OnePlus Nord 3 could launch in India soon as it gets spotted on website
OnePlus Nord 3 Launch in India : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? మరికొన్ని వారాల్లో వన్‌ప్లస్ నుంచి నార్డ్ 3 5G ఫోన్ వస్తోంది. ఈ మోడల్ ఫోన్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో (OnePlus Nord 3 ) కనిపించింది. త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కావొచ్చు. టిప్‌స్టర్ ముకుల్ శర్మ వెబ్‌సైట్ సోర్స్ కోడ్‌లో ఈ ఫోన్ పేరును గుర్తించారు. 5G ఫోన్ స్క్రీన్‌షాట్‌ను ట్విట్టర్‌లో ఆయన షేర్ చేశారు. అతి త్వరలో ఈ ఫోన్ లాంచ్ ఖాయంగా అనిపిస్తోంది.
ఎందుకంటే.. ఈ హ్యాండ్‌సెట్ ఇప్పటికే BIS సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. ఇటీవలే టిప్‌స్టర్ యోగేష్ బ్రార్.. వన్‌ప్లస్ Nord 3 ఫోన్ 6 నుంచి 8 వారాల్లో లాంచ్ అవుతుందని పేర్కొన్నారు. అధికారిక లాంచ్ తేదీని కంపెనీ ఇంకా ధృవీకరించలేదు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు ఇప్పటికే లీక్‌లు అయ్యాయి. లేటెస్ట్ వన్‌ప్లస్ నార్డ్ ఫోన్‌తో రూ. 30వేల కన్నా తక్కువ ధర ఉన్న ఫోన్‌లను లక్ష్యంగా చేసుకోనుంది.
నార్డ్ సిరీస్‌లో హై-ఎండ్ ఫోన్ ఇదే :
వన్‌ప్లస్ నార్డ్ 3 పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను చూడవచ్చు. రాబోయే 5G మిడ్-రేంజ్ ఫోన్ 6.7-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఫుల్ HD+ రిజల్యూషన్‌తో పనిచేసే అవకాశం ఉంది. కంపెనీ అధిక రిఫ్రెష్-రేట్ డిస్‌ప్లేను కూడా అందించాలని భావిస్తున్నారు. నార్డ్ సిరీస్‌లోని హై-ఎండ్ ఫోన్‌గా చెప్పవచ్చు. ఈ ఫోన్ ప్యానెల్ 120Hz వద్ద రిఫ్రెష్ అయ్యే అవకాశం ఉంది.లీక్‌లను పరిశీలిస్తే.. రాబోయే వన్‌ప్లస్ ఫోన్‌లో MediaTek Dimensity 9000 చిప్‌సెట్ అందించనుంది.
OnePlus Nord 3 could launch in India soon as it gets spotted on website
అద్భుతమైన కెమెరా ఫీచర్లు :
వన్‌ప్లస్ కొత్త Nord CE మోడల్స్‌లో స్టీరియో స్పీకర్ లేవు. OnePlus Nord 2 మాదిరిగానే Nord 3 కూడా అదే ఫీచర్లను కలిగి ఉండే అవకాశం ఉంది. ఆప్టిక్స్ పరంగా పరిశీలిస్తే.. ఈ ఫోన్ వెనుక 3 కెమెరాలు ఉండవచ్చు. సెటప్‌లో 50-MP సోనీ IMX766 సెన్సార్, 8-MP సెకండరీ కెమెరా, 2-MP తృతీయ సెన్సార్‌లు ఉండే అవకాశం ఉంది. ఫ్రంట్ కెమెరా ఎలా ఉంటుంది అనేది ప్రస్తుతానికి తెలియదు. వన్‌ప్లస్ ఇండియాలో (OnePlus Nord 3)ని లాంచ్ చేయాలని కంపెనీ భావిస్తోంది.
హుడ్ కింద సాధారణ 4,500mAh బ్యాటరీ ఉండవచ్చు. వన్‌ప్లస్ కొత్తదానిలో 80W లేదా 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ని అందిస్తుందా అనేది ప్రస్తుతానికి తెలియదు. OnePlus 10R స్మార్ట్‌ఫోన్‌తో గరిష్టంగా 150W సపోర్టును అందిస్తోంది. ఛార్జింగ్ స్పీడ్ కూడా వన్‌ప్లస్ 80W అందించవచ్చు. రాబోయే OnePlus Nord 3 భారత మార్కెట్లో రూ. 25వేల నుంచి రూ. 30వేల మధ్య ధర ఉండవచ్చని అంచనా. గత మోడల్ OnePlus Nord 2 5G ఫోన్ భారత మార్కెట్లో రూ. 27,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఆ తరువాత, కంపెనీ OnePlus Nord 2Tని రూ. 28,999కి ధరకు రిలీజ్ చేసింది.