Oppo F27 Pro Plus 5G : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో ఒప్పో F27 ప్రో ప్లస్ 5జీ.. ఫీచర్ల కోసమైన ఈ ఫోన్ కొనేసుకోవచ్చు!

Oppo F27 Pro Plus 5G : భారత మార్కెట్లో ఒప్పో ఎఫ్27ప్రో ప్లస్ 5జీ 8జీబీ+ 128జీబీ ఆప్షన్ ప్రారంభ ధర రూ. 27,999, అయితే 8జీబీ + 256జీబీ వేరియంట్ ధర రూ. 29,999 ఉంటుంది.

Oppo F27 Pro Plus 5G Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి భారత మార్కెట్లోకి సరికొత్త F27ప్రో ప్లస్ 5జీ ఫోన్ వచ్చేసింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. 67డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.

Read Also : Flipkart Mega Bonanza Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో అదిరే డీల్స్.. ఈ స్మార్ట్‌ఫోన్లను తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు!

ఈ హ్యాండ్‌సెట్‌లో 64ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ అమర్చారు. దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ69, ఐపీ68, ఐపీ66 వెరిఫికేషన్లతో కూడా వస్తుంది. దేశంలో రెండు స్టోరేజ్ ఆప్షన్లలో ఫోన్ అందుబాటులో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో చైనాలో ఆవిష్కరించిన ఒప్పో A3 ప్రో రీబ్యాడ్జ్డ్ వెర్షన్‌గా చెప్పవచ్చు.

భారత్‌లో ఒప్పో F27ప్రో ప్లస్ 5జీ ధర, లభ్యత :
భారత మార్కెట్లో ఒప్పో ఎఫ్27ప్రో ప్లస్ 5జీ 8జీబీ+ 128జీబీ ఆప్షన్ ప్రారంభ ధర రూ. 27,999, అయితే 8జీబీ + 256జీబీ వేరియంట్ ధర రూ. 29,999 ఉంటుంది. ఈ రోజు నుంచి ఒప్పో ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా దేశంలో ముందస్తు ఆర్డర్‌ చేయొచ్చు. అధికారిక విక్రయాలు జూన్ 20 నుంచి ప్రారంభమవుతాయి. ఈ హ్యాండ్‌సెట్ డస్క్ పింక్, మిడ్‌నైట్ నేవీ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

ఒప్పో ఎఫ్27ప్రో ప్లస్ 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఒప్పో F27ప్రో ప్లస్ 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (2,412 x 1,080 పిక్సెల్‌లు) 3డీ కర్వ్డ్ ఓఎల్ఈడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. 240Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్, 950నిట్‌ల వరకు లోకల్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ జిలాస్ 2 ప్రొటెక్షన్ కలిగి ఉంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్ఓసీ ద్వారా ఆధారితమైనది. ఏఆర్ఎమ్ మాలి-జీ68 ఎంసీ4 జీపీయూ, 8జీబీ ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. ఒప్పో ఎఫ్27ప్రో ప్లస్ 5జీ ఆండ్రాయిడ్ 14-ఆధారిత కలర్ఓఎస్ 14.0తో వస్తుంది.

ఒప్పో ఎఫ్27ప్రో ప్లస్ 5జీ ఫోన్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే.. ఎమ్ఐఎల్-ఎస్‌టీడీ 810హెచ్ బిల్డ్‌తో వస్తుంది. స్విస్ ఎస్‌జీఎస్ ప్రీమియం పెర్ఫార్మెన్స్ 5 స్టార్స్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. డెస్ట్, నీటి నిరోధకతకు ఐపీ69, ఐపీ68, ఐపీ66 రేటింగ్‌లను కూడా కలిగి ఉంది.

ఆప్టిక్స్ విషయానికి వస్తే.. ఒప్పో ఎఫ్27ప్రో ప్లస్ 5జీ ఫోన్ 64ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ సెకండరీ సెన్సార్‌ను కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్రంట్ కెమెరా 8ఎంపీ సెన్సార్‌ను కలిగి ఉంది. ఒప్పో ఎఫ్27ప్రో ప్లస్ 5జీ 5,000mAh బ్యాటరీతో 67డబ్ల్యూ వైర్డు సూపర్ వూక్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది.

భద్రత విషయానికి వస్తే.. ఈ హ్యాండ్‌సెట్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అందిస్తుంది. ఈ ఒప్పో ఫోన్ వై-ఫై 6, జీపీఎస్, బ్లూటూత్ 5.3, యూఎస్‌బీ టైప్-సి కనెక్టివిటీని అందిస్తుంది. దీని బరువు 177గ్రాములు ఉండగా, డివైజ్ పరిమాణం 162.7 x 74.3 x 7.9మిమీ ఉంటుంది.

Read Also : Vivo X Fold 3 Pro : వివో ఎక్స్ ఫోల్డ్ ప్రో సేల్ మొదలైందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ఈ మడతబెట్టే ఫోన్ ధర ఎంతో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు