64,999కు అందుబాటులో ఉంది. అంటే.. రూ.14,399 ధర తేడా ఉంది. చైనాలో వన్‌ప్లస్ 11 ఫోన్ రూ.48వేలు ధర ఉండగా భారత మార్కెట్లో రూ.56,999 ధర ఉంది.
Read Also : Vivo T4x 5G : వివో లవర్స్ మీకోసమే.. భారీగా తగ్గిన కొత్త వివో T4x 5G ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
అదేవిధంగా, వన్‌ప్లస్ 13 చైనాలో CNY 4,499కు లాంచ్ అయింది. భారత కరెన్సీలో దాదాపు రూ.53,100 అనమాట. అయితే, దేశంలో రూ.69,999 అధిక ధరకు లాంచ్ అయింది. ధర వ్యత్యాసం రూ.16,899గా ఉంది. ఇప్పుడు, వన్‌ప్లస్ 15 చైనాలో CNY 3,999కు లాంచ్ అయింది.. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.50వేలు ఉంటుందని అంచనా.
వన్‌ప్లస్ ప్రతి ఫ్లాగ్‌షిప్ లాంచ్ సమయంలో ఫోన్ల ధరలను భారీగా పెంచుతోంది. అయితే, ఇటీవల సంవత్సరాలలో మొదటిసారిగా లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ధరను భారీగా తగ్గించింది. చైనాలోనే కాదు.. ప్రపంచ మార్కెట్‌లో కూడా ఇది జరిగే అవకాశం ఉంది. భారత మార్కెట్లో వన్‌ప్లస్ 13 రూ.69,999కు లాంచ్ అయింది. కంపెనీ వన్‌ప్లస్ 15 కొద్దిగా సరసమైన ధరకే రావొచ్చు. కొత్త మోడల్ ధర ఎంత ఉండొచ్చు అనేది అధికారికంగా కంపెనీ వెల్లడించలేదు.