Oppo F35 Series Launch : కిర్రాక్ ఫోన్లు బ్రో.. ఒప్పో కొత్త ఫోన్లు వస్తున్నాయ్.. లాంచ్ డేట్, ధర, స్పెక్స్ ఇవే!

Oppo F35 Series Launch : ఒప్పో నుంచి సరికొత్త సరికొత్త సిరీస్ వచ్చేస్తోంది. ఈ నెల 5న భారత మార్కెట్లో లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. పూర్తి ఫీచర్లు, ధర వివరాలివే..

Oppo F35 Series Launch

  • సెల్ఫీ లవర్స్‌కు ఒప్పో గుడ్ న్యూస్.. F35 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్
  • ఒప్పో ఎఫ్35 సిరీస్ లాంచ్.. భారీ బ్యాటరీతో కొత్త 5G ఫోన్లు
  • ఒప్పో ఎఫ్35 సిరీస్‌పై భారీ అంచనాలు.. ధర ఎంత ఉండొచ్చంటే?

Oppo F35 Series Launch : ఒప్పో F35 సిరీస్‌ను 2026 అక్టోబర్ 5న భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. ఈ లైనప్‌లో ఒప్పో F35 ఒప్పో F35 ప్రో ఉంటాయని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లు 8,000mAh బ్యాటరీతో పాటు 50MP మెయిన్ రియర్ కెమెరాతో మార్కెట్లోకి రానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి పూర్తి వివరాలివే..

ఒప్పో F35 సిరీస్ లాంచ్ తేదీ :
భారత మార్కెట్లో ఒప్పో F35 సిరీస్ అక్టోబర్ 5, 2026న లాంచ్ కానుంది. అధికారిక ఒప్పో ఇండియా వెబ్‌సైట్ అధీకృత రిటైల్ స్టోర్‌ల నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

ఒప్పో F35 సిరీస్ స్పెసిఫికేషన్లు (అంచనా) :
స్టాండర్డ్ ఒప్పో F35లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.57-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లే ఉండొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6360 చిప్‌సెట్‌తో పాటు 6GB లేదా 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండొచ్చు.

ఈ ఫోన్‌లో 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో 8,000mAh బ్యాటరీ ఉంటుందని అంచనా. ఫొటోగ్రఫీ కోసం ఒప్పో F35లో 2MP డెప్త్ సెన్సార్‌తో 50MP ప్రైమరీ రియర్ కెమెరా ఉండవచ్చు. ఈ ఫోన్ IP66, IP68, IP69, IP69K రేటింగ్‌లతో మల్టీ లెవల్ ప్రొటెక్షన్ కూడా అందిస్తుందని భావిస్తున్నారు.

Read Also : PM Kisan 24th Installment : పీఎం కిసాన్ 24వ విడతపై బిగ్ అప్‌డేట్.. ఈ తేదీనే రైతుల ఖాతాల్లోకి రూ. 2వేలు.. ఇ-కేవైసీ స్టేటస్‌ చెక్ చేశారా?

మరోవైపు.. ఒప్పో F35 ప్రో 5జీ ఫోన్ 6.78-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుందని అంచనా. 144Hz రిఫ్రెష్ రేట్ 3,600 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7360 మ్యాక్స్ చిప్‌సెట్‌ అందిస్తుందని భావిస్తున్నారు. 8GB ర్యామ్, 128GB, 256GB స్టోరేజ్‌తో వస్తుంది.

ఒప్పో ప్రో మోడల్‌లో 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 8,000mAh బ్యాటరీ కూడా ఉంటుందని అంచనా. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ నుంచి IP68, IP69 రేటింగ్‌లతో రావొచ్చు. కెమెరా సెటప్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50MP మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉండొచ్చు. ఈ ఫోన్ ఫ్రంట్, బ్యాక్ కెమెరాలు రెండింటినీ 4K వీడియోను రికార్డ్ చేయొచ్చు.

లీక్‌ల ప్రకారం.. భారత మార్కెట్లో ఒప్పో F35 ధర రూ. 35వేల నుంచి రూ. 40వేల మధ్య ఉండొచ్చు. ఒప్పో F35 ప్రో 5జీ ధర సుమారు రూ. 45వేల నుంచి రూ. 50వేల మధ్య ఉంటుందని అంచనా. అయితే, ఒప్పో ఇంకా ఈ స్పెసిఫికేషన్లు ధరలన్నింటినీ అధికారికంగా ధృవీకరించలేదు.