OnePlus Open First Sale : మడతబెట్టే ఫోన్ కావాలా?.. ఈ నెల 27నే కొత్త వన్‌ప్లస్ ఓపెన్ ఫస్ట్ సేల్.. ఫీచర్లు, ధర ఎంతంటే?

OnePlus Open First Sale : వన్‌ప్లస్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్, (OnePlus Open) భారత మార్కెట్లో లాంచ్ చేసింది. Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్, మూడు Hasselblad-బ్రాండెడ్ బ్యాక్ కెమెరాలు, 4,800mAh బ్యాటరీతో సహా టాప్-టైర్ స్పెసిఫికేషన్‌లు ఉన్నాయి.

OnePlus Open first sale in India on October 27

OnePlus Open First Sale : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) నుంచి కొత్త ఫోల్డబుల్ ఫోన్ అక్టోబర్ 27న భారత మార్కెట్లో ఫస్ట్ సేల్‌ను ప్రారంభించనుంది. కంపెనీ మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ (One Plus Foldable Phone) , అక్టోబర్ 19న భారత్, ప్రపంచవ్యాప్త మార్కెట్‌లలో లాంచ్ అయింది. Qualcomm టాప్-టైర్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌ను కలిగి ఉంది. 7.82-అంగుళాల AMOLED ఇంటర్నల్ డిస్‌ప్లేతో పాటు 6.31-అంగుళాల ఔటర్ స్క్రీన్‌ను అందిస్తుంది.

స్విఫ్ట్ 120Hz రిఫ్రెష్ రేట్, ఈ ఫోన్‌లో సోనీ అత్యాధునిక LYTIA-T808 ‘Pixel Stacked’ CMOS సెన్సార్‌తో సహా 3 Hasselblad-బ్రాండెడ్ బ్యాక్ కెమెరాలు ఉన్నాయి. 2 సెల్ఫీ కెమెరాలు, బలమైన 4,800mAh బ్యాటరీ, వేగవంతమైన 67W ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ మడతబెట్టే ఫోన్ ధర, స్పెసిఫికేషన్‌లు, మరిన్నింటిని ఓసారి లుక్కేయండి..

వన్‌ప్లస్ ఓపెన్ ఫస్ట్ సేల్ : ధర ఎంతంటే? :

భారత మార్కెట్లో వన్‌ప్లస్ ఓపెన్ ధర 16GB + 512GB కాన్ఫిగరేషన్ ధర రూ. 1,39,999కు అందిస్తోంది. ఎమరాల్డ్ డస్క్, వాయేజర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందిస్తుంది. OnePlus అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, రిటైల్ స్టోర్‌లలో లభిస్తుంది. ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్‌లు అక్టోబర్ 26 నుంచి ప్రారంభమవుతాయి. ఓపెన్ సేల్స్ అక్టోబర్ 27న ప్రారంభం కానున్నాయి. కస్టమర్‌లు ఎంపిక చేసిన డివైజ్‌లపై రూ. 8వేలు ట్రేడ్-ఇన్ బోనస్, అదనంగా ICICI బ్యాంక్, OneCard ఇన్‌స్టంట్ బ్యాంక్‌తో రూ. 5వేల తగ్గింపు పొందవచ్చు.

Read Also : OnePlus 11 5G Low Price : అమెజాన్‌లో వన్‌ప్లస్ 11 5G ఫోన్‌పై భారీ తగ్గింపు.. మరెన్నో బ్యాంకు ఆఫర్లు.. ఇప్పుడే కొనేసుకోండి!

వన్‌ప్లస్ ఓపెన్ స్పెసిఫికేషన్‌లు :
వన్‌ప్లస్ ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్‌ను ప్రవేశపెట్టింది. ఈ డివైజ్ 153.4 మిమీ ఎత్తులో ఉంది. ఓపెన్ చేస్తే.. 143.1 మిమీ వెడల్పు, ఫోల్డ్ చేస్తే 73.3 మిమీకి తగ్గుతుంది. మందం విషయానికి వస్తే.. కలర్ ఆప్షన్‌పై ఆధారపడి ఉంటుంది. ఫోల్డబుల్ ఎమరాల్డ్ డస్క్ వేరియంట్ 5.8 మిమీ మందం, వాయేజర్ బ్లాక్ వేరియంట్ 5.9 మిమీ మందం ఉంటుంది. మడతపెట్టినప్పుడు.. ఎమరాల్డ్ డస్క్ వెర్షన్ 11.7 మి.మీ మందంగా మారుతుంది. వాయేజర్ బ్లాక్ 11.9 మి.మీ వద్ద కొంచెం మందంగా ఉంటుంది. బరువు పరంగా, వాయేజర్ బ్లాక్ సుమారు 239 గ్రాములు బరువు ఉంటుంది. అయితే, ఎమరాల్డ్ డస్క్ 245 గ్రాముల వద్ద వస్తుంది. Flexion Hinge టెక్నాలజీ ఫోన్‌ను తేలికగా, కాంపాక్ట్‌గా, మన్నికగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

OnePlus Open first sale in India

వన్‌ప్లస్ ఓపెన్ కెమెరా ఫీచర్లు :

ఈ డివైజ్ విశేషమైన 7.82-అంగుళాల ఫ్లెక్సీ-ఫ్లూయిడ్ AMOLED ప్రధాన డిస్‌ప్లేను 2800 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశంతో ప్రదర్శిస్తుంది. కవర్ డిస్‌ప్లే, 6.31 అంగుళాలు, 2K రిజల్యూషన్, 431ppiని కలిగి ఉంది. సున్నితమైన యూజర్ ఎక్స్‌పీరియన్స్ కోసం 2 స్క్రీన్‌లు స్విఫ్ట్ 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తాయి. ఫొటోగ్రఫీ ప్రియుల కోసం వన్‌ప్లస్ ఓపెన్‌లో సోనీ LYT-T808 ‘Pixel Stacked’ CMOS సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన ప్రాథమిక 48MP కెమెరా ఉంది. 64MP టెలిఫోటో కెమెరా, 48MP అల్ట్రా-వైడ్ కెమెరాతో వస్తుంది. కెమెరా 60FPS వద్ద 4K క్వాలిటీ వీడియోలను రికార్డ్ చేయగలదు. ఫ్రంట్ కెమెరా సెటప్‌లో 20MP ప్రైమరీ కెమెరా, 32MP సెకండరీ కెమెరా ఉన్నాయి.

42 నిమిషాల్లో 100శాతం ఛార్జింగ్ :
Android 13 ఆధారంగా సరికొత్త OxygenOS 13.2తో రన్ అవుతున్న OnePlus Open పవర్‌పుల్ Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది. నాలుగు ఏళ్ల ప్రధాన ఆండ్రాయిడ్ వెర్షన్ అప్‌డేట్‌లను, 5 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందవచ్చు. సాఫ్ట్‌వేర్ సపోర్టులో అందిస్తుంది. బ్యాటరీ సెక్షన్‌లో 4,805mAh బ్యాటరీని అందిస్తుంది. వేగవంతమైన 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. బ్యాటరీ సుమారు 42 నిమిషాల్లో 1శాతం నుంచి 100శాతం వరకు ఛార్జ్ చేయగలదని వన్‌ప్లస్ పేర్కొంది. ఒక్క ఛార్జ్‌పై ఒక రోజు విలువైన వినియోగాన్ని అందిస్తుంది. ముఖ్యంగా, రిటైల్ ప్యాకేజీలో ఛార్జర్ వస్తుంది.

Read Also : OnePlus Open Launch : వన్‌ప్లస్ నుంచి ఫస్ట్ ఫోల్డబుల్ ఫోన్.. ఈ మడతబెట్టే ఫోన్ ధర ఎంత ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు