OPPO F27 Pro Plus
OPPO F27 Pro Plus : ఒప్పో అభిమానులకు గుడ్ న్యూస్.. వాటర్‌ప్రూఫ్ ఫోన్ కోసం చూస్తున్నారా? మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్. ఒప్పో F27 ప్రో ప్లస్ 5G ఫోన్ (OPPO F27 Pro Plus) బెస్ట్ ఆప్షన్. ప్రస్తుతం బడ్జెట్ ధరలోనే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ షాపింగ్ వెబ్‌సైట్‌లో లిస్ట్ అయింది.
ఈ ఒప్పో ఫోన్ కొనుగోలుపై ఈఎంఐ ఆప్షన్‌తో పాటు బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు. ఈ ఆర్మర్ బాడీ ఫోన్ కింద పడిపోయినప్పుడు కూడా చెక్కుచెదరదు. అద్భుతమైన వాటర్ ప్రూఫ్ ఫోన్ డిస్కౌంట్ ధరకే ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఒప్పో F27 ప్రో ప్లస్ 5G ధర, డిస్కౌంట్ ఆఫర్లు :
ధర విషయానికి వస్తే.. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్‌తో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ధర రూ. 34,999కు సొంతం చేసుకోవచ్చు. మీరు ఫ్లిప్ కార్ట్ నుంచి 45శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ తగ్గింపు తర్వాత ధర రూ. 19,420 అవుతుంది.
బ్యాంక్ ఆఫర్ కింద ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్, ఎస్బీఐ బ్యాంక్ కార్డులపై రూ.971 తగ్గింపు లభిస్తోంది. మీకు రూ.18,850 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. మీరు కోరుకుంటే రూ.938 ఈఎంఐ ఆప్షన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.
ఒప్పో F27 ప్రో ప్లస్ 5G కీలక స్పెషిఫికేషన్లు :
డిస్ ప్లే : 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్ ప్లేతో వస్తుంది. రిజల్యూషన్ 2412×1080 పిక్సెల్స్. గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 డిస్ ప్లే ప్రొటెక్షన్‌తో వస్తుంది.
ప్రాసెసర్ : మల్టీ టాస్కింగ్ కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ కలిగి ఉంది.
ర్యామ్, స్టోరేజ్ : 8GB ర్యామ్, 128GB + 256GB స్టోరేజ్ వేరియంట్
కెమెరా : ఫోటోలు, వీడియోగ్రఫీ కోసం ప్రైమరీ కెమెరా 64MP. ఫ్రంట్ సైడ్ 8MP కెమెరా
బ్యాటరీ : 5000mAh బ్యాటరీ, 67W SuperVOOC ఛార్జింగ్‌తో వస్తుంది. క్షణాల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది.
ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ColorOS 14తో వస్తుంది. IP69, IP68, IP66 వాటర్ రెసిస్టెంట్‌లో ఆర్మర్ బాడీతో వస్తుంది.