Oppo Find X8 Series Launch
Oppo Find X8 Series : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఒప్పో ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. కొత్త ఒప్పో ఫైండ్ X8 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు ఈ ఏప్రిల్‌లో లాంచ్ కానున్నాయి. ఒప్పో కొత్త ఫోన్లలో ఫైండ్ X8s, ఫైండ్ X8s+, ఒప్పో ఫైండ్ X8 అల్ట్రా ఉన్నాయి.
రాబోయే సిరీస్ కోసం అనేక టీజర్ అప్‌డేట్స్ రిలీజ్ అయ్యాయి. అంతేకాదు.. ఇప్పటికే ఒప్పో X8 సిరీస్ బుకింగ్స్ కూడా చైనాలో ప్రారంభమయ్యాయి. మీరు కూడా ఈ ఒప్పో ఫోన్ కొనాలనుకుంటే పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.
చైనాలో ఒప్పో Find X8 సిరీస్ లాంచ్ :
ఒప్పో ఫైండ్ X8 సిరీస్‌లో Find X8s, Find X8s+, Find X8 Ultra ఫోన్లు ఉన్నాయి. కంపెనీ ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ల ప్రీ-బుకింగ్‌ను ప్రారంభించింది. బుకింగ్‌లు చేసే కస్టమర్‌లు ఈ బెనిఫిట్స్ పొందుతారు. ధర విషయానికి వస్తే.. చైనాలో CNY 500 (సుమారు రూ. 5,700) వరకు సబ్సిడీ లభిస్తుంది. అదే సమయంలో మీరు 249 యువాన్ల (సుమారు రూ. 2,850) విలువైన ఒప్పో మాగ్నెటిక్ సక్షన్ సెట్ గిఫ్ట్ బాక్స్‌ను కూడా పొందవచ్చు.
CNY 1200 (సుమారు రూ. 13,700) ఎక్స్ఛేంజ్ ఆఫర్, ఒక ఏడాది పాటు CNY 3800 (సుమారు రూ. 43,500) ఫ్రీ స్క్రీన్ రీప్లేస్‌మెంట్ కూడా పొందవచ్చు. ఒప్పో ఫైండ్ X8 సిరీస్ ఏప్రిల్ 10, 2025న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కంపెనీ ప్యాడ్ 4 ప్రో టాబ్లెట్, వాచ్ X2 మినీ స్మార్ట్‌వాచ్, ఎన్‌కో ఫ్రీ 4 ఇయర్‌బడ్‌లను కూడా లాంచ్ చేయనుంది.
ఒప్పో ఫైండ్ X8s స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ను ‘స్మాల్, స్ట్రాంగ్, ఫియర్స్’ అనే ట్యాగ్‌లైన్‌తో టీజ్ చేశారు. 1.25 మిమీ సన్నని బెజెల్‌తో వస్తుంది. ప్రపంచంలోనే అత్యంత సన్నని బెజెల్ ఫోన్‌గా మారవచ్చు. ఈ ఫోన్ 7.73మిల్లీమీటర్ల కొలతలు, 179 గ్రాముల బరువు ఉంటుంది. ఈ కెమెరా మాడ్యూల్ 2.97mm కొలతలు కలిగి ఉంటుంది. IP69, IP68 రేటింగ్‌లతో మీడియాటెక్ డైమన్షిటీ 9400+ ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5700mAh బ్యాటరీని అందిస్తుంది.
ఒప్పో ఫైండ్ X8 అల్ట్రా డిజైన్ :
ఒప్పో నుంచి వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ రెండర్ ఇమేజ్ ప్రకారం.. ఫ్లాట్ రియర్, సైడ్ ప్యానెల్‌తో వస్తుంది. డిస్‌ప్లే మధ్యలో బ్యాక్ కెమెరా మాడ్యూల్ ఉంది. నాలుగు సెన్సార్లతో హాసెల్‌బ్లాడ్-బ్రాండెడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఎల్ఈడీ ఫ్లాష్ మాడ్యూల్‌ను కూడా కలిగి ఉంటుంది.
అదే సమయంలో, ఈ స్మార్ట్‌ఫోన్ వైపులా యాంటెన్నా లైన్‌లను చూడవచ్చు. పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ కుడి వైపున ఉన్నాయి. యాక్షన్ బటన్ ఎడమ వైపున ఉంది. మైక్రోఫోన్, ఐఆర్ బ్లాస్టర్‌తో కూడా వస్తుంది.