OnePlus Nord 3 Price Drop : వన్‌ప్లస్ నార్డ్ 3 5జీ‌ ఫోన్‌పై ఫ్లాట్ డిస్కౌంట్.. లిమిటెడ్ ఆఫర్.. ఇప్పుడే కొనేసుకోండి!

OnePlus Nord 3 Price Drop : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ 5జీ మోడల్ భారీగా తగ్గింది. ఈ ఫోన్ కొత్త ధర, ఇతర వివరాలను ఓసారి లుక్కేయండి.

OnePlus Nord 3 price drops by Rs 4,000 on Amazon and Flipkart

OnePlus Nord 3 Price Drop : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ నార్డ్ 3 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తున్నాయి. ఈ రెండింటిలోనూ వన్‌ప్లస్ ఫోన్ తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. ఈ మిడ్-రేంజ్ 5G డివైజ్‌పై రూ. 4వేలు ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందిస్తుంది. ఇది చాలా గొప్ప విషయం.. ఎందుకంటే మీరు వన్‌ప్లస్ ఫోన్‌లో ఇంత పెద్ద డిస్కౌంట్‌లను చూడలేరు. వన్‌ప్లస్ నార్డ్ 3 ఇప్పుడు రెండు ఇ-కామర్స్ సైట్‌లలో రూ. 30వేల ధరల విభాగంలో అందుబాటులో ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి.

Read Also : Flipkart Winter Sale : ఫ్లిప్‌కార్ట్ వింటర్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 13పై రూ.39,500 తగ్గింపు.. కేవలం రూ. 19,400 మాత్రమే..!

భారత్‌లో వన్‌ప్లస్ నార్డ్ 3 ధర రూ. 4వేలు తగ్గింపు :
వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో రూ. 29,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అసలు ప్రారంభ ధర రూ. 33,999 నుంచి తగ్గింది. అంటే.. ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో వన్‌ప్లస్ నార్డ్ 3పై రూ. 4వేలు ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తున్నాయి. ఈ డీల్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్‌‌పై పరిమిత సమయం వరకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతానికి, ఈ వన్‌ప్లస్ ఫోన్ డిస్కౌంట్ ఆఫర్ గడువు ఎప్పుడు ముగుస్తుందనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. కొనుగోలుకు ఆసక్తి ఉన్న వినియోగదారులు ఇప్పుడే కొనేసుకోండి.

OnePlus Nord 3 price drop

వన్‌ప్లస్ నార్డ్ 3 కొనుగోలు చేయాలా? :
వన్‌ప్లస్ నార్డ్ 3 5జీ మోడల్ మిడ్-రేంజ్ ఫోన్. ప్రస్తుతం ఆకర్షణీయమైన ధరలో అందుబాటులో ఉంది. మంచి వైబ్రెంట్ డిస్‌ప్లేతో ఫ్యాన్సీగా కనిపిస్తుంది. మీరు ఫ్లాట్ 6.7-అంగుళాల 120హెచ్‌జెడ్ అమోల్డ్ స్క్రీన్‌ను పొందవచ్చు. ఫొటోలు, వీడియోలను క్యాప్చర్ చేయొచ్చు. ప్యానెల్ కూడా చాలా మృదువైనది. వార్నింగ్ స్లయిడర్ సౌజన్యంతో వివిధ నోటిఫికేషన్ మోడ్‌ల మధ్య సులభంగా మారవచ్చు.

ఈ ఫోన్ బేస్ మోడల్‌లో 8జీబీ ర్యామ్ అందిస్తుంది. మీరు స్లో కాకుండా ఒకేసారి అన్ని పనులు చేయవచ్చు. ఈ ఫోన్‌లోని (OxygenOS 13) సాఫ్ట్‌వేర్ సాఫీగా పనిచేస్తుంది. చాలా సులభంగా వినియోగించవచ్చు. యూఐ అయోమయ రహితంగా ఉంటుంది. హుడ్ కింద సాధారణ 5,000ఎంఎహెచ్ బ్యాటరీని పొందవచ్చు. కంపెనీ ఫోన్‌తో పాటు 80డబ్ల్యూ ఛార్జర్‌ను అందిస్తుంది. ఏ సమయంలోనైనా బ్యాటరీని త్వరగా టాప్ అప్ చేయగలదు. మొత్తంమీద, మీరు రూ. 30వేల లోపు మిడ్-రేంజ్ ఫోన్ కోసం చూస్తుంటే.. వన్‌ప్లస్ నార్డ్ 3 బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Read Also : PUC certificate Verification : మీ కారు లేదా బైక్ పీయూసీ సర్టిఫికేట్‌కు ఇకపై వీడియో వెరిఫికేషన్ తప్పనిసరి.. ఎందుకంటే?