×
Ad

Oppo Find X9 Series : వారెవ్వా.. కిర్రాక్ ఫీచర్లతో ఒప్పో ఫైండ్ X9 సిరీస్ వచ్చేసింది.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు..!

Oppo Find X9 Series : ఒప్పో ఫైండ్ X9 సిరీస్ లాంచ్ అయింది. అద్భుతమైన ఫీచర్లతో ఒప్పో ఫైండ్ x9, ఫైండ్ x9 ప్రో సిరీస్ అందుబాటులో ఉంది. ఫీచర్లు, ధర ఎంతంటే?

oppo find x9 series

Oppo Find X9 Series : కొత్త ఒప్పో ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో ఒప్పో నుంచి సరికొత్త ఫోన్ వచ్చేసింది. ఒప్పో ఫైండ్ X9, ఒప్పో ఫైండ్ X9 ప్రోలతో ఫైండ్ X9 సిరీస్‌ అధికారికంగా లాంచ్ చేసింది. 2025 ఫ్లాగ్‌షిప్ లైనప్‌‌లో కొత్త మోడల్స్ గత ఏడాదిలో ఫైండ్ X8 లైనప్ కన్నా భారీ అప్‌గ్రేడ్స్ అందిస్తుంది.

ముఖ్యంగా కెమెరా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. హాసెల్‌బ్లాడ్ (Oppo Find X9 Series) భాగస్వామ్యంతో ప్రాసెసింగ్ పవర్ ఏఐ ఆధారిత ఫీచర్ల అప్‌గ్రేడ్‌తో రెండు స్మార్ట్‌ఫోన్‌లు 7,000mAh బ్యాటరీ కలిగి ఉన్నాయి. భారీ బ్యాటరీ బ్యాకప్‌, ఒప్పో ఫైండ్ X9, ఫైండ్ X9 ప్రో ధర, స్పెసిఫికేషన్‌లపై ఓసారి లుక్కేయండి.

ఒప్పో ఫైండ్ X9 స్పెసిఫికేషన్లు :
ఒప్పో ఫైండ్ X9 ఫోన్ 6.59-అంగుళాల అమోల్డ్, 1.5K రిజల్యూషన్ (2760 × 1256), 120Hz రిఫ్రెష్ రేట్, 3,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ ఒప్పో ఫోన్ లేటెస్ట్ 3nm మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 12GB ర్యామ్ 512GB స్టోరేజీ సపోర్ట్ చేస్తుంది. 7,025mAh బ్యాటరీతో వస్తుంది.

Read Also : Realme GT 7 Pro : ఇది కదా డిస్కౌంట్.. రియల్‌మి జీటీ 7 ప్రో ధర తగ్గిందోచ్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

80W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ రెండింటికీ సపోర్ట్ చేస్తుంది. 10W రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. కస్టమర్లు హాసెల్‌బ్లాడ్-ట్యూన్‌తో 50MP ట్రిపుల్ కెమెరా కలిగి ఉంది. ఇందులో 50MP మెయిన్ (సోనీ LYT-808, f/1.6, OIS), 50MP అల్ట్రావైడ్ (శాంసంగ్ JN5, f/2.0) 50MP పెరిస్కోప్ టెలిఫోటో (సోనీ LYT-600, 3x ఆప్టికల్ జూమ్, f/2.6, OIS) ఉన్నాయి.

ఒప్పో ఫైండ్ X9 ప్రో స్పెసిఫికేషన్లు :

ఒప్పో ఫైండ్ X9 ప్రో 120Hz రిఫ్రెష్ రేట్, 3,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌ అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌ కూడా కలిగి ఉంది. ఒప్పో ఫైండ్ X9 ప్రో అదే మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌ కలిగి ఉంది. 16GB వరకు ర్యామ్, 512GB స్టోరేజ్‌తో వస్తుంది. 7,500mAh బ్యాటరీ, ఛార్జింగ్ స్పీడ్ కలిగి ఉంది. కెమెరాలో భారీ తేడా ఉంది. ఇందులో 50MP మెయిన్, 50MP అల్ట్రావైడ్, 3x ఆప్టికల్ జూమ్‌తో 200MP పెరిస్కోప్ టెలిఫోటో ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ ఫోన్ 50MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది.

భారత్‌లో ఒప్పో ఫైండ్ X9, X9 ప్రో ధర :
ఒప్పో ఫైండ్ X9 ఫోన్ 12GB + 256GB స్టోరేజ్ ధర రూ.74,999 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, 16GB + 512GB స్టోరేజ్ ధర రూ.84,999కు పొందవచ్చు. ఒప్పో ఫైండ్ X9 ప్రో ఫోన్ 16GB, 512GB వేరియంట్ల ధర రూ.109,999కు పొందవచ్చు. ఈ ఒప్పో ఫైండ్ X9 సిరీస్ ఫోన్ నవంబర్ 21 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్, రిటైల్ ఛానల్ పార్టనర్లకు అందుబాటులో ఉంటుంది.