OneUI 7 Update : శాంసంగ్ లవర్స్‌కు అలర్ట్.. ఈ ఫోన్లలోనే One UI 7 కొత్త అప్‌డేట్ వస్తోంది.. మీరు వాడే ఫోన్ ఉందా? ఇప్పుడే చెక్ చేసుకోండి!

OneUI 7 Update : శాంసంగ్ ఫోన్ యూజర్ల కోసం సరికొత్త వన్ యూఐ 7 అప్‌డేట్ రిలీజ్ చేయనుంది. ఈ వారంలో ఎప్పుడైనా ఈ సెక్యూరిటీ అప్‌డేట్ రావచ్చు.. ఏయే శాంసంగ్ ఫోన్లలో రానుందో ఓసారి లుక్కేయండి.

OneUI 7 Update

OneUI 7 Update : శాంసంగ్ యూజర్లకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా గెలాక్సీ ఫోన్లలో ఆండ్రాయిడ్ 15 ఆధారిత లేటెస్ట్ వన్ UI 7 అప్‌డేట్‌ను కంపెనీ రిలీజ్ చేయనుంది. ఏప్రిల్ 28 నుంచి మే 4 మధ్య శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్, గెలాక్సీ S24 FE, గెలాక్సీ Z ఫ్లిప్ 5, గెలాక్సీ Z ఫోల్డ్ 5, గెలాక్సీ ట్యాబ్ S9 సిరీస్‌లతో సహా అనేక పాపులర్ మోడళ్లకు వన్ UI 7 అప్‌డేట్‌ను రిలీజ్ చేసే అవకాశం ఉంది.

Read Also : Amazon Summer Sale : మే 1 నుంచే అమెజాన్ సమ్మర్ సేల్.. ఐఫోన్ 15, వన్‌ప్లస్ 13Rపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్లు.. డోంట్ మిస్!

శాంసంగ్ ఫ్యాన్స్ ప్రకారం.. అమెరికాలో కొంతమంది వినియోగదారులు ఇప్పటికే అప్‌డేట్‌ను అందుకున్నారు. వన్ యూఐ 7 లేటెస్ట్ డిజైన్, అప్‌గ్రేడ్ విడ్జెట్‌లు, లాక్ స్క్రీన్‌పై లైవ్ అప్‌డేట్స్ “Now Bar” అనే కొత్త ఫీచర్‌తో వస్తుంది.

వన్ యూఐ 7 అప్‌డేట్ ద్వారా రైటింగ్ అసిస్ట్, డ్రాయింగ్ అసిస్ట్ వంటి గెలాక్సీ ఏఐ టూల్స్ కూడా అందిస్తోంది. అంతేకాదు.. మీ శాంసంగ్ ఫోన్ సేఫ్టీ కోసం లేటెస్ట్ ఏప్రిల్ 2025 సెక్యూరిటీ ప్యాచ్‌లు అప్‌డేట్‌లో ఉన్నాయి.

మీ ఫోన్ అప్‌డేట్ అయిందో లేదో చెక్ చేయాలంటే.. Settings > Software Update > Install Download ఆప్షన్ ఎంచుకోండి. అప్‌డేట్ చేసే ముందు మీ ఫోన్ లేదా టాబ్లెట్ Wi-Fiకి కనెక్ట్ చేసి ఉండాలి. తగినంత బ్యాటరీ ఛార్జ్ కూడా ఉండాలి.

కొత్త అప్‌డేట్ దాదాపు 5GB ఉంటుంది. ఇంతలో, గెలాక్సీ S24 సిరీస్, గెలాక్సీ Z Flip6, గెలాక్సీ Z Fold6, గెలాక్సీ Tab S10 సిరీస్ వంటి కొత్త ఫోన్లు ఈ నెల ప్రారంభంలోనే వన్ యూఐ 7ని అప్‌డేట్ అందుకున్నాయి.

Read Also : PF Claims Rule : ఈపీఎఫ్ క్లెయిమ్ చేస్తున్నారా? ఈ రూల్స్ తప్పక తెలుసుకోండి.. ఏ అవసరానికి ఎంత తీసుకోవచ్చుంటే? ఫుల్ డిటెయిల్స్

ఏప్రిల్ ప్రారంభంలో కొంతమంది గెలాక్సీ S24 యూజర్లు అప్‌డేట్ తర్వాత లాక్ స్క్రీన్ గ్లిచ్‌ సమస్యను శాంసంగ్ ఎదుర్కొంది. కంపెనీ త్వరగా ఆ సమస్యను పరిష్కరించింది. ఫ్లాగ్‌షిప్ ప్రీమియం ఫోన్లలో వన్ యూఐ 7 రిలీజ్ చేయడం కొనసాగించింది. శాంసంగ్ మిడ్-రేంజ్ గెలాక్సీ A-సిరీస్ ఫోన్‌లను ఉపయోగించే వారికి వన్ యూఐ 7 అప్‌డేట్ జూన్‌లో వచ్చే అవకాశం ఉంది.