OnePlus Reveals Android 15 Update Schedule
OnePlus Android 15 Update : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ వన్‌ప్లస్ తమ యూజర్ల కోసం కొత్త ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త వెర్షన్ వచ్చే నెల ప్రారంభంలో అందుబాటులోకి రానుంది. కొత్త (OxygenOS) వెర్షన్ కంపెనీ నుంచి ఏఐ ఫీచర్లను అందిస్తోంది. కొత్త యూఐ ఎక్స్‌పీరియన్స్ వేగంగా సున్నితంగా ఉండనుంది.
వన్‌ప్లస్ ఆండ్రాయిడ్ 15 జర్నీని బీటా వెర్షన్‌తో ప్రారంభిస్తోంది. రాబోయే కొద్ది నెలల్లో దాదాపు 16 ఫోన్లకు రానుంది. వన్‌ప్లస్ 12 అక్టోబర్ 30 నుంచి ఆండ్రాయిడ్ 15 బీటా వెర్షన్‌ను పొందే మొదటి ఫోన్ అని చెప్పవచ్చు. కేవలం కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఆ తర్వాత, వన్‌ప్లస్ బ్రాండ్ నవంబర్‌లో వన్‌ప్లస్ ఓపెన్, వన్‌ప్లస్ ప్యాడ్ 2 టాబ్లెట్ యూజర్ల కోసం ఆక్సిజన్OS 15 వెర్షన్‌ను రిలీజ్ చేస్తుంది.
డిసెంబర్ నుంచి వన్‌ప్లస్ కంపెనీ వన్‌ప్లస్11 5జీ, వన్‌ప్లస్ 11ఆర్, వన్‌ప్లస్ నార్డ్ 4, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్, వన్‌ప్లస్ ప్యాడ్‌తో సహా అనేక రకాల డివైజ్‌ల కోసం బీటా వెర్షన్‌ను అందిస్తుంది. 2025కి వెళితే.. వన్‌ప్లస్10 ప్రో, వన్‌ప్లస్ 10టీ, వన్‌ప్లస్ నార్డ్ 3కి వచ్చే ఆండ్రాయిడ్ 15 బీటా వెర్షన్ జనవరిలో ప్రారంభం కానుంది. చివరకు, ఫిబ్రవరి 2025లో వన్‌ప్లస్ 10ఆర్, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 కొత్త బీటా వెర్షన్‌కి మారనున్నాయి.
వచ్చే ఏడాది పబ్లిక్ వెర్షన్‌ను రిలీజ్ చేయనుంది. అంతకంటే ముందు అన్ని బగ్‌లు, సమస్యలు ఫిక్స్ చేసినట్టుగా కన్ఫార్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం వన్‌ప్లస్ బీటా ప్రోగ్రామ్‌లను ప్రారంభిస్తుంది. ఆండ్రాయిడ్ మార్కెట్‌ల కోసం ఈ టైమ్‌లైన్‌లు మారవచ్చు. రిలీజ్ తేదీలలో కూడా మార్పు ఉండవచ్చు అని వన్‌ప్లస్ పేర్కొంది. నేటికి, గూగుల్ పిక్సెల్ ఫోన్లు మాత్రమే స్టేబుల్ఆండ్రాయిడ్15 వెర్షన్‌కి అప్‌గ్రేడ్ అయ్యాయి. శాంసంగ్ ఇంకా అధికారికంగా టైమ్‌లైన్‌లను రివీల్ చేయలేదు. వివో కొత్త ఫోన్‌లను ఆండ్రాయిడ్ 15తో ప్రకటించింది. షావోమీ కూడా త్వరలో దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది.
Read Also : Triumph Tiger 1200 : కొంటే ఇలాంటి బైక్ కొనాలి భయ్యా.. ట్రయంఫ్ టైగర్ 1200 బైక్ వచ్చేసింది.. ధర ఎంతంటే?