PUC certificate Verification : మీ కారు లేదా బైక్ పీయూసీ సర్టిఫికేట్‌కు ఇకపై వీడియో వెరిఫికేషన్ తప్పనిసరి.. ఎందుకంటే?

PUC certificate Verification : మీ వాహనానికి పీయూసీ సర్టిఫికేట్ పొందారా? ఇకపై పొల్యుషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ జారీ చేయాలంటే వీడియో వెరిఫికేషన్ తప్పనిసరి. ఎందుకంటే.. పూర్తి వివరాలు మీకోసం..

PUC certificate Verification : మీ కారు లేదా బైక్ పీయూసీ సర్టిఫికేట్‌కు ఇకపై వీడియో వెరిఫికేషన్ తప్పనిసరి.. ఎందుకంటే?

Video verification now mandatory to get car or bike PUC certificate

Updated On : December 28, 2023 / 10:00 PM IST

PUC certificate Verification : మీ వాహనానికి పీయూసీ సర్టిఫికేట్ ఉందా? కారు లేదా బైక్ ఏదైనా కావొచ్చు. ప్రతి వాహనానికి పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికేట్ ఉండాల్సిందే. అయితే, ప్రస్తుత రోజుల్లో పీయూసీ సర్టిఫికేట్ అందించే విషయంలో అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం పీయూసీ సర్టిఫికేట్ జారీపై కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై బైకు లేదా కారు వంటి వాహనాలకు పీయూసీ సర్టిఫికేట్ జారీ చేయాలంటే వీడియో రికార్డింగ్ వెరిఫికేషన్ విధానాన్ని తప్పనిసరి చేసింది. కఠినమైన వాహన ఉద్గార నియంత్రణను నిర్ధారించడానికి మోసపూరిత పద్ధతులను అరికట్టడానికి ప్రభుత్వం ఈ పీయూసీ టెస్ట్ వీడియో రికార్డింగ్‌ చేయాలని సూచించింది.

ముందుగా ఢిల్లీలో కొత్త మార్గదర్శకాలు అమల్లోకి :
ఇలా రికార్డ్ చేసిన వీడియోలు పీయూసీ సర్టిఫికేట్‌లను జారీ చేసే ముందు కచ్చితత్వానికి హామీ ఇస్తూ వాహన్ (VAHAN) పోర్టల్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. వాహనాలను పరీక్షించకుండానే పీయూసీ కేంద్రాలు సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Read Also : Flipkart Winter Sale : ఫ్లిప్‌కార్ట్ వింటర్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 13పై రూ.39,500 తగ్గింపు.. కేవలం రూ. 19,400 మాత్రమే..!

వాహన్ పోర్టల్ దేశవ్యాప్త పీయూసీ సెంటర్లను రికార్డింగ్ టెస్టు వీడియోలను అప్‌లోడ్ చేసేందుకు అనుమతిస్తుంది. దేశంలో అత్యంత కాలుష్యం ప్రభావిత రాష్ట్రాలలో ఒకటైన దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈ కొత్త మార్గదర్శకాలను అక్కడి ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. ఇతర రాష్ట్రాలు త్వరలో ఆదేశాన్ని అనుసరించే అవకాశం ఉంది.

Video verification now mandatory to get car or bike PUC certificate

Video verification PUC certificate

అన్ని వాహనాలకు పీయూసీ వీడియో టెస్టింగ్ :
కఠినమైన వాహన ఉద్గార నియంత్రణను నిర్ధారించే ప్రయత్నంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వాహనాలకు కాలుష్య నియంత్రణ (PUC) టెస్టింగ్ ప్రక్రియ వీడియోను రికార్డ్ చేయడం ఇప్పుడు తప్పనిసరి. ఈ పీయూసీ సర్టిఫికేట్ జారీ చేయడానికి ముందు రికార్డ్ చేసిన వీడియోలు ప్రభుత్వ వాహన్ పోర్టల్‌లో అప్‌లోడ్ అవుతాయి. ఈ కొత్త నియంత్రణ మోసపూరిత పద్ధతులను అరికట్టడంతో పాటు పీయూసీ సర్టిఫికెట్ల కచ్చితత్వానికి హామీ ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది.

వాహన్ పోర్టల్‌లో వీడియోలు అప్‌లోడ్ :
కొన్ని పీయూసీ కేంద్రాలు వాహనాలను పరీక్షించకుండానే ఎమిషన్‌ అండర్‌ కంట్రోల్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తున్నాయని పలు ఫిర్యాదులు అందడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) ద్వారా ఇ-సేవలకు జాతీయ రిజిస్టర్‌గా పనిచేస్తున్న వాహన్ పోర్టల్ వీడియో అప్‌లోడింగ్ ఫీచర్‌లను కలిగి ఉంది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) దేశవ్యాప్తంగా పీయూసీ సెంటర్‌లకు యాక్సెస్‌ను మంజూరు చేస్తూ అవసరమైన మార్పులకు నాయకత్వం వహించింది.

ఈ సవరణతో పీయూసీ సెంటర్లు వాహన్ పోర్టల్‌లో వీడియోలను సజావుగా అప్‌లోడ్ చేసేందుకు అనుమతిస్తుంది. భారత్‌లో ప్రతి వాహనం మోటారు వాహనాల చట్టం నిబంధనలకు కట్టుబడి ఉండేందుకు పీయూసీ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాలి. వాహన కాలుష్య ధృవీకరణ పత్రంలో వివరించిన పరీక్ష ఫలితాలతో వాహనం ఎగ్జాస్ట్ గ్యాస్‌ను సమగ్రంగా పరిశీలించిన తర్వాత ఉద్గార పరీక్ష సర్టిఫికేట్ జారీ చేయడం జరుగుతుంది.

Read Also : Tesla First Factory in India : ఎలన్ మస్క్ టెస్లా నుంచి ఫస్ట్ ఫ్యాక్టరీ భారత్‌కు వస్తోంది.. వచ్చే ఏడాదిలో ఎంట్రీకి రంగం సిద్ధం?