OnePlus to launch another 5G phone with MediaTek Dimensity 9000 SoC_ Here is everything we know
OnePlus 5G Phone : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ (OnePlus) నుంచి సరికొత్త 5G ఫోన్ రాబోతోంది. గ్లోబల్ మార్కెట్లలో వన్‌ప్లస్ ఇటీవలే రెండు ప్రీమియం ఫోన్‌లను ప్రకటించింది. రాబోయే నెలల్లో మరో 5G స్మార్ట్‌ఫోన్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది. చైనీస్ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం.. (OnePlus) ఇటీవల ప్రకటించిన Ace 2 డివైజ్ డైమెన్సిటీ ఎడిషన్‌ను భారత మార్కెట్లోనూ లాంచ్ చేయాలని యోచిస్తున్నట్లు సూచిస్తోంది. OnePlus 11R మాదిరిగానే కొత్త వెర్షన్‌లోనూ చిన్నపాటి తేడాలు ఉంటాయని సమాచారం. OnePlus Ace 2 డైమెన్సిటీ ఎడిషన్ చైనాలో అందుబాటులోకి రానుంది. భారతీయ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది అనేది రివీల్ చేయలేదు. ఈ కొత్త వెర్షన్ కంపెనీ MediaTek డైమెన్సిటీ 9000 SoCని ఉపయోగిస్తుంది.
బేస్ 12GB + 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌తో CNY 2,799 (సుమారు రూ. 34,100)కి సేల్ అందించే రియల్ Ace 2 5G ఫోన్ కన్నా ఈ హ్యాండ్‌సెట్ ధర చాలా తక్కువ ఉండే అవకాశం ఉంది. OnePlus Ace 2 డైమెన్సిటీ ఎడిషన్ ఒరిజినల్ మోడల్ మాదిరిగానే స్పెసిఫికేషన్‌లను ఉండనున్నాయి. అయితే కొద్దిగా కెమెరా, చిప్‌సెట్‌లో మాత్రమే తేడా ఉండవచ్చు. ఈ డివైజ్ 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఫ్లాట్ డిస్‌ప్లేతో వస్తుందని చెప్పవచ్చు. 2772 × 1240 పిక్సెల్‌లతో రానుంది. అలాగే, స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు అందించనుంది.
OnePlus to launch another 5G phone with MediaTek Dimensity 9000 SoC
ఒరిజినల్ వెర్షన్‌లో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. 100W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్ సపోర్టు కూడా అందిస్తుంది. ఆప్టిక్స్ పరంగా చూస్తే.. కొత్త OnePlus ఫోన్ మరో ప్రైమరీ కెమెరాతో రానుంది. 64-MP OmniVision OV64M సెన్సార్ కావచ్చు. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 8-MP సోనీ IMX355 అల్ట్రా-వైడ్ కెమెరా సెన్సార్, 2-MP గెలాక్సీకోర్ GC02M మాక్రో కెమెరా కూడా ఉండవచ్చు. OnePlus Ace 2 5G స్మార్ట్‌ఫోన్ హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoCని కలిగి ఉంది. డైమెన్సిటీ చిప్‌తో మెరుగైన పర్ఫార్మెన్స్ పొందవచ్చని తెలుస్తోంది. వాస్తవ ప్రపంచంలో ఫలితాలు భిన్నంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.
Ace 2లోని ట్రిపుల్ కెమెరా సెటప్, OnePlus 11 మాదిరిగానే 50-MP Sony IMX890 OIS ప్రధాన కెమెరాతో రానుంది. ముందు భాగంలో 16-MP కెమెరా కూడా ఉంది. కొత్త వన్‌ప్లస్ Ace 2 డైమెన్సిటీ ఎడిషన్ ఎప్పుడు లాంచ్ అవుతుందో చూడాలి. ఇప్పటివరకు, బ్రాండ్ 2023లో మాత్రమే ప్రీమియం ఫోన్‌లను లాంచ్ చేస్తూ వచ్చింది. ఈ ఏడాది తర్వాత ఎప్పుడైనా కొత్త మిడ్-రేంజ్ ఫోన్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే అనేక కంపెనీలు ఇప్పటికే రూ. 30వేల సెగ్మెంట్‌లో కొత్త5G ఫోన్‌లను రిలీజ్ చేస్తున్నాయి.