OnePlus Nord 3 5G camera details revealed ahead of July 5 launch
OnePlus Nord 3 5G : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్‌ప్లస్ (OnePlus) కొత్త మిడ్‌రేంజ్ ఫోన్ కెమెరా ఫీచర్లను రివీల్ చేసింది. షెడ్యూల్ ప్రకారం.. జూలై 5, 2023న రాత్రి 7 గంటల సమయంలో గ్లోబల్ లాంచ్ కానుంది. అయితే, ఈ ఫోన్ లాంచ్ కావడానికి ముందు OnePlus Nord 3 5G ఫీచర్లు లీక్ చేసింది.
ఈ 5G ఫోన్ ప్రైమరీ కెమెరా సెన్సార్ సోనీ IMX890, 50MP సెన్సార్.. ఈ ఏడాదిలో ఫ్లాగ్‌షిప్ ఫోన్ (OnePlus 11 5G) సిరీస్‌లోనూ ఉన్నాయి. ఇప్పుడే అదే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ టెక్నాలజీతో నార్డ్ 3 సిరీస్ కూడా వస్తుంది. వన్‌ప్లస్ యాజమాన్య ఫొటోగ్రఫీ అల్గారిథమ్‌లను కూడా కలిగి ఉంటుంది. వన్‌ప్లస్ 11లో కూడా ఇదే ఫీచర్ కనిపిస్తుంది.
‘వన్‌ప్లస్ నార్డ్ 3 5G సరికొత్త మిడ్-రేంజ్ ఫోన్ కావచ్చు. అది మిడ్-రేంజ్ ఫొటోగ్రఫీ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని అర్థం కాదు’ అని వన్‌ప్లస్ COO, ప్రెసిడెంట్ కిండర్ లియు ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ 11 కెమెరా టెక్నాలజీతో వినియోగదారులు తీసే ప్రతి ఫొటో గొప్ప అనుభూతిని పొందవచ్చునని, ఇప్పుడే అదే ఫీచర్ టెక్నాలజీని వన్‌ప్లస్ నార్డ్ 3 5Gతో తీసుకొస్తున్నామని లియు పేర్కొన్నారు.
OnePlus Nord 3 5G camera details revealed ahead of July 5 launch
వన్‌ప్లస్ నార్డ్ 3 5G ఫోన్ డిజైన్‌పై ఫస్ట్ అధికారిక లుక్‌తో వన్‌ప్లస్ కెమెరా రివిలేషన్‌లు హాట్ హాట్‌గా వచ్చాయి, టెంపెస్ట్ గ్రే, మిస్టీ గ్రీన్ రెండు అరెస్టింగ్ కలర్‌వేలను ఆవిష్కరించింది. వన్‌ప్లస్ నార్డ్ 3 5G గురించి మరిన్ని వివరాలు 5 జూలై 2023న వన్‌ప్లస్ నార్డ్ సమ్మర్ లాంచ్ ఈవెంట్‌లో వెల్లడి కానుంది.