OnePlus 15 Price
OnePlus 15 Launch : వన్‌ప్లస్ అభిమానులకు గుడ్ న్యూస్.. చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్‌ప్లస్ నుంచి మరో భారీ ఫ్లాగ్‌షిప్ ఫోన్ వచ్చేస్తోంది. నివేదికల ప్రకారం.. వన్‌ప్లస్ 15 అతి త్వరలో ప్రపంచ మార్కెట్లో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అవుతుందని లీక్‌లు సూచిస్తున్నాయి.
ఈసారి కొత్త వన్‌ప్లస్ 15 ఫోన్ ఈ నెలాఖరు (OnePlus 15 Launch) నాటికి చైనాలో మొదట లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. కంపెనీ ఒకేసారి గ్లోబల్ లాంచ్ చేసే అవకాశం ఎక్కువగా ఉందని పుకార్లు సూచిస్తున్నాయి. రాబోయే వన్‌ప్లస్ 15 స్పెసిఫికేషన్లు, లాంచ్, ధరల వివరాలు ముందుగానే లీక్ అయ్యాయి. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి.
ప్రారంభ లీక్‌ల ప్రకారం.. వన్‌ప్లస్ 15 ఫోన్ 1.5K రిజల్యూషన్, ఎల్టీపీఓ టెక్నాలజీతో 6.78-అంగుళాల BOE X3 అమోల్డ్ ప్యానెల్‌ను అందిస్తుంది. 1Hz నుంచి 165Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. డిస్‌ప్లే 1,800 నిట్స్ గరిష్ట ప్రకాశంతో డాల్బీ విజన్, ప్రో ఎక్స్‌డీఆర్ సపోర్టు ఇస్తుందని పుకారు ఉంది. హుడ్ కింద, ఫ్లాగ్‌షిప్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది.
LPDDR5X ర్యామ్, UFS 4.1 స్టోరేజ్‌తో వస్తుంది. లీక్‌లను పరిశీలిస్తే.. 12GB, 16GB ర్యామ్ ఆప్షన్లతో సహా మల్టీ కాన్ఫిగరేషన్‌లను సూచిస్తున్నాయి. స్టోరేజ్ 1TB వరకు ఉంటుంది. గేమర్‌ల విషయానికి వస్తే.. వన్‌ప్లస్ విండ్ చి గేమ్ కెర్నల్ 2.0ని కలిగి ఉండవచ్చు.
గేమింగ్ పర్ఫార్మెన్స్, ఎక్స్‌టెండెడ్ సెషన్లలో థర్మల్ మేనేజ్‌మెంట్ అందిస్తుంది. బ్యాటరీ లైఫ్ పరంగా పరిశీలిస్తే.. రాబోయే ఫ్లాగ్‌షిప్ భారీ 7300mAh బ్యాటరీ, 120W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి.
కెమెరా ఫ్రంట్ సైడ్ వన్‌ప్లస్ 15 ట్రిపుల్ 50MP సెటప్ కలిగి ఉండవచ్చు. ప్రైమరీ సెన్సార్ OIS, 24mm ఫోకల్ లెంగ్త్‌తో సోనీ LYT-700 అని పుకారు ఉంది. అయితే, అల్ట్రావైడ్ (0.6x), టెలిఫోటో (3.5x) లెన్స్‌లు శాంసంగ్ (ISOCELL JN5) సెన్సార్‌లను కూడా కలిగి ఉంటుందని అంచనా.
వన్‌ప్లస్ 15 డిజైన్, కలర్ ఆప్షన్లు :
లీకైన ఫొటోలను పరిశీలిస్తే.. వన్‌ప్లస్ 15, వన్‌ప్లస్ 13 సిరీస్ కోర్ డిజైన్ కలిగి ఉంటుంది. కొద్దిపాటి అప్‌గ్రేడ్స్ ఉండొచ్చు. కెమెరా మాడ్యూల్ కొత్త లేఅవుట్ ఉన్నట్లు కనిపిస్తోంది. బ్యాక్ ప్యానెల్‌కు మరింత ప్రీమియం లుక్ ఇస్తుంది. ఈ ఫోన్ మొత్తం టైటానియం, బ్లాక్, పర్పల్, లేటెస్ట్ సాండ్ స్టార్మ్ ఎండ్ వంటి 4 కలర్ ఆప్షన్లలో ఉంటుందని భావిస్తున్నారు.
వన్‌ప్లస్ 15 లాంచ్ తేదీ, ధర (అంచనా) :
నివేదికల ప్రకారం.. నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా వన్‌ప్లస్ 15 లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అదే రోజున భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ధరల విషయానికొస్తే.. లీక్‌ల ప్రకారం వన్‌ప్లస్ ఈ ఏడాదిలో ఫోన్ ధరను పెంచవచ్చు, భారత మార్కెట్లో ఈ వన్‌ప్లస్ 15 ధర రూ.65వేల నుంచి రూ.75వేల మధ్య ఉంటుందని అంచనా.