Oppo A3x 5G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? ఒప్పో A3x 5జీ ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?
Oppo A3x 5G Launch : భారత మార్కెట్లో ఒప్పో ఎ3ఎక్స్ 4జీ ఫోన్ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్‌తో బేస్ మోడల్ ధర రూ. 8,999, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 9,999కి అందుబాటులో ఉంది.

Oppo A3x 5G With Snapdragon
Oppo A3x 5G Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లోకి ఒప్పో ఎ3ఎక్స్ 4జీ ఫోన్ వచ్చేసింది. కంపెనీ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జనరేషన్ 1 చిప్‌సెట్‌తో వస్తుంది. 4జీబీ ర్యామ్‌తో ఆండ్రాయిడ్ 14-ఆధారిత కలర్ఓఎస్ 14పై రన్ అవుతుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,100mAh బ్యాటరీని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఒప్పో ఎ3ఎక్స్ 4జీ ఫోన్ 8ఎంపీ బ్యాక్ కెమెరాతో పాటు 5ఎంపీ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది.
భారత్‌లో ఒప్పో ఎ3ఎక్స్ 4జీ ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో ఒప్పో ఎ3ఎక్స్ 4జీ ఫోన్ 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్‌తో బేస్ మోడల్ ధర రూ. 8,999, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 9,999కి అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ అక్టోబర్ 29 నుంచి ఒప్పో ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ ఛానెల్‌ల ద్వారా నెబ్యులా రెడ్, ఓషన్ బ్లూ కలర్‌వేస్‌లో విక్రయిస్తోంది.
ఒప్పో ఎ3ఎక్స్ 4జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
డ్యూయల్ సిమ్ (నానో+నానో) ఒప్పో ఎ3ఎక్స్ 4జీ కలర్ఓఎస్ 14పై రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 14పై ఆధారపడి ఉంటుంది. 6.67-అంగుళాల హెచ్‌డీ+ (720×1,604 పిక్సెల్‌లు) ఎల్‌సీడీ స్క్రీన్‌ను 90Hz రిఫ్రెష్ రేట్‌తో గరిష్టంగా 100నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ క్వాల్‌కామ్ నుంచి ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జనరేషన్ 1 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది. 4జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్‌తో వస్తుంది. ఫొటోలు, వీడియోలకు స్మార్ట్‌ఫోన్‌లో 8ఎంపీ బ్యాక్ కెమెరా 78-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూ, ఎఫ్/2.0 ఎపర్చరుతో వస్తుంది. ఫ్రంట్ సైడ్ 78-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ, ఎఫ్/2.2 ఎపర్చర్‌తో వాటర్‌డ్రాప్-స్టైల్ డిస్‌ప్లే కటౌట్‌లో ఉన్న 5ఎంపీ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
మీరు ఒప్పో ఎ3ఎక్స్ 4జీలో 128జీబీ వరకు ఇఎమ్ఎమ్‌సీ 5.1 స్టోరేజీని పొందవచ్చు. మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ఉపయోగించి విస్తరించవచ్చు. యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ పోర్ట్‌తో పాటు 4జీ ఎల్‌టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్ కనెక్టివిటీని అందిస్తుంది. ఒప్పో ఈ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్‌తో ఫోన్‌ను అమర్చింది. బయోమెట్రిక్ అథెంటికేషన్ కోసం ఫింగర్ ఫ్రింట్ స్కానర్ ఉంది. 45డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,100mAh బ్యాటరీని అందిస్తుంది. 165.77×76.08×7.68ఎమ్ఎమ్ పరిమాణం, 186గ్రాముల బరువు ఉంటుంది.
Read Also : Apple iPhone 13 Sale : ఆపిల్ ఐఫోన్ 13పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఈ పాత మోడల్ కొనాలా వద్దా?