Vivo X300 Series : వివోనా మజాకా.. కొత్త వివో X300 సిరీస్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంతో గెస్ చేయగలరా?
Vivo X300 Series : వివో X300 సిరీస్ రిలీజ్ అయింది. భారత మార్కెట్లో ఈ రెండు ఫోన్ల స్పెషిఫికేషన్లు, ఫీచర్లు, ధర అంచనా వివరాలు ఉన్నాయి.

Vivo X300 Series
Vivo X300 Series : వివో నుంచి సరికొత్త ఫోన్ వచ్చేసింది. అద్భుతమైన ఫీచర్లతో వివో X300 సిరీస్ చైనాలో లాంచ్ అయింది. ఇందులో వివో X300, వివో X300 ప్రో ఉన్నాయి. ఈ రెండూ మీడియాటెక్ డైమన్షిటీ 9500 ప్రాసెసర్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. వివో X300 సిరీస్ 6.31-అంగుళాల ఎల్టీపీఓ డిస్‌ప్లే, 200MP ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6040mAh బ్యాటరీని అందిస్తుంది.
వివో X300 సిరీస్ చివరకు రెండు ఫోన్‌లతో చైనా (Vivo X300 Series) మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ వివో ఫోన్లలో ఫ్లాగ్‌షిప్ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్, ప్రో వెర్షన్ అద్భుతమైన కెమెరా కలిగి ఉంది. వివో X300, వివో X300 ప్రో రెండు ఫోన్ల స్పెసిఫికేషన్లు, ఫీచర్లతో పాటు భారత మార్కెట్లో ధర, లాంచ్ ఎప్పుడు అనేది పూర్తి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం..
వివో X300, X300 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
వివో X300 ఫోన్ 6.31-అంగుళాల 8T ఎల్టీపీఓ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ రీడర్ ఉన్నాయి. మీడియాటెక్ డైమన్షిటీ 9500 ప్రాసెసర్, 16GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ 6040mAh బ్యాటరీతో పాటు 90W వైర్డు, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంది.
200MP శాంసంగ్ హెచ్‌పీబీ ప్రైమరీ సెన్సార్, 50MP శాంసంగ్ జేఎన్1 అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 50MP సోనీ ఎల్‌వైటీ-602 ఏపీఓ టెలిఫోటో సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ వివో ఫ్రంట్ సైడ్ 50MP స్నాపర్‌ను కలిగి ఉంది.
వివో X300 ప్రోలో 6.78-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. వివో 4 మెయిన్ ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లతో ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా రూపొందింది.
200MP జీఈఐఎస్ఎస్ శాంసంగ్ హెచ్‌పీబీ టెలిఫోటో షూటర్, 50MP సోనీ ఎల్‌వైటీ-828 ప్రైమరీ షూటర్, 50MP శాంసంగ్ JN1 అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ వివో V3+ ఇమేజింగ్ చిప్‌తో మీడియాటెక్ డైమన్షిటీ 9500 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 6510mAh బ్యాటరీతో పాటు బేస్ వేరియంట్ మాదిరిగానే ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
భారత్‌లో వివో X300, వివో X300 ప్రో ధర, లాంచ్ తేదీ :
వివో X300 ఫోన్ 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.60వేలకు భారత మార్కెట్‌కు చేరుకోవచ్చు. మరోవైపు, వివో X300 ప్రో ధర దాదాపు రూ.99,999గా ఉంటుంది. లాంచ్ విషయానికొస్తే.. డిసెంబర్ 2025 లేదా జనవరి 2026 నాటికి వివో x300 ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.