OnePlus 15 Series
OnePlus 15 Series : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్‌ప్లస్ నెక్స్ట్ ఫ్లాగ్‌షిప్ లైనప్ వన్‌ప్లస్ 15 సిరీస్ లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. వన్‌ప్లస్ నుంచి వన్‌ప్లస్ 15, వన్‍ప్లస్ 15R రెండు ఫోన్లు రాబోతున్నాయి. వన్‌ప్లస్ 15 గ్లోబల్ లాంచ్ జరిగే అవకాశం ఉంది.
నివేదికలను పరిశీలిస్తే.. వచ్చే నెల ప్రారంభంలోనే భారత మార్కెట్లో (OnePlus 15 Series) లాంచ్ కావొచ్చు. వన్‌ప్లస్ 15 ఫోన్ ఫీచర్లు, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, భారీ బ్యాటరీ, రిఫ్రెష్ డిజైన్ వంటి ఫీచర్లతో ఇంకా ఏయే ఫీచర్లు ఉండొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
వన్‌ప్లస్ 15 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, డిజైన్ (అంచనా) :
స్టాండర్డ్ వన్‌ప్లస్ 15 క్వాల్కమ్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్ 165Hz రిఫ్రెష్ రేట్‌తో ఫ్లాట్ 1.5K డిస్‌ప్లే కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంటుందని భావిస్తున్నారు. ఈ వన్‌ప్లస్ ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో భారీ 7500mAh బ్యాటరీని అందించవచ్చు.
ఫొటోగ్రఫీ అభిమానులు ట్రిపుల్ 50MP కెమెరా సిస్టమ్ కలిగి ఉండొచ్చు. ఇందులో ప్రైమరీ షూటర్, అల్ట్రా-వైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో టెలిఫోటో సెన్సార్ ఉంటాయి. ఇప్పటికే సాండ్ స్టార్మ్ ఫినిషింగ్ వంటి ఫీచర్లు రివీల్ అయ్యాయి. బ్లాక్, పర్పుల్ వంటి అదనపు కలర్ ఆప్షన్‌లు కూడా ఉండే అవకాశం ఉంది.
భారత మార్కెట్లో బడ్జెట్-ఫ్రెండ్లీ ఫ్లాగ్‌షిప్‌గా వన్‌ప్లస్ 15R లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 165Hz రిఫ్రెష్ రేట్‌తో ఫ్లాట్ OLED 1.5K డిస్‌ప్లేతో పాటు హుడ్ కింద అదే స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో వస్తుందని భావిస్తున్నారు. వన్‌ప్లస్ 15 మాదిరిగానే 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 7500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
కెమెరా ఫ్రంట్ సైడ్ సెటప్ వన్‌ప్లస్ 13R మాదిరిగానే ఉంటుందని భావిస్తున్నారు. కానీ, ఈసారి అప్‌గ్రేడ్ సెన్సార్‌లతో రావచ్చు. ఇతర అప్‌గ్రేడ్‌లలో అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, IP68, IP69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఉండవచ్చు. బ్లాక్, సిల్వర్, వైట్ కలర్ ఆప్షన్లలో రావొచ్చు.
భారత్‌లో వన్‌ప్లస్ 15, వన్‌ప్లస్ 15R ధర, లాంచ్ తేదీ (అంచనా) :
నివేదికల ప్రకారం.. వన్‌ప్లస్ 15 నవంబర్ 13, 2025న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. గత జనరేషన్ ఫోన్లతో పోలిస్తే ధర కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. వన్‌ప్లస్ 15R ధర దాదాపు రూ.44,999 వరకు ఉండవచ్చు, వన్‌ప్లస్ 13R ఫోన్ రూ.42,999 లాంచ్ ధర కన్నా ఎక్కువగా ఉండొచ్చు. వన్‌ప్లస్ 15 స్టోరేజ్ వేరియంట్‌ను బట్టి రూ.65వేల నుంచి రూ.75వేల రేంజ్ తగ్గే అవకాశం ఉంది.